నలుగురి ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడుల్లో రూ.152 కోట్ల విలువైన సంపద బయటపడింది. బెంగళూరు లో నవంబర్ 30 నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు దాడులు నిర్వ హించినట్లు ఐటీ అధికారులు ప్రకట నలో వెల్లడించారు. ఇద్దరు ప్రభుత్వ ఇంజనీర్లు, ఇద్దరు కాంట్రాక్టర్ల ఇళ్లు, కార్యాలయాలతో పాటు వారి బంధు వులు, స్నేహితుల ఇళ్లలో సోదాలు జరిపామన్నారు. రూ.6 కోట్లకు పైగా బయట పడిన నగదులో రూ.5.7 కోట్ల విలువ చేసే కొత్త రూ.2 వేల నోట్లు ఉన్నాయి.