మెదక్ (పుల్కల్): సింగూరు ఎత్తి పోతల పథకాన్ని ఆగస్టు 15న ప్రారంభిస్తామని భారీ నీటిపారుదల మంత్రి హరీశ్ రావు మంగళవారం పేర్కొన్నారు. ప్రాజెక్టుతో పుల్కల్, ఆందోల్ మండలాల్లో పదివేల ఎకరాలకు సాగు నీరు అందుతుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. సింగూరు ప్రాజెక్టు నిర్మాణంలో అలసత్వం ప్రదర్శిస్తే కాంట్రాక్టర్ల బ్లాక్ లిస్టులో పెడతామని మంత్రి హెచ్చరించారు. అదే విధంగా అధికారులకు కూడా మంత్రి పలు సూచనలు చేశారు.