
పద్మానగర్‌లో వైద్యశిబిరం
పట్టణంలో అత్యధికంగా తెలుగు వారు నివసించే పద్మానగర్ ప్రాంతంలోని అఖిల పద్మశాలి సమాజ్ మంగళ కార్యాలయం ఎదురుగా వడ్లకొండ నివాస్‌లో రాజీవ్ గాంధీ జీవందాయి ఆరోగ్య యోజన కార్డు శిబిరాన్ని సోషల్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు.
భివండీ, న్యూస్‌లైన్: పట్టణంలో అత్యధికంగా తెలుగు వారు నివసించే పద్మానగర్ ప్రాంతంలోని అఖిల పద్మశాలి సమాజ్ మంగళ కార్యాలయం ఎదురుగా వడ్లకొండ నివాస్‌లో రాజీవ్ గాంధీ జీవందాయి ఆరోగ్య యోజన కార్డు శిబిరాన్ని సోషల్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసోసియే షన్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబడిన రాజీవ్ గాంధీ జీవందాయి ఆరోగ్య బీమా యోజన ప్రస్తుతం ప్రజల చెంతకు చేరడంతో పట్టణంలోని తెలుగు ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
32 మంది సభ్యుల బృందంతో ఎన్‌జీవో నడుపుతున్న సోషల్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసోసియోషన్ (షేవ-ఏఉగిఅ) ఆధ్వర్యంలో శిబిరాన్ని ఎర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలు అందజేస్తున్నందుకు స్థానికులు అభినందనలు తెలిపారు. భివండీ పట్టణం పవర్‌లూమ్ పరిశ్రమలతో కూడి ఉండటం వలన ఇక్కడి కార్మికులు తరచూ అనారోగ్యానికి గురౌవుతుంటారు. కార్పొరేషన్ పరిధిలో నడుస్తున్న ఇంధిరాగాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి రెండేళ్ల క్రితం డిప్యూటి సివిల్ ఆసుపత్రి హోదా లభించినా ఆసుపత్రిలో అన్ని సదుపాయాలు లేక ప్రజలు అప్పులు చేసి ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. అయితే వారి బాధలను అర్థం చేసుకున్న బృందం తమ వంతు సహకారాలు అం దిస్తోంది.
పట్టణంలో ఉన్న పేద ప్రజలతో పాటు దినపత్రికలలో ఆర్థిక సహాయం కావాలని వచ్చిన కథనాలకు కూడా సేవలు అందించామని ఎన్‌జీవోలోని మార్కెటింగ్ డెరైక్టర్ కొండి మల్లేశం తెలిపారు. ఈ మధ్య కాలంలో సోషల్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్‌జీవోను ప్రారంభించి ఈ నెల 1న ఉదయం 10 నుంచి 5 గంటల వరకు 262 మంది గుర్తింపు పత్రాలను, వారి మోబైల్ నంబర్లను సేకరించామన్నారు.
తిరిగి శనివారం ఉదయం 10 నుంచి ప్రారంభమైన ఈ శిబిరలంలో 777 మంది పత్రాలను సేకరించినట్లు చెప్పారు. ఆదివారం కూడా ఈ శిబిరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల వినోద్, వడ్లకొండ నితిన్, దూస నరేష్, బల్లూరి చంద్రశేఖర్, ఇప్పలపెల్లి దిగంబర్ కుస్మ ప్రవీన్, సుధామణి, నవీన్, కోడం గణేశ్ తదితరులు పాల్గొన్నారు.