విజయనగరంఆరోగ్యం: అసలే అంతంత మాత్రంగా ఉన్న సబ్‌సెంటర్స్ మరింత కునారిల్లే పరిస్థితి కనిపిస్తోంది.
విజయనగరంఆరోగ్యం: అసలే అంతంత మాత్రంగా ఉన్న సబ్‌సెంటర్స్ మరింత కునారిల్లే పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే సబ్ సెంటర్స్ అభివృద్ధికి ప్రభుత్వం ఏటా విడుదల చేసే నిధులను రెండేళ్లుగా విడుదల చేయడం లేదు. దీంతో సబ్ సెంటర్స్ అభివృద్ధికి నోచుకోవడం లేదు. 2013 -14 సంవత్సరం వరకు నిధులను విడుదల చేసిన ప్రభుత్వం 2014-15, 2015-16 సంవత్సరాలకు విడుదల కాలేదు.
ఆన్‌టైడ్‌ఫండ్స్‌తో ఈపనులు చేపట్టాలి
సబ్ సెంటర్‌కు విడుదల చేసే ఆన్‌టైడ్ ఫండ్స్‌తో సబ్ సెంటర్స్ ఆధునికీకరణ, సబ్ సెంటర్స్‌లో ఉండే ఏఎన్‌ఎంకు స్టేషనరీ, బీపీ ఆపరేటర్లు, వేయింగ్ మిషన్లు, డోర్ కర్టెన్లు, టేబుళ్లు, హిమోగ్లోబిన్ శాతాన్ని నిర్ధారించే పరికరాలు, రోగులకు అత్యవసర పరిస్థితుల్లో రవాణా సౌకర్యం, పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ వంటి పనులు చేపట్టవచ్చు. ఏడాదికి ప్రభుత్వం ఒక్కో సబ్ సెంటర్‌కు రూ. 50 వేలు చొప్పున నిధుల విడుదలయ్యేవి.
జిల్లాలో 436 సబ్ సెంటర్స్ ఉన్నాయి. ఏడాదికి రూ.2.18 కోట్లు చొప్పన నిధులు విడుదల కావాల్సి ఉంది. అసలే సబ్‌సెంటర్స్ ఆధ్వాన స్థితిలో ఉన్న నేపథ్యంలో నిధులు నిలిపివేయడం వల్ల వాటి పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యే ఆస్కారం ఉంది. ఇదేవిషయాన్ని ఎన్‌ఆర్‌హెచ్‌ఎం డీపీఓ రామనుజులనాయుడు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా సబ్‌సెంటర్స్‌కు ఆన్‌టైడ్ ఫండ్స్ విడుదలను ప్రభుత్వం నిలిపివేసిన మాట వాస్తవమేనని అన్నారు.