- వందల ఎకరాల్లో నష్టం
- పలు చోట్ల విరిగిపడిన మామిడి చెట్లు
- ఆందోళనలో కౌలు రైతులు
జైపూర్/తాండూర్/చెన్నూర్‌రూరల్/నెన్నెల : జిల్లాలో ఆదివారం రాత్రి గాలి దుమా రం, వాన బీభత్సం సృష్టించింది. మామిడి చెట్లపై ఉన్న కాయలన్నీ నేలరాల్చింది. కాయలన్నీ రాలిపోవడంతో రైతుల ఆశలు నేలరాలారుు. ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు. జైపూర్ మండలంలో ఆదివారం రాత్రి వీచిన ఈదురుగాలులకు మామిడికాయలు నేలరాలారుు. మండలంలోని ఇందారం, టేకుమట్ల, రసూల్‌పల్లి, మిట్టపల్లి, దుబ్బపల్లి, జైపూర్, భీమారం, బూరుగుపల్లి, నర్సింగాపూర్, ఖాజిపల్లి, దాంపూర్, రెడ్డిపల్లి, ధర్మారం, మద్దికల్, ఆరేపల్లి గ్రామాల్లో వందలాది ఎకరాల్లో మామిడి కాయలు నేలరాలిపోయాయి. వేలాది రూపాయాలు ఖర్చు చేసి తోటలు కౌలుకు తీసుకున్న కౌలు రైతులు రాలిన కాయలను చూసి కన్నీరుమున్నీరు అవుతున్నారు.
తాండూర్ మండలం అచ్చలాపూర్, బోయపల్లి, తాండూర్, రేపల్లెవాడ, చౌటపల్లి మదారం తదితర గ్రామాల్లోని 800 ఎకరాల్లో మామిడి తోటలకు నష్టం వాటిల్లింది. ఆదివారం రాత్రి గాలివానకు మామిడికాయలు నేలరాలారుు. కొద్ది రోజుల్లో కాయలు కోసి మార్కెట్‌కు తరలించాలని అనుకుంటున్న రైతుల ఆశలకు గండికొట్టింది. చెన్నూర్ మండలంలో ఆదివారం రాత్రి వీచిన గాలి దుమారానికి సుద్దాల, సంకారం, కొమ్మెర, ఎర్రగుంటపల్లి, నాగాపూర్, కన్నెపల్లి, కిష్టంపేట, లింగంపల్లి గ్రామాల్లోని మామిడి తోటల్లో కాయలు నేలరాలారుు. అకాల వర్షాలు, గాలిదుమారంతో తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కౌలు డబ్బులు కూడా వచ్చే పరిస్థితి లేదని కౌలు రైతులు వాపోతున్నారు. నెన్నెల మండలంలోని నెన్నెల, ఆవడం, చిత్తాపూర్, మెట్‌పల్లి, నందులపల్లి, ఘన్‌పూర్, గొళ్లపల్లి, మైలారం, కొత్తూర్, దుబ్బపల్లి, జంగాల్‌పేట, గుండ్లసోమారం, జోగాపూర్, కోనంపేట గ్రామాల్లో చెట్లపై ఉన్న కాయల్లో 90శాతం నేలరాలారుు. మూడు వేల ఎకరాల్లోని తోటలకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఆదివారం రాత్రి గంట సమయంలో గాలివాన బీభత్సం సృష్టించింది.
నేలరాలిన మామిడి ఆశలు
Published Wed, Apr 29 2015 2:15 AM | Last Updated on Tue, Oct 9 2018 4:55 PM
Advertisement
Advertisement