నమ్మిన రైతుకు వెన్నుపోటు! | Back farmer believers! | Sakshi
Sakshi News home page

నమ్మిన రైతుకు వెన్నుపోటు!

Published Mon, Dec 29 2014 5:23 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM

నమ్మిన రైతుకు వెన్నుపోటు! - Sakshi

నమ్మిన రైతుకు వెన్నుపోటు!

రైతుల్ని ఎన్ని విధాలా రుణభారం నుండి తప్పించవచ్చన్నది పక్కనబెట్టి, రైతుల్ని ఎన్ని విధాలా రుణమాఫీ పథకం నుండి తప్పించవచ్చని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. రుణమాఫీతో విముక్తి ప్రసాదించకపోగా, రైతు ప్రపంచంలో కొత్త కల్లోలాన్ని సృష్టించింది. ఏపీ రైతుల్లో చంద్రబాబు మీద ఏ కాస్త అనుమానం వచ్చినా కొత్త ప్రభుత్వం రూపు రేఖలే మారిపోయి ఉండేవి.
 
రైతు రుణమాఫీ చేసి తీరుతానని గత ఎన్నికల్లో చంద్రబాబు వాగ్దా నం చేశారు. అది సాధ్యం కాదని తన రాజకీయ ప్రత్యర్ధి జగన్మో హన్‌రెడ్డి అన్నప్పుడు బాబు ఎద్దే వా చేశారు. అసాధ్యాన్ని సాధ్యం చేసే చరిత్ర తమకు ఉన్నదన్నారు.  టీడీపీ ఎన్నికల ప్రణాళికలోను రై తు రుణమాఫీ హామీని ప్రముఖంగా ప్రచురించారు. ఐదు కోట్ల మంది జనాభా గల రాష్ర్టంలో ఉన్న దాదాపు 85 లక్షల మంది రైతులు తమ రుణవిముక్తి ప్రదాత చంద్ర బాబు రూపంలో వచ్చాడని నమ్మారు. మొన్నటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పదమూడు జిల్లాల్లో టీడీపీకి పడిన ఓట్లలో అత్యధికం రైతు కుటుంబాల నుండి వచ్చినవే.  

ఈ ఎన్నికల్లో టీడీపీ, వైయస్సార్ సీపీల మధ్య ఓట్ల తేడా వెంట్రుకవాసి మాత్రమే. ఏపీ రైతుల్లో చంద్రబాబు మీద వెంట్రుకవాసి అనుమానం వచ్చినా కొత్త ప్రభుత్వం రూపు రేఖలే మారిపోయి ఉండేవి. వ్యవసాయాన్ని వృత్తిగా కొనసాగించడం వేరు. వ్యవ సాయ భూమిని కలిగి ఉండటం వేరు. వ్యవసాయాన్ని వృత్తిగా సాగించేవాళ్లలో కౌలు రైతులు, వ్యవసాయ కూలీ లు ఉంటారు. వాళ్లిద్దరూ చంద్రబాబు రుణమాఫీ ఖాతా లో లేరు. బాబు ఖాతాలో ఉన్నది వ్యవసాయ భూమిని కలిగి ఉన్న రైతులు మాత్రమే.

తొలి అడుగులోనే వారు వ్యవసాయ జనాభాని సగానికి పైగా నరికేశారు. రైతు రుణాల్లో పంటరుణం, వ్యవసాయరుణం, కుటుంబ రుణం ఒకదానితో మరొకటి ముడిపడి ఉంటాయని వ్యవ సాయార్థిక అంశంపై పరిశోధనా వ్యాసం రాసిన చంద్ర బాబుకు మరింత లోతుగా తెలుసు. ఎన్నికల ప్రచారం లోనూ, ఎన్నికల ప్రణాళికలోనూ బాబు రైతు రుణం మాఫీ చేస్తానని చెప్పారే గానీ పంటరుణం మాత్రమే మా ఫీ చేస్తానని ఎప్పుడూ, ఎక్కడా చెప్పలేదు.  పంట రుణం సాధారణంగా ఎకరాకు 20 - 25  వేల రూపాయల మేర మాత్రమే ఉంటుంది. రెండెకరాల రైతుగా జీవితాన్ని మొదలు పెట్టిన చంద్రబాబుకు పంటరుణం వేల రూపాయల్లోనూ, రైతు రుణం లక్షల రూపాయల్లోనూ ఉంటుందని అనుభవపూర్వకంగా తెలుసు.
 
ఎన్నికల ముందు రైతు రుణాలన్నీ వ్యవసాయ రుణాలన్న చంద్రబాబు, వారి ప్రచారకర్తలు వాటిని ఇప్పు డు తుంగలో తొక్కారు. ఇప్పుడు పంటరుణాన్ని సహితం పక్కన పెట్టడానికి వాళ్లంతా పడరానిపాట్లు పడుతు న్నారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అనే కొత్త ఆయుధాన్ని కనిపె ట్టింది వీళ్లే. రైతులు పంటరుణం ఎంత తీసుకున్నారు? అనేదాన్ని పక్కనపెట్టి, పంటరుణం  ఎంత తీసుకోవడా నికి అర్హులు? అనేదాన్ని స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రాతిపదికగా తీసుకుంటుంది. అంటే రైతులకున్న పంటరుణంలో కూ డా వీరు భారీ కోత పెట్టారన్నమాట.
 
