
గౌహతి: అస్సాంలోని నాగావ్ జిల్లాలో సబ్-ఇన్‌స్పెక్టర్ రభాను అవినీతి ఆరోపణలతో అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆమె మజులీ జిల్లాలోని కోర్టు ఆమెను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు పోలీసులు తెలిపారు. రభా గత నెలలో తన కాబోయే భర్తను అరెస్టు చేసి లేడీ సింగంగా పేరుతెచ్చుకున్న ఆమె ఇప్పుడు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఇద్దరు కాంట్రాక్టర్లు రభా తన కాబోయే భర్త రాణా పోగాగ్‌తో కలిసి ఓఎన్‌జీలో ఉద్యోగాలు, కాంట్రాక్టులు ఇప్పిస్తానంటూ ఆర్థిక ఒప్పందాలు కుదుర్చుకుని మోసం చేశారంటూ పిర్యాదు చేశారని పోలీసుల తెలిపారు.
ఆమె కాబోయే భర్త పోగాగ్ రభా తరుపున డబ్బులు వసూలు చేసేరనే ఆరోపణలు కూడా రావడంతో ఆమెను విచారణకు ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గతేడాది అక్టోబర్‌లో ఆమెకు పోగాగ్‌తో నిశ్చితార్థం కాగా ఈ ఏడాది నవంబర్‌లో వివాహం జరగాల్సి ఉంది. ఐతే ఈ ఏడాది జనవరిలో బిహ్‌పురియా ఎమ్మెల్యే అమియా కుమార్ భుయాన్‌తో ఆమె జరిపిన ఫోన్ సంభాషణ లీక్ కావడంతో రభా ఈ వివాదంలో చిక్కుకుంది. లీక్ అయిన ఆ ఆడియో టేప్ తీవ్ర దుమారానికి తెరలేపింది. పైగా ఆయన తన నియోజక వర్గ ప్రజలను వేధింపులకు గురి చేస్తున్నారంటూ రభా పై ఆరోపణలు గుప్పించారు.
(చదవండి: చిచ్చురేపిన భూ వివాదం...దంపతులపై ట్రాక్టర్ ఎక్కించి..)
Comments
Please login to add a commentAdd a comment