రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని...
చిత్తూరు (సెంట్రల్) : రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర శాసనసభ బీసీ సంక్షేమ కమిటీ చైర్మన్ జి.తిప్పేస్వామి తెలిపారు. మూడురోజుల జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం కమిటీ చిత్తూరుకు వచ్చింది. జెడ్పీ సమావేశ మం దిరంలో వివిధ బీసీ సంఘాలు, ప్రజల నుంచి కమిటీ వినతులు స్వీకరించింది. అనంతరం వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించింది. వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగాల భర్తీలో బీసీలకు కల్పించిన రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు, అభివృద్ధి కార్యక్రమాల అమలును సమీక్షించింది.
ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ మాట్లాడుతూ స్కాలర్‌షిప్పు లు, సంక్షేమ హాస్టళ్లలో సీట్ల కేటాయింపు, మౌలిక వసతుల కల్పన తదితరాలను సక్రమంగా అమలు చేయాలని తెలిపారు. ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్, ఎన్‌ఎంఆర్‌ల భర్తీల్లో బీసీల రిజర్వేషన్లను కచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్‌కు సూచించారు. ఐరాల, పాకాల, సోమల తది తర మం డలాల్లో పెరికబలిజ కులస్తులకు సర్టిఫికెట్లు మంజూరులో తహశీల్దార్లు సహకరించడం లేదని, దీనిపై మానవతా ధృక్ఫథంతో స హకరించాలని కోరారు. కమిటీ సభ్యులు రమణమూ ర్తి, రామానాయుడు, అశోక్, జయరాములు మాట్లాడుతూ బీసీలకు సంక్షేమ పథకాలు, రిజర్వేషన్లు పా టించడంలో నిబద్ధతతో పని చేయాలన్నారు. కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ మాట్లాడుతూ రిజర్వేషన్ల అమలులో గతం లో ఏవైనా పొరపాట్లు జరిగి ఉంటే వాటిని సరిదిద్దుకుంటామన్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ కావడం లేదు
తిరుమల తిరుపతి దేవస్థానం కళాశాలల్లో చదువుతున్న బీసీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయిం బర్స్‌మెంట్ చేయడం లేదని రాష్ట్ర బీసీ సంక్షేమ శాసనసభ కమిటీ దృష్టికి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తీసుకువచ్చారు. సమావేశంలో చెవిరెడ్డి మాట్లాడుతూ టీడీడీ ఆధ్వర్యంలో కళాశాలల విద్యార్థులకు ఫీజు రియింబర్స్‌మెంట్ అమలు చేయాలన్నారు. అలా గే బీసీ హాస్టళ్లల్లో పనిచేస్తున్న ట్యూటర్లకు రూ.500 నెలవేతనం ఇస్తున్నారని, ఎస్సీ, ఎస్టీ హాస్టల్‌ల్లో పనిచేస్తున్న ట్యూటర్లకు ఇచ్చే విధంగా నెలకు రూ.1500 వం తున ఇవ్వాలని కమిటీ దృష్టికి తెచ్చారు.
హాస్టల్ విద్యార్థుల వైద్య పరీక్షల కోసం, అవసరమైన మందుల సరఫరాకు 104 వాహనాలను పంపాలని సూచించారు. జీవో నెంబర్ 64 మేరకు హాస్టల్ నిర్వహణ కోసం రూ.1000 ప్రతినెలా ఇవ్వాల్సి ఉండగా, సంవత్సరాల తరబడి నిధులు విడుదల చేయడం లేదని, విద్యార్థులకు కాస్మోటిక్ చార్జీలను పెంచాలని కోరారు. తన మండలంలో బీసీలు అధికంగా ఉన్నారని, బీసీ హా స్టల్ మంజూరు చేయాలన్నారు. వీటిపట్ల చైర్మన్ సానుకూలంగా స్పందించారు. సమావేశంలో కమిటీ సభ్యు లు ఎమ్మెల్యేలు వెంకటరామారావు, ముత్యాలనాయు డు, మండలి సభ్యులు విశ్వప్రసాద్‌రావు, చిత్తూరు, తిరుపతి ఎస్పీలు శ్రీనివాస్, గోపీనాథ్‌జెట్టి, తిరుపతి నగర పాలక కమిషనర్ వినయ్‌చంద్, బీసీ వెల్ఫేర్ అధికారి రామచంద్రరాజు, ఎస్వీ, పద్మావతి,పశువైద్య విశ్వవిద్యాలయాల ప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.