
108 ఉద్యోగుల రాస్తారోకో
న్యాయమైన డిమాండ్ల సాధన కోసం 108 కాంట్రాక్ట్ ఉద్యోగులు చేస్తున్న సమ్మెపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని...
హన్మకొండ చౌరస్తా: న్యాయమైన డిమాండ్ల సాధన కోసం 108 కాంట్రాక్ట్ ఉద్యోగులు చేస్తున్న సమ్మెపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని తెలంగాణ యునెటైడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయూస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు యాదానాయక్ డిమాండ్ చేశారు. బాల సముద్రంలోని ఏకశిలపార్కు వద్ద 108 ఉద్యోగులు మంగళ వారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా యాదానాయక్ మాట్లాడారు.
పదేళ్లుగా అత్యవసర అంబులెన్స్ సర్వీసుల్లో పని చేస్తున్నా.. తమ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. గతంలో రెండుసార్లు చేసిన సమ్మె సందర్భంగా జరిగిన ఒప్పందాలను విస్మరిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే 108 సర్వీసులను నిర్వహించాలని, తొలగించిన కార్మికులను తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీహెచ్. రమేష్, పి. వెంకన్న, ఏఎస్‌రావు, ప్రవీణ్, ఆర్ కే కొమురయ్య, బాలాజీ, సాంబయ్య, రాజేందర్, ప్రేమ్ సాగర్, నాగరాజు, స్వాతి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.