
మొక్కజొన్న రైతుకు ఊరట
మహబూబ్‌నగర్ వ్యవసాయం: మొక్కజొన్నకు గిట్టుబాటు ధర లభించక ఏటా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ప్రభుత్వం ఊరట కల్పించనుంది.
మహబూబ్‌నగర్ వ్యవసాయం:
మొక్కజొన్నకు గిట్టుబాటు ధర లభించక ఏటా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ప్రభుత్వం ఊరట కల్పించనుంది. ఈ ఏడాది వర్షాభావా పరిస్థితుల కారణంగా దిగుబడి సరిగా రాకపోవడంతో రైతులు ఇప్పటికే డీలా పడ్డారు. ఈ నేపథ్యంలో జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈకేంద్రాలు అక్టోబర్ 1 నుంచి అందుబాటులోకి రానున్నారుు. దీంతో రైతులు నేరుగా ధాన్యాన్ని విక్రరుుంచి గిట్టుబాటు ధర పొందేందుకు అవకాశం ఏర్పడింది. జిల్లాలో 10 కౌంటర్లు ఏర్పాటు కానున్నట్లు సమాచారం. ఇందుకు సంబందించి రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నట్లు అధికారులు పేరొకన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు బాదేపల్లి, వనపర్తిటౌన్,నాగర్‌కర్నూల్, అచ్చంపేట, షాద్‌నగర్, కల్వకుర్తి, నవాబ్‌పేట్, అలంపూర్, మహబూబ్‌నగర్ మార్కెట్‌యాల్లో కేంద్రాలను ఏర్పాటు చేయూలని ప్రతిపాదనలు పంపారు. దీనికితోడు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు మార్క్‌ఫెడ్, పీఏసిఏస్, హాకా ఏజెన్సీలు మందుకు వచ్చాయి.
కొనుగోలు సాఫీగా సాగేనా?
గత ఏడాది ఖరీఫ్‌లో జిల్లాలో 1.61లక్షల హెక్టార్లలో మొక్కజొన్న సాగు చేయగా, ఈ ఏడాది 1.53లక్షల హెక్టార్లలో సాగరుు్యంది. దీనికితోడు అకాల వర్షాల కారణంగా పంట దెబ్బతినడంతో దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. కాగా గత ఏడాది జిల్లాలో ప్రభుత్వం 7 కేంద్రాలను ఏర్పాటు చేస్తూ మార్క్‌ఫెడ్‌కు కొనుగోలు బాధ్యత అప్పగించింది.
అరుుతే మార్క్‌ఫెడ్ వద్ద సిబ్బంది లేక పోవడంతో వారు పీఏసిఎస్‌లకు బాధ్యతలను అప్పగించారు. దీంతో నిర్వహణ లోపాల కారణంగా గోదాములు, గన్నీ బ్యాగులను సకాలంలో సిద్ధం చేసుకోలేకపోయూరు. ఈ కారణంగా ్రపైవేటు ఏజెన్సీలు 16.21లక్షల క్వింటాళ్లు కొనుగోలు చేయగా మార్క్‌ఫెడ్ 5.73లక్షల క్వింటాళ్లను మాత్రమే కొనుగోలు చేసింది. వ్యాపారులు అత్యధికంగా రైతులకు క్వింటాకు రూ.1100 నుంచి 1250 వరకు మాత్రమే చెల్లించడంతో రైతులు నష్టపోవాల్సి వచ్చింది. కొన్ని చోట ప్రైవేటు ఏజెన్సీలు కొనుగోలు చేసిన పంటను ప్రభుత్వ కొనుగోలు సెంటర్ల అమ్మినట్లు ఆరోపణలు వెలువెత్తాయి. ఈ సారైనా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోని కొనుగోలు సాఫీగా జరిగేలా చూడాలని రైతులు కోరుతున్నారు.
రైతులు నాణ్యమైన సరుకు తెవాలి
- మార్కెటింగ్‌శాఖ ఏడీ బాలమణి
జిల్లాలో 10 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు అవసరం ఉన్నట్లు గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపాం. 10 కేంద్రాల్లో కొనుగోలు జరిగే అవకాశం ఉంది. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకువచ్చి మద్దతుధర(రూ.1310/క్విటా)ను పొందాలి. రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని మాత్రమే మార్కెట్‌లకు తీసుకురావాలి.