బచ్చన్నపేట : విద్యుత్ కోతలతో పంటలు ఎండుతున్నాయని, ప్రభుత్వం స్పందించి వ్యసాయూని కి సక్రమంగా కరెంట్ సరఫరా చేయూలంటూ పలు ప్రాంతాల్లో రైతులు శనివారం రాస్తారోకోలు నిర్వహించారు. బచ్చన్నపేట మండల కేంద్రంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ఎదుట టీడీపీ మండల అధ్యక్షుడు ఎలికట్టె మహేందర్‌గౌడ్ ఆధ్వర్యంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలు రైతులతో కలిసి బైఠాయిం చారు.
వ్యవసాయానికి ఏడు గంటలపాటు నిరంతరాయంగా కరెంట్ సరఫరా చేయూలని నినాదాలు చేశారు. ప్రభుత్వం ఇలాగే మొండివైఖరి అవలంబిస్తే... ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఏఈ రాంబాబుకు వారు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో చల్లా సుధాకర్‌రెడ్డి, సత్తిరెడ్డి, దశరథ, అంబదాస్, మట్టిరవి, చంద్రారెడ్డి, పాకా ల మహేందర్, పాకాల లింగం, ఇంద్రయ్య, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
కురవిలో..
రైతాంగానికి కనీసం ఏడు గంటల విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో కురవిలోని మానుకోట-ఖమ్మం ప్రధా న రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రహదారిపై బైఠారుుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీపీఐ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి నల్లు సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ... విద్యుత్ కోతలతో చేతికొచ్చే పంటలు ఎండిపోయే పరిస్థితిలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యవసాయానికి ఏడు గంటల పాటు విద్యుత్ సరఫ రా చేసి, రైతు ఆత్మహత్యలను నివారించాలని డిమాండ్ చేశారు. సీపీఐ మండల కార్యదర్శి ఎన్.సురేందర్‌కుమార్, నాయకులు పోగుల శ్రీనివాస్, నెల్లూరి నాగేశ్వర్‌రావు, తురక రమే ష్, అప్పాల వెంకన్న, నిలిగొండ నాగేశ్వర్‌రా వు, బుడమ వెంకన్న, దూదికట్ల సారయ్య, బస్వశ్రీను, రాంమూర్తి, సైదులు, ప్రవీణ్, వీరన్న, కొమురయ్య, ఉప్పలయ్య, బుర్రి సమ్మయ్య, గుర్వయ్య, రాములు పాల్గొన్నారు.
పంటలు ఎండుతున్నా పట్టించుకోరా..?
జనగామ రూరల్ : ‘పంటలు ఎండుతున్నా పట్టించుకోరా.?, అప్పు తెచ్చి సాగు చేస్తే కరెంట్ కోతలతో పంటలకు నీరందక ఎండిపోతున్నాయి.’ అంటూ తెలంగాణ రైతు సంఘం జనగామ డివిజన్ కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కరెంట్ కోతలకు నిరసనగా నెహ్రూ పార్కు వద్ద జనగామ- సిద్దిపేట రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిటీ సభ్యుడు మోకు కనకారెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయానికి నిరంతరం ఏడు గంటల విద్యుత్‌తో పాటు రుణాలు సకాలంలో మాఫీ చే సి రైతులను ఆదుకోవాలని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి ఆర్. మీట్యానాయక్, నాయకులు ఎం.బీరయ్య, జీఎల్‌ఎన్ రెడ్డి, పీ.ఉపేందర్, ఎ.సత్యనారాయణ, ఎస్.దుర్గాప్రసాద్, బీ.శ్రీరాములు, జే.మల్లేశం, పీ.సుదర్శన్, ఎం.మల్లయ్య, టీ.ఆనందం, శ్రీకాంత్ పాల్గొన్నారు.
ఎన్‌పీడీసీఎల్ కార్యాలయం ఎదుట ధర్నా
ఎన్జీవోస్ కాలనీ : వ్యవసాయానికి తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా అధ్యక్షుడు పూనెం ప్రభాకర్, కార్యదర్శి కొత్తపల్లి రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వ్యవసాయానికి తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా చేయాలని కోరుతూ హన్మకొండ నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏడు గంటలు విద్యుత్ అందిస్తున్నామని చెబుతున్న అధికారులు కనీసం మూడు గంటలు కూడా సరఫరా చేయడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతాంగానికి మెరుగైన విద్యుత్ సరఫరా చేయాలని కోరారు. ధర్నాలో నాయకులు ఎన్.ప్రసాద్, ఆలకుంట్ల సాయి లు, ముంజంపల్లి వీరన్న, సిద్దబోయిన జీవన్, గొంది సమ్మయ్య, జగత్‌రెడ్డి, చిర్ర సూరి, పైండ్ల యాకయ్య, బొమ్మగాని వెంకన్న, చింత నవీన్, చిర్ర భద్రయ్య, విఘ్నేష్ తదితరులు పాల్గొన్నారు.
కరెంట్ కోతలపై కర్షకుల ఆందోళన
Published Sun, Oct 12 2014 2:49 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement