‘ఆదర్శానికి' మంగళం... | 'Ideal' Mangalam ... | Sakshi
Sakshi News home page

‘ఆదర్శానికి' మంగళం...

Published Wed, Sep 24 2014 3:31 AM | Last Updated on Sat, Sep 2 2017 1:51 PM

కరీంనగర్‌అగ్రికల్చర్ : క్షేత్రస్థాయిలో రైతులకు అన్ని విధాలా అండగా ఉండి అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వడానికి ఏడేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఆదర్శ రైతుల వ్యవస్థను రద్దు చేసేందుకు...

కరీంనగర్‌అగ్రికల్చర్ :
 క్షేత్రస్థాయిలో రైతులకు అన్ని విధాలా అండగా ఉండి అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వడానికి ఏడేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఆదర్శ రైతుల వ్యవస్థను రద్దు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో అధికారిక ఉత్తర్వులు రావడమే తరువాయి.. జిల్లాలో 1892 మంది ఆదర్శ రైతులకు ఉద్వాసన కలగనుంది. వారి స్థానంలో ప్రత్యామ్నాయంగా మల్టీపుల్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్(ఎంపీఈవో)ల నియామకానికి మొగ్గు చూపుతోంది.
 విభజన అనంతరం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సరా ్కర్ ఆదర్శ రైతు వ్యవస్థకు మంగళం పాడి ఉత్తర్వులు జారీచేసింది.  తెలంగాణ సర్కార్ సైతం ఈ అం శంపై అన్నివిధాలా ఆలోచించి చివరకు రద్దు చేసేం దుకే మొగ్గు చూపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే నిర్ణయం తీసుకోగా.. అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. వ్యవసాయశాఖకు, రైతులకు మధ్య వారధిగా పనిచేసే ఉద్దేశంతో దివంగత వైఎస్సార్ 2007లో ఆదర్శ రైతు వ్యవస్థను ప్రవేశపెట్టారు. మొ దట్లో బాగానే ఉన్నా ఆయన మరణానంతరం పక్కదోవ పట్టింది. వీరికి నెలకు రూ.వేయి గౌరవ వేతనంగా నిర్ణయించారు. ఈ మేరకు జిల్లాలో 2500 మంది ఆదర్శరైతుల నియామకం జరిగింది. ఆ త ర్వాత విధుల్లో నుంచి తొలగించడం, వివిధ కారణాలతో ఆ సంఖ్య 1,892కు చేరింది. సంస్కరణలో భా గంగా ఆదర్శ రైతులతో ప్రయోజనం లేదని భా విస్తూ ఆర్థిక భారం తగ్గించుకునేందుకు ప్రస్తుత స ర్కార్ ప్రణాళిక రూపొందించుకుంది. ఈ మేరకు జి ల్లాలో 1892 మంది రైతులకు నెలకు గౌరవవేతనం గా ఇస్తున్న రూ.18.92 లక్షలను ఆదా చేయనుంది.
 ఎంపీఈవోల వ్యవస్థ...
 రైతులను సంఘటితం చేసి వారి సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి పరిష్కరించాలని ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఆదర్శ  వ్యవస్థ స్థానంలో గతంలో అమలులో ఉన్న మల్టీఫుల్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ల నియామకం చేపట్టే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. 2004కు ముందు గ్రామాల్లో రైతుమిత్ర గ్రూపులు ఏర్పాటుచేసి వాటిని సమీకరించి గ్రామైఖ్య సంఘాలను ప్రతి నెలా సమావేశాలు నిర్వహించేందుకు ఎంపీఈవోలను నియమించారు. చిన్న మండలాల్లో ముగ్గురు, పెద్ద మండలాల్లో ఐదుగురి చొప్పున నియమించి ఈ సంఘాల నిర్వహణ బాధ్యతలు అప్పగించేవారు. ప్రస్తుతం ఈ వ్యవస్థను పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రైతు కుటుంబాలను బట్టి జిల్లాలో 2,500 మంది ఆదర్శ రైతులను నియమించినప్పటికీ క్రమంగా వివిధ కారణాలతో పలువురిని తొలగించగా 1896 మంది పనిచేస్తున్నారు. ఈ లెక్కన ఒక్కో గ్రామంలో ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది ఆదర్శ రైతులున్నారు. వీరి స్థానంలో ఎంఈవోలను నియమించి రెండు మూడు గ్రామాలకొకరిని నియమించుకుంటే ఆదర్శ రైతులకు ఇస్తున్న గౌరవ వేతనం సరిపోతుందని ఆలోచిస్తున్నట్లు తెలిసింది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement