గద్వాల న్యూటౌన్, న్యూస్‌లైన్: ఎప్పటిలాగే కాంట్రాక్టర్లు ‘రింగ్’ అ య్యారు. పోటీకి వచ్చిన వారి మధ్య రా జీ ఒప్పందాలు కుదిరి జూరాల పరిధిలో జరిగిన టెండర్లను కలిసి పంచుకున్నారు. వివరాల్లోకెళ్తే..జూరాల ప్రధాన ఎడమకా ల్వ డిస్ట్రిబ్యూటర్ 19 నుంచి 29 వరకు, 40వ డిస్ట్రిబ్యూటరీ పరిధిలో రాతి, మట్టి కట్టడాల లైనింగ్ పనులు, మరమ్మతులకు సంబంధించిన సుమారు 62 పనులకు పీజేపీ ఎగ్జిక్యూటివ్ డివిజన్-2 అధికారులు టెండర్లు ఆహ్వానించారు.
సు మారు రూ.రెండుకోట్ల వ్యయంతో చేపట్టే ఈ పనులకు 393 షెడ్యూలు జారీ అయ్యాయి. షెడ్యూలు దాఖలు చేయడానికి బుధవారం చివరి గడువుగా నిర్ణయించారు. మరమ్మతు పనులు కావడంతో పెద్దఎత్తున డబ్బులు మిగులుతాయన్న ఉద్దేశంతో కాంట్రాక్టర్లు పెద్ద సంఖ్యలో పోటీపడ్డారు. కార్యాలయం ఆవరణలోనే పెబ్బేరు, వీపనగండ్ల, కొల్లాపూర్ ప్రాంతాలకు చెందినవారు రాజీ ఒప్పందాలు చేసుకున్నారు. అందులో భాగంగా సుమారు 30 పనులకు సిండికేట్ అయ్యి అంచనారేట్లకు షెడ్యూళ్లను దాఖలు చేశారు. మిగిలిన పనులకు కాంట్రాక్టర్ల మధ్య రాజీ ప్రయత్నాలు బెడిసికొట్టి ఎవరికి వారే లెస్‌రేట్లకు షెడ్యూళ్లను దాఖలు చేసినట్లు తెలిసింది.
ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయంలో..
గద్వాల, మక్తల్ పరిధిలోని తాగునీటి పైపుల అటాచ్‌మెంట్ పనులకు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు బుధవారం టెండర్లు పిలిచారు. రూ.64.64 లక్షల వ్యయంతో చేపట్టే 9 పనులకు 79 షెడ్యూళ్లను జారీ చేశారు. ఈ టెండర్లలో సైతం కాంట్రాక్టర్ల మధ్య రాజీ ఒప్పం దాలు కుదిరాయి. ఆరు పనులకు కాం ట్రాక్టర్లు సిండికేట్ అయ్యి అంచనారేట్లకు షెడ్యూళ్లను దాఖలు చేశారు. మూడు పనులకు కాంట్రాక్టర్ల మధ్య జరిగిన రింగ్‌యత్నాలు ఫలించలేదు. దీంతో పోటాపోటీగా లెస్ రేట్లకు షెడ్యూలు దాఖలుచేశారు.
తప్పుపట్టిన వాహనాల
టెండర్లలో రింగ్
అమరచింత : పీజేపీ నందిమల్ల డివిజన్-2 పరిధిలో ఏళ్ల తరబడి తుప్పుపట్టిన వాహనాలకు అధికారులు టెండర్లు ఆహ్వానించారు. నాలుగు రోజులుగా జరుగుతున్న ఈ ప్రక్రియ బుధవారం ముగిసింది. క్యాంపు పరిధిలో ఆరు వాహనాలకు టెండర్లను ఆహ్వానించగా, ఆయా ప్రాంతాల నుంచి కాంట్రాక్టర్లు షెడ్యూళ్లకోసం భారీగా తరలొచ్చారు.
నందిమల్ల, ఆత్మకూర్ పట్టణాలకు చెందిన కాంట్రాక్టర్లు వారితో రహస్య మంతనాలు జరిపి టెండర్లు వేయకుండా గుడ్‌విల్ రూపంలో డబ్బులు పంచిపెట్టారు. చివరికి నందిమల్ల గ్రామానికి చెందిన మణివర్దన్ నాలుగు వాహనాలు, ఆత్మకూర్‌కు చెందిన కోల్ల బషీర్ ఒకటి, సత్యారెడ్డి ఒకటి టెండర్లలో దక్కించుకున్నట్లు పీజేపీ ఈఈ రవీందర్ వివరించారు.
కాంట్రాక్టర్ల టెండ‘రింగ్’
Published Thu, Nov 28 2013 3:58 AM | Last Updated on Sat, Sep 2 2017 1:02 AM
Advertisement
Advertisement