‘మిషన్ కాకతీయ’తో కాంట్రాక్టర్లకు ఉపాధి’
హైదరాబాద్: మిషన్ కాకతీయ పనులతో ప్రభుత్వం కాంట్రాక్టర్లకు ఉపాధి కల్పించిందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రాష్ట్రంలోని 48వేల చెరువులకు గాను కేవలం పదివేల చెరువుల్లోనే పనులు ప్రారంభించారని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో చేపట్టిన పనులను కూడా తన ఖాతాలో వేసుకుంటూ మిషన్ కాకతీయ వందశాతం విజయవంతమైనట్లు ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసుకుంటోందని ఆరోపించారు.
ఈ పథకం అమలు తీరుపై ప్రభుత్వం శ్వేతపత్రం వెలువరించాలని డిమాండ్ చేశారు. దీనిపై బహిరంగ చర్చకు మంత్రి హరీష్‌రావు సిద్ధమా అని ఆయన సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి, గవర్నర్ తరచూ ఎందుకు భేటీ అవుతున్నారో ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ మంత్రులతో గవర్నర్ కాళ్లు మొక్కించటం అత్యంత దురదృష్టకరమని పొన్నం వ్యాఖ్యానించారు.