ఐటీడీఏలో ఉద్యోగులే కాంట్రాక్టర్లు | Employees Are Becoming Contractors In ITDA, Adilabad | Sakshi
Sakshi News home page

ఐటీడీఏలో ఉద్యోగులే కాంట్రాక్టర్లు

Published Tue, Aug 13 2019 8:30 AM | Last Updated on Tue, Aug 13 2019 8:30 AM

Employees Are Becoming Contractors In ITDA, Adilabad - Sakshi

ఐటీడీఏ విశ్రాంతి భవనం

సాక్షి, ఆదిలాబాద్‌ : ఐటీడీఏలో ఉద్యోగులే కాంట్రాక్టర్ల అవతారమెత్తుతున్నారు. ఇష్టార్యాజంగా వ్యవహరిస్తూ అదే శాఖ పరిధిలోని కార్యాలయాలు, స్కూళ్లు, గెస్ట్‌ హౌజ్‌ల పనులు టెండర్లు పిలవకుండానే పనులు చేపడుతున్నారని విమర్శలు గుప్పుమంటున్నాయి. దీని వెనుక ఓ అధికారి హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఐటీడీఏ శాఖలోని ఉద్యోగులతో పనులు చేయించి బిల్లులు తీసుకోవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. 

టెండర్లు లేవు..
ఆ శాఖ పరిధిలోని కార్యాలయాలు, స్కూళ్లు, ఇతర భవనాలు శిథిలావస్థకు చేరితే వాటిని మరమ్మతు చేయించడం మంచి పనే. కానీ దానికి ఓ పద్ధతి ఉంటుంది. ఆయా పనులకు ఎంత ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆ పనులను తక్కువ ధరకు చేయించేలా రూపకల్పన చేస్తారు. దాని ప్రకారం టెండర్లను ఆహ్వానిస్తారు. టెండర్లకు హాజరైన కాంట్రాక్టర్లలో ఎవరు తక్కువ ధరకు పనులు చేస్తారో వారికి పనులు అప్పగిస్తారు. పైగా పనులకు సంబంధించి ఎప్పటికప్పుడు ఐటీడీఏ పరిధిలో పని చేసే ఇంజనీర్లు పర్యవేక్షిస్తారు. పద్ధతి ప్రకారం వారు రికార్డు చేస్తేనే కాంట్రాక్టర్‌కు బిల్లులు వస్తాయి. కానీ ఐటీడీఏ పరిధిలో జరుగుతున్న కొన్ని పనులకు టెండర్లు పిలువకుండానే వివిధ పనులను చేపట్టారని తెలుస్తోంది.

ఉద్యోగులకు పనులు..
సర్వ సాధారణంగా ఏవైనా పనులు చేపట్టాలంటే సంబంధిత శాఖకు చెందని వారికి అప్పజెప్పాల్సి ఉంటుంది. కానీ ఐటీడీఏలో మాత్రం అలా జరగడం లేదని ఆరోపణలు లేకపోలేదు. సంబంధిత శాఖ ఉద్యోగులే కాం ట్రాక్టర్ల అవతారం ఎత్తినట్లు తెలుస్తోంది. లక్షల విలువైన పనులన్ని ఉద్యోగుల పేరిటే జరుగుతున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని ఐటీడీఏ క్యాంపు కార్యాలయంతో పాటు గెస్ట్‌ హౌజ్, మరమ్మతులకు లక్షల రూపాయల ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అంతే కా కుండా వివిధ ఆశ్రమ పాఠశాలల్లో వైరింగ్, పే యింటింగ్, తదితర పనుల పేరిట అదే శాఖలో పని చేస్తున్న కొందరు ఉద్యోగులకు పనులు అ ప్పజెప్పినట్లు తెలుస్తోంది. అయితే వీరికి ఓ అ« దికారి అండదండలు ఉన్నట్లు గుసగుసలు వి నిపిస్తున్నాయి.

ఎన్నికల కంటే ముందు..
ఎన్నికల కోడ్‌ కంటే ముందు వివిధ సంఘాల నాయకులు ఐటీడీఏ గెస్ట్‌ హౌజ్‌కు మరమ్మతులు చేయాలని పలుమార్లు విన్నవించినా ఆ శా ఖ అధికారులు పట్టించుకోలేదని విమర్శలు న్నాయి. ఎన్నికల అధికారుల కోసం విశ్రాంతి భవనాలకు మరమ్మతులు చేస్తున్నామని అ ధి కారులు చెప్తున్నారు. ఎన్నికల కోడ్‌ అ మల్లోకి రాకముందు పట్టించుకోని అధికారులు కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత పనులు చేపట్టడంలో ఆంతర్యమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement