ఎన్నికలకు రెడీ! | GHMC election process completes | Sakshi
Sakshi News home page

ఎన్నికలకు రెడీ!

Published Tue, May 26 2015 1:55 AM | Last Updated on Sun, Sep 3 2017 2:40 AM

ఎన్నికలకు రెడీ!

ఎన్నికలకు రెడీ!

- జూన్ నెలాఖరులో డీలిమిటేషన్ జాబితా
- ఎన్నికల నిర్వహణకు రూ.36 కోట్లు
- విధులకు 50 వేల మంది సిబ్బంది
- వెబ్‌సైట్‌లో రిజర్వేషన్ల వివరాలు
సాక్షి,సిటీబ్యూరో:
జీహెచ్‌ఎంసీ ఎన్నికల దిశగా ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. హైకోర్టు ఆదేశాల మేరకు డిసెంబర్ 15లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. ఆమేరకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఎన్నికల నిర్వహణక య్యే వ్యయం... అవసరమైన సిబ్బంది... రిజర్వేషన్ల ప్రక్రియ ఎప్పుడు పూర్తి కానుందనే అంశాలపై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి సోమవారం తన కార్యాలయంలో జీహెచ్‌ంఎసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
 
డిసెంబర్ 15లోగా ఎన్నికలు పూర్తి కావాలంటే... అంతకంటే 45 రోజుల ముందు... అంటే అక్టోబర్ నెలాఖరులోగా వార్డుల విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉందన్నారు.  వార్డుల (డివిజన్ల) విభజన, ఇతరత్రా పనులు ఏ మేరకు వచ్చిందీ అధికారులను ఆరా తీశారు. దీనిపై జీహెచ్‌ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్ కుమార్ బదులిస్తూ ఎన్నికల నిర్వహణ .. వార్డుల విభజనకు సంబంధించి క్షేత్ర స్థాయి పనులు పూర్తయ్యాయని తెలిపారు.
 
కార్యాలయ పనులు మాత్రం మిగిలి ఉన్నాయని చెప్పారు. జూన్ చివరి వారంలో ప్రభుత్వ ఆదేశాలు అందగానే వార్డుల డీలిమిటేషన్ తుది జాబితాను ప్రకటిస్తామన్నారు. వార్డుల సంఖ్య 150 నుంచి 200కు పెరగనున్నాయని చెప్పారు. వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల జాబితాలు రూపొందిస్తామన్నారు. బీసీ ఓటర్ల గుర్తింపునకు ఇంటింటి సర్వే నిర్వహిస్తామని తెలిపారు. అక్టోబర్ 31లోగా ఎట్టి పరిస్థితుల్లోనూ వార్డుల విభజన, రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేయాల్సిందిగా నాగిరెడ్డి ఆదేశించారు. వార్డుల విభజన, రిజర్వేషన్లు పూర్తి కాగానే వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచాల్సిందిగా సూచిం చారు. ఎన్నికలకుఅవసరమైన సిబ్బంది నియామకం, నిధులు, మౌలిక సదుపాయాలు,
 
ఈవీఎంల సేకరణ, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, రిటర్నింగ్ అధికారుల నియామకం, తదితర అంశాలపైనా చర్చించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు తమకు 50 వేల మంది సిబ్బంది అవసరమని, దాదాపు రూ.36 కోట్లు ఖర్చు కాగలవని సోమేశ్ కుమార్ వివరించారు. వార్డుల విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోందని చెప్పారు. ఈ అం శాల్లో ప్రాథమిక పనులు ఇప్పటికే పూర్తయ్యాయని వివరించారు.
 
కొత్తగా ఏర్పాటు చేసే వార్డులు మొత్తం ఒకే నియోజకవర్గ పరిధిలో ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సమీక్ష సమావేశంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎమ్‌జీ గోపాల్, కమిషనర్ డాక్టర్ బి.జనార్దన్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ స్పెషల్ కమిషనర్ నవీన్ మిట్టల్, అడిషనల్ కమిషనర్ (ఎన్నికలు) రామకృష్ణారావు, సీసీపీ ఎస్.దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement