మిషన్ కాకతీయ పనుల్లో నాణ్యతాలోపం
► అధికారుల నిర్లక్ష్యంతో అస్తవ్యస్తంగా పనులు
► ఎంపీపీ ఆకుల శోభారాణి
ఖానాపూర్ : అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం కారణంగా మిషన్ కాకతీయ పనుల్లో నాణ్యత లోపించిందని, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని ఎంపీపీ ఆకుల శోభారాణి ఆరోపించారు. శనివారం ఆమె మండల కేంద్రంలోని బొడ్డొనికుంట, కప్పలకుంటతోపాటు మండలంలోని గంగాయిపేట ఆరె చెరువు, సుర్జాపూర్‌లోని మేడంపల్లి చెరువు, ఎక్బాల్‌పూర్ చెరువు, ఈర్లకుంట, ఎర్వచింతల్‌ల్లోని మరో రెండు చెరువుల పనులను పరిశీలించారు. నిబంధనలు పాటించడం లేదని, చెరువుల్లో గుంతలు ఎక్కడివక్కడే ఉన్నాయని, చెరువు కట్టపై నల్లమట్టి పోసి పై నుంచి ఎర్రమట్టి పోసి పనులు పూర్తయ్యూరుు అనిపిస్తున్నారని విమర్శించారు.
రోడ్డు రోలర్‌తో తొక్కించలేదని, పలు చోట్ల తూములకు పూతలు పూసి కొత్త వాటిగా చూపిస్తున్నారని తెలిపారు. సిబ్బంది కొరత పేరుతో పూడిక తీయకున్నా కాంట్రాక్టర్లు చెప్పిందే అధికారులు రికార్డు చేస్తూ బిల్లులు చెల్లిస్తున్నారని అన్నారు. కప్పలకుంట చెరువులో ఒక జేసీబీ సాయంతో ఐదు ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలించి విక్రరుుంచారని, దీనిపై అధికారులకు ఫిర్యాదు చేశారు. మండలంలో మొదటి విడతలో 7 చెరువులు, రెండో విడతలో 12 చెరువుల పనులను సుమారు రూ.పది కోట్ల వరకు వెచ్చించి చేస్తున్నా నాణ్యత లేక కోట్లు దుర్వినియోగం అవుతున్నాయని తెలిపారు. స్టేట్ మానిటరింగ్ కమిటీతోపాటు విజిలెన్స్ అదికారులు, సీఎం, మంత్రులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆకుల శ్రీనివాస్, గుగ్లావత్ లక్ష్మణ్, మగ్గిడి సురేశ్, దాసరి భీమన్న, రాజేశ్వర్, లక్ష్మణ్, రత్నం, వెంకట్రాములు, రాజన్న, అశోక్, జీవన్ పాల్గొన్నారు.