రేషన్ కోత | Ration cuts | Sakshi
Sakshi News home page

రేషన్ కోత

Published Wed, Oct 15 2014 11:37 PM | Last Updated on Sat, Sep 2 2017 2:54 PM

రేషన్ కోత

రేషన్ కోత

సాక్షి, గుంటూరు:
 పేదల నోటికాడి ముద్దను ప్రభుత్వం లాగేసుకోంటోంది. రేషన్ కార్డులకు ఆధార్ అనుసంధానం పేరుతో రేషన్‌కార్డుల్లో భారీగా కోత పెడుతోంది. కుంటి సాకులు చూపుతూ పేద ప్రజల కడుపుకొడుతోంది. ఆధార్ కార్డులు అందించిన వారికి సైతం కొందరికి  రేషన్ నిలిపి వేసింది. దీంతో భారీ సంఖ్యలో కార్డుదారులు రేషన్, ఆధార్ కార్డులు చేత పట్టుకొని రెవెన్యూ కార్యాలయాల చుట్టు తిరుగుతున్నారు.

మళ్లీ ఆధార్ కార్డు ఇస్తే సీడింగ్ చేస్తామని అధికారులు చెబుతుండటంతో కార్యాలయాల్లో బారులు తీరుతున్నారు. కావాలనే కార్డుల్లో కోత విధించిందని పాలకులను శాపనార్థాలు పెడుతున్నారు. ముఖ్యంగా ఈ పరిస్థితి గుంటూరు నగరంతోపాటు, మున్సిపాలిటీల్లో ఎక్కువగా ఉంది. జిల్లాలో 1,81,036 రేషన్‌కార్డులు, 9,83,663 వ్యక్తిగత యూనిట్లలకు ఈనెలలో రేషన్ బియ్యాన్ని నిలిపి వేశారు. దీంతో పేద ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

 రేషన్ కేటాయింపులు ఇలా... జిల్లాలో గతంలో మొత్తం 13,88,348 రేషన్ కార్డులు, 43,21,408 వ్యక్తిగత యూనిట్లకు 19,248.96 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేసేవారు. ప్రస్తుతం ఆధార్ కార్డుల అనుసంధానం అనంతం ఈ నెల కోటాకు సంబంధించి 12,07,312 కార్డులు, 33,37,745 వ్యక్తిగత యూనిట్లకు 15217.591 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మాత్రమే కేటాయించారు. అంటే దాదాపు 1,81,036 కార్డులు, 9,83,663 యూనిట్లకు 4031.369 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కోత విధించారు. దీంతో పేద ప్రజలకు రేషన్ బియ్యం అందక తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు.

 పేదలం బతికేదెలా?.. స్వర్ణభారతినగర్‌లోని 244 నంబరు రేషన్ షాపు ద్వారా రేషన్ తీసుకుంటాను. ఆధార్ నిర్ణీత సమయానికి ముందే రేషన్ షాపులో ఇచ్చాను. ఈ రోజు ఉదయం రేషన్ షాపుకు వెళ్తే నీ కార్డుకు రేషన్ కేటాయించలేదు అని షాపు నిర్వాహకుడు చెప్పడంతో కంగుతిన్నాను. గుమస్తాగా పని చేసి కుటుంబాన్ని పోషించుకునే నాలాంటి పేదలకు ఇలా చేప్తే ఎలా అని ప్రశ్నించాను. రేషన్ ఎందుకు ఆపారో అర్ధం కావడంలేదనిమా డీలర్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

పేదలంటే అధికారులకు ఇంత అలుసా? పని మానుకొని అధికారుల చుట్టూ తిరగాలంటే బతికేదెలా? - నరసింహారావు, స్వర్ణభారతినగర్, గుంటూరు పస్తులుండాల్సిందేనా..?.. గత నెల కూడా 142 షాపు ద్వారా రేషన్ తీసుకున్నాను. కుటుంబసభ్యుల ఆధార్ కార్డులన్నీ గత నెలలోనే ఇచ్చాను. అయినా ఈనెల రేషన్ ఆపారు. గతంలో కంది పప్పు, నూనె కూడా ఇచ్చేవారు. ఇప్పుడు బియ్యం కూడా ఆపేశారు. అసలే నిరు పేదలం. బియ్యం కూడా ఇవ్వకపోతే పస్తులు ఉండాలా ? - గట్టు వెంకటరమణ, నల్లచెరువు, గుంటూరు

 ఇదేమి న్యాయం..
 నాకు 97 నంబరు షాపులో రేషన్ ఇస్తున్నారు. ఆధార్ అన్నీ ఇచ్చాను. ఈ రోజు రేషన్ షాపుకు వెళితే కార్డులో అమ్మాయి పేరు తీసేశారని చెప్పారు. కార్డులోని నలుగురిలో ఒకరి పేరు తీసేసి రేషన్ తగ్గించడం ఏమి న్యాయం? నిరుపేదలం మాకు రేషన్ బియ్యమే ఆధారం ఇక్కడికి రావటం వలన కూలీ డబ్బులు పోయాయి.
 - ఎస్.కె ఖైరు, పాత గుంటూరు
 
 కోతకు ముందూ.. తర్వాత
 కార్డు రకం                                    కార్డుల సంఖ్య                            వ్యక్తిగత యూనిట్లు
                                              గతంలో        {పస్తుతం                    గతంలో        ప్రస్తుతం
 తెల్లకార్డులు                      12,49,644        10,93,838      39,24,405    30,46,022
 అంత్యోదయ                           82,640             73,219         2,33,982       1,75,242
 అన్నపూర్ణ                                1,374                 939                 1721             1,119
 ఎన్టీఆర్  పింఛను                      54,690            39,316         1,61,300       1,17,362
 కూపన్లు    
 మొత్తం                               13,88,348       12,07,312      43,21,408    33,37,745 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement