లబ్బీపేట : వైద్య ఉద్యోగుల్లో బదిలీల టెన్షన్ నెలకొంది. వైద్య, ఆరోగ్యశాఖలో బదిలీలకు ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలు జారీచేయడంతో ఎంతో కాలంగా నగరంలోనే తిష్టవేసిన ఉద్యోగుల్లో ఆందోళన ప్రారంభమైంది. ఐదేళ్లు నిండిన వారందరినీ కచ్చితంగా బదిలీ చేయాలని, రెం డేళ్లు నిండిన వారిని రిక్వెస్ట్‌పై బదిలీ చేయవచ్చని పేర్కొనడంతో ఎవరు బదిలీ అవుతారనే ఆందోళన మొదలైంది. ఇక్కడ పనిచేస్తున్న వారిలో జోనల్ కేడర్‌లో మూడింట రెండొం తుల మంది ఐదేళ్లకుపైగా సర్వీసు పూర్తి చేసిన వారుండగా, పదేళ్లుగా ఇక్కడే పనిచేస్తున్న వారు సగంమంది ఉన్నారు. వారందరికీ బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఆన్‌లైన్ కౌన్సెలింగ్
ఈ బదిలీల కౌన్సెలింగ్‌ను తొలిసారిగా ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. ఒకేచోట ఐదేళ్లు పైగా పనిచేస్తున్నవారు ఎక్కడికి కోరుకుంటున్నారో ఆప్షన్స్ ఇస్తే వాటికనుగుణంగా బదిలీ చేస్తారు. రాజకీయ సిఫార్సులు చెల్లుబాటయ్యే అవకాశాలు లేవని తెలిసింది. ఇప్పటికే పలువురు సిఫార్సుల కోసం రాజకీయ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ైవె ద్య, ఆరోగ్యశాఖ బదిలీ కమిటీ చైర్మన్‌గా పూనం మాలకొండయ్య ఉండడంతో సిఫార్సులు పట్టించుకోరని సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.
ప్రభుత్వాస్పత్రిలో 109 మంది స్టాఫ్ నర్సులుండగా.. వారిలో మూడో వంతు మంది బదిలీ అయ్యే అవకాశముంది. సీనియారిటీ ఆధారంగా దీర్ఘకాలంగా పనిచేస్తున్న సిబ్బంది నగరంలో ఉన్నారు. హెడ్‌నర్సులు ప్రస్తుతం 25 మంది పనిచేస్తుండగా, వారిలో ఆరుగురు బదిలీ అయ్యే అవకాశం ఉంది. సీనియర్‌అసిస్టెంట్లు పదేళ్లుగా పనిచేస్తుండడంతో వారు కూడా బదిలీ అయ్యే అవకాశం ఉంది. హెచ్‌వీలు, ల్యాబ్‌టెక్నీషియన్స్, హెల్త్ అసిస్టెంట్లపై కూడా బదిలీ వేటు పడే అవకాశం ఉంది.
వైద్య ఉద్యోగుల్లో బదిలీల టెన్షన్
Published Wed, May 27 2015 2:38 AM | Last Updated on Sun, Sep 3 2017 2:44 AM
Advertisement