కామారెడ్డి : పనులు పంచుకుందామనుకున్న కాంట్రాక్టర్లు కంగు తిన్నారు. మంగళవారం ‘సాక్షి’లో ‘గుత్తేదార్లు రింగయ్యారు’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనం స్థానికంగా కలకలం రేపింది. కామారెడ్డి నియోజకవర్గంలో అధికార,ప్రతిపక్ష పార్టీలకు దగ్గరగా ఉండే కాంట్రాక్టర్లు కొందరు ‘మిషన్ కాకతీ య’ టెండర్ల ప్రక్రియ కొనసాగుతుండగానే ముం దస్తుగా సమావేశమై పనులను పంచుకున్నారు. ఈ వ్యవహారం ‘సాక్షి’లో ప్రచురితం కావడంతో వా రంతా ఉలిక్కిపడ్డారు. తరువాత ఏం చేయూలనే వి షయంపై అందరూ కలిసి చర్చించుకున్నారని సమాచారం.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘మిషన్ కాకతీయ’ కార్యక్రమాన్ని చేపట్టింది. కాంట్రాక్టర్లు మాత్రం సిండికేట్‌గా మారుతూ సర్కారు ఆశయూనికి తూట్లు పొడుస్తున్నారు. పనులు నాణ్యతతో జరగాలని ప్రజాప్రతినిధిలు కోరుకుంటుండగా, కాంట్రాక్టర్లు అధిక లాభాలు గడించేం దుకు అడ్డదారులు తొక్కుతుండడం విస్మయం కలిగిస్తోంది.
ఇందుకు తమ పేర్లు వాడుకుంటున్నారని తెలి సిన కొందరు ప్రజాప్రతినిధులు కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. పోటీపడి తక్కువ ధరకు టెండర్లు దాఖలు చేయడం, లేదం టే కుమ్ముక్కై అధిక ధరలను కోట్ చేసి ప్రజాధనాన్ని కొల్లగొట్టడం ఎంతవరకు సమంజసమని మండిపడినట్టు తెలుస్తోంది. ‘మిషన్ కాకతీయ’ పనులలో ఎలాంటి అక్రమాలు జరుగకూడదన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఆన్‌లైన్‌లోనే టెండర్లు పిలిచింది.గు త్తేదార్లు దానిని కూడా ఓవర్ టేక్ చేసి, ప్రభుత్వాదాయూనికి గండి కొట్టాలనే ప్రయత్నాలపై ఆగ్రహం వ్యక్తమైంది.
ఇంటెలిజెన్స్ ఆరా
టెండర్లను దక్కించుకునేందుకు ముందస్తుగానే రింగయిన విషయం ‘సాక్షి’లో రావడంతో ఇంటెలిజెన్స్ విభాగం రంగంలోకి దిగింది. ఎవరెవరు ఎన్నెన్ని పనులు పం చుకున్నారు అనే వివరాలను అధికారులు ఆరా తీశారు. పనులను పంచుకోవడానికి కాంట్రాక్టర్లు అసోసియేషన్‌గా ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ అసోసియేషన్‌లో ఇరు పార్టీలకు చెందినవారు పదవులు కూడా సమానంగా పంచుకున్నట్టు సమాచారం. దీనిపై కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీశాయి.
ఇప్పుడేం చేద్దాం?
Published Wed, Feb 18 2015 2:47 AM | Last Updated on Sat, Sep 2 2017 9:29 PM
Advertisement