సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఆయన ఓ అధికారపార్టీ నేత. ఆయన పేరు చెబితే జిల్లా పశ్చిమ ప్రాంతంలో వ్యాపారులు, కాంట్రాక్టర్లు వణికిపోతున్నారు. అంతలా తనదైన శైలిలో వరుస దందాలతో హల్‌చల్ చేస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లర్లు.. బంగారు వ్యాపారులు తదితరుల నుంచి మామూళ్లు చాలదన్నట్లు.. తాజాగా కాంట్రాక్టర్ల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం.
ఇవ్వకపోతే హెచ్చరికలు చేయటం.. అధికార బలం ఉపయోగించి ఏదోరకంగా వారిని ఇబ్బందులు పెడుతున్నట్లు తెలిసింది. తాజాగా ఓ రోడ్డు కాంట్రాక్టర్‌ను రూ.10 కోట్లదాకా డిమాండ్ చేశారట. అడిగినంత ఇవ్వకపోతే రోడ్డు పనులు సజావుగా జరగనివ్వనని తీవ్రస్థాయిలో హెచ్చరికలు చేసినట్లు తెలిసింది. టీడీపీ నేత బెదిరింపులకు కాంట్రాక్టర్ బెంబేలెత్తిపోతున్నాడు. ఆ నేత అడిగినంత ఇస్తే నష్టం వస్తుందని ఆందోళన చెందుతున్నారని ఆయన సన్నిహితులు వాపోతున్నారు.
వివరాల్లో కెళితే... ఏర్పేడు-రాపూరు పెంచలకోన వరకు 84 కి.మీ మేర నాలుగులైన్ల రోడ్డు నిర్మాణం పనులకు కొద్దిరోజుల క్రితం టెండర్లు జరిగాయి. ఈ రోడ్డు నిర్మాణానికి రూ.290 కోట్ల అంచనా వ్యయం. రోడ్డు పనులకు సంబంధించి ఓ కాంట్రాక్టర్ 25 శాతం తక్కువతో టెండర్ దక్కించుకున్నారు. ప్రస్తుతం వెంకటగిరి- రాపూరు మార్గంలో పనులు జరుగుతున్నాయి. రోడ్డు పనులు జరుగుతున్న విషయం తెలుసుకున్న అధికార పార్టీకి చెందిన ఓ నేత కొద్దిరోజులక్రితం కాంట్రాక్టర్‌కు సమాచారం పంపారు. అనుచరులతో రూ.10 కోట్లు పంపమని హుకుం జారీ చేసినట్లు సమాచారం. అయితే తన వద్ద లేవని, పార్టనర్స్‌తో మాట్లాడి చెబుతామని చెప్పిపంపినట్లు తెలిసింది. రోజులు గడుస్తున్నా కాంట్రాక్టర్ నుంచి ఎటువంటి సమాచారం రాకపోవటంతో కాంట్రాక్టర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. పనులు నాసిరకంగా చేస్తున్నారంటూ మండిపడ్డారు. రోడ్డు పనులపై త్వరలో విజిలెన్స్ అధికారులతో తనిఖీలు చేయిస్తానని హెచ్చరించినట్లు సమాచారం. టీడీపీ నేత హెచ్చరికలతో ఆ కాంట్రాక్టర్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ అధినేతకు సైతం ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. డక్కిలి మండలంలో 6 కిలోమీటర్ల మే ర చేపట్టిన పనులను జరగనివ్వకుండా తమ్ముళ్లతో నిలిపివేయించారు. రోడ్డుకు అవసరమైన మట్టి తరలింపును అడ్డుకోవడంతో పనులు నిలిచిపోయాయి.
నాసంగతేంటి?
Published Wed, Feb 18 2015 2:13 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement
Advertisement