ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ నిప్పులాంటి మనిషి, ముట్టుకుంటే కాలిపోతారని టీఆర్‌ఎస్ నేతలు టీడీపీ నేత రేవంత్‌రెడ్డిని హెచ్చరించారు. ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచి ఈటల రాజకీయాల్లో ఉన్నారని, ఇప్పుడు ఆర్థికమంత్రిగా సమర్థంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు.