
నలుగురి ఇళ్లల్లో 152 కోట్ల ఆస్తులు
కర్ణాటకలో దడ పుట్టించిన ఐటీ దాడులు
సాక్షి, బెంగళూరు: నలుగురి ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడుల్లో రూ.152 కోట్ల విలువైన సంపద బయటపడింది. బెంగళూరు లో నవంబర్ 30 నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు దాడులు నిర్వ హించినట్లు ఐటీ అధికారులు ప్రకట నలో వెల్లడించారు. ఇద్దరు ప్రభుత్వ ఇంజనీర్లు, ఇద్దరు కాంట్రాక్టర్ల ఇళ్లు, కార్యాలయాలతో పాటు వారి బంధు వులు, స్నేహితుల ఇళ్లలో సోదాలు జరిపామన్నారు. రూ.6 కోట్లకు పైగా బయట పడిన నగదులో రూ.5.7 కోట్ల విలువ చేసే కొత్త రూ.2 వేల నోట్లు ఉన్నాయి.
దాదాపు 7 కిలోల బంగారం, వెండి బిస్కెట్లు, 9 కిలోల ఆభరణాలు సోదాల్లో వెలుగు చూశాయి. వందల కోట్ల విలువ చేసే స్థిర, చరాస్తులు, విలాసవం తమైన కార్లు బయటపడ్డాయి. ఇందుకు సంబంధించి కావేరి నిరావరి నిగమ మేనేజింగ్ డెరైక్టర్ చిక్కరాయప్ప, ప్రజాపనుల శాఖలో చీఫ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ జయచంద్రను సస్పెండ్ చేస్తున్నట్లు రాష్ట్ర హోం శాఖ మంత్రి పరమేశ్వర్ విధానపరిషత్‌లో వెల్లడించారు. మరో ఇద్దరు కాంట్రాక్టర్లపై కేసు నమోదు చేశారు.