- ఏఐకేఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి
రైతులను పట్టించుకోని ప్రభుత్వం
Published Mon, Aug 29 2016 12:00 AM | Last Updated on Mon, Sep 4 2017 11:19 AM
న్యూశాయంపేట : రాష్ట్రంలో వర్షాలు సరిగా లేక భూగర్భ జలాలు అడుగంటి వేసిన పంటలు ఎండిపోతున్నాయని రాష్ట్రవ్యాప్తంగా 230 మం డలాల్లో కరువుఛాయలు నెలకొన్నాయని అభిల భారత కిసాన్‌సభ జాతీయ ఉపాధ్యక్షుడు సా రంపెల్లి మల్లారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆది వారం తెలంగాణ రైతు సంఘం జిల్లా స్థాయి సమావేశం జిల్లా ఉపాధ్యక్షుడు శెట్టి వెంకన్న అధ్య„ý తన రాంనగర్‌లో జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసమే మిషన్ కాకతీయ,మిషన్ భగీర ధ సాగునీటి ప్రాజెక్టులంటూ వేలాది కోట్లు ఖర్చు చేస్తూ ఇంత వరకు ఒక్క ఎకరానికి సాగునీటి సౌకర్యం కల్పించలేదని విమర్శించా రు. కాంట్రాక్టర్లు అవినీతి పరులకు వత్తాసు పలుకుతూ పబ్బం గడుపుతున్నారన్నారు. కరువుతో అల్లాడుతున్న గత సంవత్సరం ఒక్కపైసా కూడా ఖర్చుచేసి ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోలేదన్నారు. సమావేశంలో నాయకులు బి. రాంచంద్రారెడ్డి, పి.రమేష్, కనాకారెడ్డి, వెంకట్‌రెడ్డి, రాజమౌళి, రాజన్న పాల్గొన్నారు.
Advertisement