- కేంద్రం నివేదిక కోరినా పట్టించుకోవడం లేదు
- ప్లీనరీకి వ్యాపారులను బెదిరించి డబ్బు వసూలు
- బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి
హన్మకొండ: ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట నష్టాన్ని నిర్ధారించకుండా రాష్ర్ట ప్రభుత్వం నిర్లక్షంగా వ్యవహరిస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి అన్నా రు. బుధవారం హన్మకొండ ఎన్జీవోస్ కాలనీలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కేంద్రం పంట నష్టం వివరాలకు సంబంధించిన నివేదిక పంపితే, కేంద్ర బృందం వచ్చి పరిశీలిస్తుందని చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రకృతి వైపరిత్యాలతో రైతు లు మరణిస్తే ఇచ్చే పరిహారాన్ని కేంద్ర ప్రభుత్వం రూ.1.50 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచిందన్నారు. 30 శాతం పంట నష్టపోతే పరిహారాన్ని ఇవ్వడంతో పాటు దీన్ని 50 శాతానికి పెంచిందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆదర్శ రైతులను నియమిస్తే విమర్శించిన టీఆర్‌ఎస్, అధికారంలోకి రాగానే ఎమ్మెల్యేలను ఆదర్శ రైతులను చేసిందని ధ్వజమెత్తారు. విదేశంలో జరుగనున్న రైతు సదస్సుకు ఎమ్మెల్యే కుమారుడు, ఎమ్మెల్యేలను ఆదర్శ రైతులుగా ఎం పిక చేసి పంపడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. పింఛన్ రాని వికలాంగుడు తన బాధ చెప్పుకోవడానికి హైదరాబాద్ వెళ్లితే ఇక్కడికి కూడా వస్తారా అంటూ మంత్రి జగదీశ్‌రెడ్డి వికలాంగుని గెంటి వేసి దుర్మార్గంగా వ్యవహరించారని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ జనాభాలో సగభాగమైన మహిళల్లో ఒక్కరిని కూడా మంత్రి వర్గంలోకి తీసుకోలేదని విమర్శించారు.
పంట నష్టంపై ప్రభుత్వం నిర్లక్ష్యం
Published Thu, Apr 23 2015 1:52 AM | Last Updated on Fri, Mar 29 2019 9:04 PM
Advertisement
Advertisement