
అవినీతిపరుల ఆటకట్టిస్తాం
నీటి పారుదల శాఖలో అవినీతి కుంభకోణాలపై విచారణ జరిపించి, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి హరీష్‌రావు తెలిపారు.
పటాన్‌చెరు: నీటి పారుదల శాఖలో అవినీతి కుంభకోణాలపై విచారణ జరిపించి, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి హరీష్‌రావు తెలిపారు. చెరువుల మరమ్మతుల పేరిట సొమ్మును స్వాహా చేసిన వారి నుంచి డబ్బులు రాబడతామన్నారు.
శుక్రవారం పటాన్‌చెరు మండలం లక్డారం గ్రామంలో మన ఊరు-మన ప్రణాళిక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామంలో జరిగిన చెరువు మరమ్మతుల పేరిట కాంట్రాక్టర్లు, అధికారులు కలిసి నిధులు కాజేశారని స్థానికులు కొందరు మంత్రి దృష్టికి తేవడంతో ఆయన పై విధంగా స్పందించారు. గ్రామ ఆదాయం, వ్యయాలపై మనఊరు-మన ప్రణాళిక కార్యక్రమంలో చర్చించారు.
కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ డా.ఎ.శరత్, జెడ్పీ చైర్‌పర్సన్ బాలమణి, ఎమ్మెల్యే గుడెం మహిపాల్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్య, వైద్యం, మంచినీరు, పారిశుద్ధ్యం అంశాలపై చర్చ జరిగింది. మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ నీటి పారుదల శాఖ పరిధిలో ల క్డారంలో రూ.50 లక్షల నిధులను కాంట్రాక్టర్లు కాజేశారనే ఆరోపణలపై కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. చీఫ్ ఇంజినీర్ లేదా సూపరింటెండెంట్ ఇంజినీర్ స్థాయి అధికారితో ఎంక్వయిరీ కమిటీని వేస్తామన్నారు.
పూర్తి ఆధారాల తో నిందితులపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు ఏ విషయంలోనూ అధికారులకు లంచాలు ఇవ్వరాదన్నారు. లబ్ధిదారుల ఎంపిక, ప్రణాళిక రచన, వాటి పై చర్యలు ప్రజల మధ్యనే గ్రామ సభల్లో నిర్వహిస్తామన్నా రు. గ్రామ అభివృద్ధిలో గ్రామస్తులందరి ఆలోచనల మేరకు నిధుల కేటాయింపు ఉంటుందన్నారు. ఎవరికైనా రేషన్ కా ర్డు ఇవ్వాలన్నా, వృద్ధాప్య పించన్ ఇవ్వాలన్నా గ్రామ సభ నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందన్నారు.
ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజినీర్‌కు మెమో
మన ఊరు-మన ప్రణాళికలో భాగంగా మంచినీటి సమస్యపై చర్చ నిర్వహిస్తుండగా గ్రామ మహిళలు కొందరు లేచి వారానికి ఒకసారి కూడా తమకు నీళ్లు రావడం లేదని తెలి పారు. ఈ మధ్య కాలంలో వేసిన పైప్‌లైన్ తరుచూ పగిలి పోతుందని దాంతో సమస్య ఉత్పన్నమవుతుందని సర్పంచ్ ప్రభు మంత్రి దృష్టి కి తెచ్చారు. దీంతో హరీష్‌రావు కల్పిం చుకుని ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ సంగమేశ్వర్‌ను వివరణ కో రారు. ఆయన ఇచ్చిన జవాబుకు హరీష్‌రావు సంతృప్తి చెందగా ఆయనకు మెమో ఇస్తున్నట్లు ప్రకటించారు. నాసిరకమైన పనులు జరి గినా కాంట్రాక్టర్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదని హెచ్చరించారు. వాస్తవానికి ఆయనను(ఏఈ) సస్పెండ్ చేయాల్సి ఉన్నా తొలిసారి తప్పిదంగా మెమో మాత్రమే ఇచ్చి సరిపుచ్చుతున్నానని హరీష్‌రావు హెచ్చరించారు.
గ్రామానికి కా వాల్సిన శాశ్వత మంచినీటి పథకాన్ని త్వరలోనే మంజూరు చేస్తానన్నారు. ఓ రైతు లేచి తమ గ్రామంలో ఉన్న అంగారుకుంట చెరువుపై మట్టి పోసిన కాంట్రాక్టర్ ఒకే రోజులోనే రూ. 3 లక్షల పనిచేసినట్లు చెప్పారని ఆరోపించారు. మిగతా రైతులు కూడా గ్రామంలోని కుంటలు, చెరువుల పేర్లను చెబుతూ ఎక్కడెక్కడా ఎలా అవినీతి జరిగిందో వివరిం చారు. ఇరిగేషన్ శాఖ ఏఈ జనార్ధన్ మంత్రి హరీష్‌రావు అడిగిన ప్రశ్నలకు జవాబు ఇవ్వలేక నీళ్లు నమిలారు.
కుంభకోణంపై నిగ్గు తేల్చాల్సిందే..
లక్డారం గ్రామంతో పాటు పటాన్‌చెరు నియోజకవర్గంలో గత పాలకుల కాలంలో ఇరిగేషన్ శాఖలో ఏ రకమైన పనులు చేయకుండానే రూ. 12 కోట్ల నిధులను అధికారులు, కాంట్రాక్టర్లు కలిసి కాజేశారని ఎమ్మెల్యే గుడెం మహిపాల్‌రెడ్డి ఆరోపించారు. ఇరిగేషన్ శాఖలో జరిగిన మొత్తం కుంభకోనంలో విచారణ జరిపి ఆ సొమ్మును రికవరీ చేయాలని మంత్రి హరీష్‌రావుకు విజ్ఞప్తి చేశారు. జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ డా.శరత్ మాట్లాడుతూ లక్డారం గ్రామ పరిధిలో ఉన్న క్రషర్‌ల నుంచి పంచాయతీ వారు ఆస్తిపన్ను కింద ఏటా రూ.10 లక్షలు వసూలు చేయాలని ఆదేశించారు. విద్యార్థులెవరు ప్రైవేటు స్కూళ్లకు వెళ్లరాదని ప్రభుత్వ స్కూళ్లలోనే నాణ్యమైన విద్య అందుతుందన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ శ్రీశైలం యాదవ్, ఎంపీడీఓ అనంత్‌రెడ్డి, గ్రామ కార్యదర్శి నరేందర్‌రెడ్డి, తహశీల్దార్ మహిపాల్‌రెడ్డి, సీఐ శంకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నియోజక వర్గ ఇంచార్జి గాలి అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.