* జీవో 146ను అమలు చేయాలని ప్రభుత్వానికి
* ఇరిగేషన్ కాంట్రాక్టర్ల విన్నపం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న భారీ, మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టుల్లో పెరిగిన ధరలకు అనుగుణంగా కాంట్రాక్టర్లకు అదనపు చెల్లింపులు చేస్తున్న విధానాన్నే చిన్నతరహా సాగునీటి ప్రాజెక్టు(మైనర్ ఇరిగేషన్) పనులకూ వర్తింప జేయాలన్న డిమాండ్ వస్తోంది. ఈ విధానాన్ని తమకూ వర్తింప జేయాలని కోరుతూ మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ల కాంట్రాక్టర్ల అసోసియేషన్ ప్రభుత్వానికి విన్నవించుకుంది.
దీనిపై పరిశీలన చేసి ఓ నిర్ణయానికి రావాలని ప్రభుత్వం... రాష్ట్ర నీటి పారుదల శాఖకు సూచించింది. రాష్ట్రంలోని భారీ, మధ్య తరహా ప్రాజెక్టులకు పెరిగిన ధరలకు అనుగుణంగా అదనపు చెల్లించేందుకు వీలుగా ప్రభుత్వం జీవో-146ను 25 రోజుల కిందట జారీ చేసింది. ఇదే విధానం ఇప్పుడు మైనర్ ఇరిగేషన్‌కు వర్తింప జేయాలని కాంట్రాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు.
‘మైనర్’కూ అదనపు చెల్లింపు?
Published Fri, Oct 30 2015 1:29 AM | Last Updated on Sun, Sep 3 2017 11:41 AM
Advertisement
Advertisement