అనేక వ్యవసాయ పరపతి సొసైటీలతో పాటూ కొన్ని బ్యాంకు ల్లో కూడా టైటిల్ డీడ్, పాస్ పుస్తకాలను తాకట్టు పెట్టుకోకుండానే పంటరుణం ఇవ్వడం అనేది చాలా కాలంగా సాంప్రదాయంగా వస్తోంది. దానికి విరుద్ధంగా ఇప్పుడు ఏపీ ప్రభుత్వం డాక్యుమెంట్లు తాకట్టు పెట్టని పంట రుణాల్ని అండర్ ప్రాసెస్‌గా ఆన్‌లైన్లో పెడుతున్నా రు. అలాంటి రుణాలు ఎప్పటికీ మాఫీ కావని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సిహెచ్ కుటుంబరావు తేల్చేశారు. ఆస్తులు, పొలాలు పంచుకున్న తరువాత కూడా అన్నద మ్ములు ఒకే ఇంట్లో తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉండ టం గ్రామీణ ప్రాంతంలో సాధారణ విషయం. అనేక సందర్భాల్లో అన్నదమ్ముల పేర్లు ఒకే రేషన్ కార్డులో ఉం టాయి.  అలాంటి అన్నదమ్ములు చెరో కొంత భూమి మీద చెరో కొంత పంటరుణాన్ని తీసుకుని ఉంటే, ఇద్దరి లో ఒక్కరికి మాత్రమే పంటరుణం మాఫీ అవుతుంది. ఒక రేషన్ కార్డుపై ఒకరికే రుణ మాఫీ అనేది కొత్త నిబంధన. అంటే, చంద్రబాబు పంటరుణం పథకం గ్రామీణ ఉమ్మడి కుటుంబాల్లో కొత్త చిచ్చు రగుల్చుతోంది.
 
రుణమాఫీకి సంబంధిత పత్రాలు పోయిన సంద ర్భాల్లో  వాటి ట్రూ- కాపీల కోసం  బ్యాంకుల, పాలక మండళ్లు, రెవెన్యూ అధికారులను కలవాల్సి ఉంటుంది. వ్యవసాయదారుల్లో  అత్యధికులు నిరక్షరాస్యులు. వయో వృద్ధులు. ఇన్ని కార్యాలయాల చుట్టూ తిరిగి రుణ  మాఫీ పత్రాలని సక్రమంగా సేకరించి, సమర్పించడం అనేది వాళ్లవల్ల అయ్యే పనికాదు. ఇప్పటి ఆంధ్రప్రదేశ్‌లో వ్యవ సాయ భూములు ఉండి, ఇతర రాష్ట్రాల్లో ఆధార్ కార్డులు ఉన్న రైతులు రుణమాఫీ పొందడానికి అనర్హులని ప్రణాళి కా సంఘం ప్రకటించింది. ఆరు నెలల క్రితం విడిపోయిన తెలంగాణ రాష్ర్టంలోనే కాదు, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోనూ ఆంధ్రా రైతులు పెద్ద సంఖ్యలో నివాసం ఉంటున్నారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణు డు హైదరాబాద్‌లోని ఆంధ్రా రైతు లకు రుణమాఫీ అం శాన్ని పరిశీలిస్తున్నామని అన్నారు.

వారి ప్రకటన వచ్చిన గంటలోపే ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సిహెచ్ కుటుంబరావు ప్రతిస్పందిస్తూ అది అసాధ్యమని తేల్చేశా రు. ఇప్పటికీ హైదరాబాద్‌లోనే నివాసం ఉంటూ, అక్కడే ఆధార్ కార్డు ఓటరు ఐడి కలిగి ఉన్న చంద్రబాబు గారికి పొరుగు రాష్ర్టంలో ఎమ్మెల్యేగా పోటీచేసి, ముఖ్యమంత్రి కావడానికి  కూడా సహకరించిన నిబంధనలు, రైతుల దగ్గ రికి రాగానే అడ్డుకట్టగా ఎలా మారిపోతున్నా యో  మరి. రైతుల్ని ఎన్ని విధా లా రుణభారం నుండి తప్పించవచ్చు అని కాక, రైతుల్ని ఎన్ని విధాలా రుణమాఫీ పథకం నుం డి తప్పించవచ్చు అని చంద్రబాబు ప్రభుత్వం ఆలోచిస్తు న్నది. ఇది విషాదం!

(వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు సామాజిక విశ్లేషకులు, మొబైల్ నంబర్ : 90107 57776)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement