భద్రాచలం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదలాయించిన ఏడు మండలాలను విలీనం చేసుకునే ప్రక్రియను అక్కడి ప్రభుత్వం వేగవంతం చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేను ముంపు మండలాల్లో నిలిపివేయటమే కాక, ముఖ్యమంత్రి కేసీఆర్ ముంపు కథ ముగిసినట్లేనని స్వ యంగా ప్రకటించటంతో దీనిపై స్పష్టత వచ్చినట్లయింది. ముంపు మండలాల్లో త మ పాలన సాగించేందుకు ఏపీ ప్రభుత్వం శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన రాష్ట్ర పునర్విభజన బిల్లు ప్రకారం ఈ ఏడాది జూన్ 2 నుంచి ముంపు మండలాలు ఆంధ్రప్రదేశ్‌కు బదలాయిం చిన విషయం విదితమే.
ఈ క్రమంలో ఆం ధ్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉభయ గో దావరి జిల్లాల అధికారులు విలీన వ్యవహా రానికి సంబంధించిన ఒక్కో ప్రక్రియను వ రుసగా చేస్తున్నారు. ఇప్పటికే ముంపు మం డలాల్లో ఉభయ గోదావరి జిల్లా పరిషత్ అధికారుల ఆదేశానుసారమే మండల పరిషత్ ఎన్నికలు జరిగాయి. మద్యం దుకాణాలు కూడా ఏపీ ఎక్సైజ్ శాఖ కిందనే నడుస్తున్నాయి. విలీన ప్రక్రియలో భాగంగా ముంపు మండలాల ప్రజాభిప్రాయ సేకరణ నిమిత్తం గ్రామసభలను నిర్వహించాలని ఉభయ గోదావరి జిల్లా కలెక్టర్‌లు గెజిట్ కూడా జారీ చేశారు.
దీని ప్రకారం ఈ నెల 30 లోపు ప్రజాభిప్రాయాన్ని చెప్పా ల్సి ఉంటుంది. గ్రామసభలు జరుగకపోయినా పునర్విభజన చట్టం ప్రకారం పాలన పగ్గాలు చేపట్టే క్రమంలోనే గెజిట్ జారీ చేసి, వీటిని స్వాధీనం చేసుకునే దిశగా అక్కడి అధికారులు చకా చకా ఏర్పాట్లు చే సు కుపోతున్నారు. భద్రాచలం డివిజన్‌లోని నాలుగు మండలాల్లో 277 రెవెన్యూ గ్రామాలకు చెందిన 1,31,528 మంది జనాభా తూర్పుగోదావరి జిల్లాలో కలువనున్నారు. ఇక పాల్వంచ డివిజన్‌లోని బూ ర్గంపాడు మండలంలోని 6, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని 41 రెవెన్యూ గ్రామాలకు చెందిన 58,776 మంది పశ్చిమ గోదావరి జిల్లాలో కలువనున్నారు.
అక్టోబర్ 2 నుంచి పాలన..
ముంపు మండలాల్లో అక్టోబర్ 2 నుంచి పాలన చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు ఏర్పాట్లు చేసుకోవాలని ఉభయ గోదావరి జిల్లాలకు ఆదేశాలు అందినట్లు సమాచారం. తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వ చ్చిన నేపథ్యంలో ఈ లోగానే అప్పగింతల తంతు ముగించేందుకు ఖమ్మం జిల్లాకు చెందిన అధికారులు కూడా సిద్ధమవుతున్నారు. భద్రాచలం డివిజన్‌లో చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, భద్రాచలం( భద్రాచలం రెవెన్యూ గ్రామం తెలంగాణాలోనే ఉంటుంది), పాల్వంచ డివిజన్‌లోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాలతో పాటు బూర్గంపాడు మండలంలోని 6 రెవెన్యూ గ్రామాలను అధికారికంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పగించనున్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని అక్టోబర్ 2 నుంచి ఉభయ గోదావరి జిల్లాల అధికారులే ఆయా మండలాల్లో పూర్తి స్థాయిలో పాలన వ్యవహారాలు చూసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ముంపులో ఖాళీలు అక్కడి వారితోనే భర్తీ..
ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించిన మండలాల్లో ప్రస్తుతం వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన అధికారులు, ఉద్యోగులతోనే భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయని ఓ డివిజన్ స్థాయి అధికారి ‘సాక్షి’కి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో సాధారణ బదిలీలపై ఉన్న నిషేధం ఎత్తివేసిన నేపథ్యంలో ఉద్యోగులెవైరె నా ముంపు మండలాలకు వెళ్తామని కోరుకుంటే వారితోనే భర్తీ చేసే అవకాశం ఉందని సమాచారం.
ముంపులో పనిచేసేందుకు ముందుకొచ్చే ఉద్యోగులు, అధికారులకు ప్రోత్సాహకాలు కూడా ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. ముందుగా పోలీసు సిబ్బంది నియామకంపై ఉన్నతాధికారులు దృష్టి సారించనున్నట్లు సమాచారం. ఇక ముంపు మండలాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రం పరిధిలోకే వస్తారు. అయితే 80 శాతం మంది వరకు తెలంగాణలోకే వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, ఆయా మండలాలకు చెందిన సుమారు 20 శాతం మంది ఉద్యోగులు ఆప్షన్‌లు తీసుకొని అక్కడే ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగుల విభజన పూర్తిస్థాయిలో జరిగే వరకూ పాలన వ్యవహారాలకు ఇబ్బంది లేకుండా ప్రస్తుతం ఉన్న ఖాళీలనే ప్రాతిపదికగా తీసుకొని భర్తీ చేసేందుకు ఉభయ గోదావరి జిల్లాల అధికారులు కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలిసింది.
ముంపులో ఉంటారా... బయటకు వస్తారా..?
ముంపు మండలాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఆప్షన్‌లు ఇచ్చి వారు కోరుకున్న రాష్ట్రంలో పనిచేసేలా ఇరు రాష్ట్ర ప్రభుత్వాల సీఎస్‌లు ఒక అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముంపులో పనిచేస్తున్న ఉద్యోగుల అభిప్రాయాలను తెలుసుకునేందకు జిల్లా అధికారులు సిద్ధమయ్యారు. ఆంధ్రరాష్ట్రంలోకి వెళ్లిన ముంపులో పనిచేస్తారా..? తెలంగాణ రాష్ట్రానికి వస్తారా..? అనే అంశాలతో కూడిన ఒక నమూనాను రూపొందించి ముంపు మండల అధికారులకు పంపించారు. ఉద్యోగి కేడర్, వారి నెలసరి వేతనం, ఏ రాష్ట్రంలో పనిచేస్తారనే దానిపై వారి అభిప్రాయం తెలుసుకునే క్రమంలోనే ఖమ్మం జిల్లా అధికారులు ఈ ఏర్పాట్లు చేశారు. మొత్తంగా చూస్తే సెప్టెంబర్ నెలాఖరు నాటికి ఈ అప్పగింతల ప్రక్రియ పూర్తి కావచ్చని తెలుస్తోంది.
ముహూర్తం ఖరారు!
Published Fri, Aug 22 2014 1:59 AM | Last Updated on Sat, Sep 2 2017 12:14 PM
Advertisement
Advertisement