బయ్యారం (ఖమ్మం): ప్రజల తరఫున ప్రతిఘటన ఉద్యమాలు చేసేందుకు అజ్ఞాతంలో చేరిన తాను ఉద్యమాన్ని వీడుతున్నట్లు వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని న్యూడెమోక్రసీ ఖమ్మం జిల్లా బయ్యారం ఏరియా దళకమాండర్ జగన్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన సాక్షితో మాట్లాడారు. కొందరు వ్యక్తులు కుట్రపూరితంగా తాను లొంగిపోతున్నట్లు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు.
చంద్రన్నవర్గం నాయకత్వ విధానాలు నచ్చక ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. చంద్రన్నవర్గానికి చెందిన అశోక్, సాగర్, తాను ఇంతకాలం చేసిన ఉద్యమానికి బహుమానంగా ఉపయోగంలో లేని ఆయుధాన్ని ఇచ్చారన్నారు. ఆ ఆయుధాన్ని కూడా వారికే అప్పగించి సీసీలైన్‌లో కొనసాగుతున్న న్యూడెమోక్రసీ(రాయలవర్గం)లో చేరానన్నారు.