నిజామాబాద్ అర్బన్ : ప్రభుత్వం పలుమార్లు భూపంపిణీ చేపట్టినా వాటి ప్రయోజనం మాత్రం దళితులు పొందలేకపోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. భూమి దళితుల పేరున ఉంటే..దానిని ఇతరులు అనుభవిస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్ ప్రభుత్వం పంపిణీ చేయనున్న మూడెకరాల భూమైనా దళితులు సద్వినియోగం చేసుకునేలా అధికారులు, పాలకులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నాయి. జిల్లాలో 1982 నుంచి 2013 వరకు దళితులకు 6,149 ఎకరాల భూమిని పంపిణీ చేశారు. 6,060 మంది లబ్ధిదారులకు ఈ భూమిని అందించారు. అయితే ఇందులో ఎంత మంది దళితుల వద్ద ప్రభుత్వం పంపిణీ చేసిన భూమి ఉందో చెప్పడం కష్టమేనని అంటున్నారు.
దళితులకు పంపిణీ చేసిన భూమిలో సగం వరకు ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇటు భూపంపిణీ జరుగగానే అటు కబ్జాదారులు, రియల్‌ఎస్టేట్ వ్యాపారులు ఎగురేసుకుపోతున్నారు. మరి కొందరు దళితులను మభ్యపెట్టి తక్కువ ధరకు కొనుగోలు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన భూమి అడవులు, గుట్టల ప్రాంతంలో ఉండడంతో దళితులు సైతం సాగుచేయలేని స్థితిలో ఇతరులకు అమ్మేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అధికారులు సైతం దళితుల భూమి అన్యాక్రాంతమవుతుంటే చేష్టలుడిగి చూడడం తప్ప చర్యలు తీసుకున్న సందర్భాలు లేవు. నిజామాబాద్ శివారులోని అర్సపల్లి ప్రాంతంలో ఒక కాంగ్రెస్ నాయకుడు, కొంతమంది వ్యాపారస్తులు కలిసి 20 ఎకరాల వరకు దళితుల భూమిని అక్రమించుకున్నారు.
తాడ్వాయి, మాచారెడ్డి, బిచ్కుంద, మాక్లూర్ ప్రాంతాల్లో దళితులకు కేటాయించిన భూమి ఇతరుల స్వాధీనంలో ఉంది. రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు దళితుల భూములకు ఎసరు పెడుతున్నారని అరోపణలు ఉన్నాయి. లబ్ధిదారులను ఊరించి, మభ్యపెట్టి ఈ తతంగం కొనసాగిస్తున్నారు. డిచ్‌పల్లి మండలంలో తెలంగాణ యూనివర్సిటీ వద్ద ఒక రాజకీయ నాయకుడు పెద్ద ఎత్తున భూములను ఆక్రమించుకున్నట్లు సమాచారం. నిజామాబాద్ మండలం ఎల్లమ్మకుంట వద్ద, నిజామాబాద్‌లోని 4వ పోలీస్‌స్టేషన్ ప్రాంతా లలో దళితుల భూములు అక్రమణకు గురయ్యాయి. జిల్లాలో చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది.
ప్రస్తుతం టీఆర్‌ఎస్ ప్రభుత్వం దళితుల అభ్యున్నతి కోసం అన్ని ప్రభుత్వాల కంటే మరో ముందడుగు వేసింది. దళితులకు మూడు ఎకరాల భూమి కే టా యించేందుకు నిర్ణయించింది. జిల్లాలోని 3,393 మంది లబ్ధిదారులకు మొదటి విడతలోనే భూమిని అందిచాలని ప్రణాళిక రూపొందించారు. విడతలవారీగా దళితు లకు భూమి కేటాయించనున్నారు.
దళితుల భూములు క్షేమమేనా!
Published Tue, Aug 5 2014 12:43 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement