Red sandalwood smuggling
-
చెట్ల అక్రమ రవాణాను ఎవరూ అడ్డుకోవడం లేదు: రాజగోపాల్ రెడ్డి
-
రాష్ట్రంలో గంజాయికి అడ్డుకట్ట
దొండపర్తి (విశాఖ దక్షిణ): రాష్ట్రంలో గంజాయి, ఎర్ర చందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తామని డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. ఇందులో భాగంగా త్వరలోనే పొరుగు రాష్ట్రాల అధికారులతో తిరుపతిలో సమన్వయ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో గంజాయి కట్టడిపై పోలీస్ శాఖ పూర్తిస్థాయిలో దృష్టి సారించిందని చెప్పారు. ఈ ఏడాది 1.32 లక్షల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, 1,599 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. గంజాయి అక్రమ రవాణా కేసుల్లో నిందితులు 12 రాష్ట్రాలకు చెందిన వారని, వారందరినీ త్వరలోనే అరెస్టు చేస్తామని చెప్పారు. సైబర్ నేరాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తామన్నారు. సైబర్ కేసులను ఛేదించడానికి అధికారులు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చామన్నారు. రాష్ట్రంలో పోలీసు సిబ్బంది కొరతను అధిగమించేందుకు ఏడాదిలోగా 6,500 మంది నియామకానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా 47 వేల కేసులు పరిష్కారం రాష్ట్ర వ్యాప్తంగా లోక్ అదాలత్ ద్వారా 47 వేల కేసులు పరిష్కారమయ్యాయని, వీటిలో పెండింగ్‌తో పాటు విచారణలో ఉన్న 36 వేలు ఐపీసీ కేసులు ఉన్నాయన్నారు. లక్ష వరకు పెట్టీ కేసులను కూడా పరిష్కరించినట్లు చెప్పారు. న్యాయ వ్యవస్థతో సమన్వయం చేస్తూ ఒకే లోక్ అదాలత్‌లో ఇంత పెద్ద సంఖ్యలో కేసుల పరిష్కారానికి కృషి చేసిన రాష్ట్రంలోని పోలీస్ అధికారులను, సిబ్బందిని అభినందించారు. దోషులకు సత్వరమే శిక్ష పడేలా సమగ్ర విచారణ దోషులకు సత్వరమే శిక్ష పడేలా నేర నిరూపణలో వేగవంతమైన, సమగ్ర దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. ఇందుకోసం స్వయంగా ఎస్పీలే నాలుగైదు పెండింగ్ కేసులు పర్యవేక్షించేలా ఆదేశించామని, దీని వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. ప్రధానంగా విశాఖ నగర పోలీస్ కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్ పర్యవేక్షణలో దిశ స్టేషన్లో నమోదైన మైనర్ బాలికపై అత్యాచార కేసులో నిందితుడికి 20 ఏళ్లు శిక్ష పడేలా చేశారని తెలిపారు. ఇదే తరహాలో రాష్ట్రంలో మరో రెండు నెలల్లో 120 కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. విశాఖలో ప్రధాని మోదీ పర్యటన విజయవంతానికి కృషి చేసిన పోలీస్ అధికారులు, సిబ్బందిని డీజీపీ అభినందించారు. విశాఖలో నేరాలు అదుపులో ఉన్నాయని చెప్పారు. హత్యలు, అత్యాచారాలు, రోడ్డు ప్రమాదాలు తగ్గాయని వివరించారు. ఈ సమావేశంలో, విశాఖ డీఐజీ హరికృష్ణ, విశాఖ నగర సీపీ సీహెచ్ శ్రీకాంత్, డీసీపీ (లా అండ్ ఆర్డర్) సుమిత్ సునీల్ గరుడ్ తదితరులు పాల్గొన్నారు. -
పరిశ్రమల్లో తనిఖీలకు మూడు టాస్క్‌ఫోర్స్‌లు
సాక్షి, అమరావతి: ఇటీవల పరిశ్రమల్లో ప్రమాదాల నేపథ్యంలో నిరంతరం తనిఖీ చేసేందుకు మూడు టాస్క్‌ఫోర్స్‌లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర పర్యావరణ, అటవీ, గనులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఆయన కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ టాస్క్‌ఫోర్స్ బృందాలు పరిశ్రమలు, కాలుష్యకారక సంస్థల్లో తనిఖీ చేసి భద్రతా ప్రమాణాలను పరిశీలించాలని ఆదేశించారు. అటవీ, పర్యావరణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నీరబ్‌కుమార్ ప్రసాద్, కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ ఏకే ఫరీడా, స్పెషల్ సెక్రటరీ చలపతిరావు, ఏపీ కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీ విజయ్‌కుమార్, పీసీబీ సీనియర్ అడ్మినిస్ట్రేషన్ మేనేజర్ రవీంద్రనాథ్ పాల్గొన్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్‌పై కఠినంగా వ్యవహరించాలి రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌పై మరింత కఠినంగా వ్యవహరించాలని మంత్రి పెద్దిరెడ్డి అధికారులను ఆదేశించారు. విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయంలో సోమవారం అటవీ శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ ఎర్రచందనం నిల్వలు విస్తరించిన ప్రాంతాల్లో సాయుధ అటవీ బృందాలతో నిరంతరం గస్తీ నిర్వహించాలని, అవసరమైతే డ్రోన్లతో నిఘా పెట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 30 ప్రాంతాల్లో ఎకో టూరిజం ప్రాజెక్ట్‌లు ఉన్నాయని, వాటితోపాటు పులికాట్, నేలపట్టు, కోరింగ, పాపికొండలు ప్రాంతాల్లో ఎకో టూరిజాన్ని మరింత అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అటవీ, పర్యావరణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నీరబ్‌కుమార్ ప్రసాద్, అటవీదళాల అధిపతి వై.మధుసూదన్ రెడ్డి, పీఆర్, ఆర్డీ స్పెషల్ కమిషనర్ శాంతిప్రియ పాండే, స్పెషల్ సెక్రటరీ చలపతిరావు, పీసీసీఎఫ్ బీకే సింగ్, పీసీపీఎఫ్ ఏకే ఝా పాల్గొన్నారు. -
అక్రమ దందాలకు అడ్డుకట్ట
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అక్రమ దందాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (సెబ్)ను ప్రభుత్వం మరింత పటిష్టపరుస్తోంది. గంజాయి, మద్యం, ఇసుక అక్రమ రవాణా, ఎర్రచందనం స్మగ్లింగ్ తదితర దందాలను మరింత సమర్థంగా కట్టడిచేసేందుకు సెబ్‌కు సాంకేతిక సాధన సంపత్తిని సమకూరుస్తోంది. నేరపరిశోధనలో కీలకమైన క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ (సీసీటీఎన్ఎస్) పరిధిలోకి సెబ్‌ను తీసు కొచ్చింది. మరోవైపు గంజాయి, ఇసుక, మద్యం అక్రమ రవాణా, ఎర్రచందనం స్మగ్లింగ్ తదితర నేరాలు, నేరస్తుల డేటాను సమగ్రంగా రికార్డు చేయనుంది. తాజా విధాన నిర్ణయంతో శాంతిభద్రతల పోలీసు విభాగం, సెబ్లను అనుసంధానించనుంది. సమర్థంగా నేరపరిశోధన, నేరాల కట్టడి నేరపరిశోధనలో సీసీటీఎన్ఎస్ అత్యంత కీలక విభాగం. వివిధ నేరాలు, ఆ కేసుల పరిశోధన, ఆ నేరాలకు పాల్పడిన వారి వివరాలు అన్నింటినీ సీసీటీఎన్ఎస్లో సమగ్రంగా రికార్డు చేస్తారు. ఆధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ భద్రపరిచే ఈ వ్యవస్థ నేరపరిశోధనలో పోలీసు అధికారులకు ఎంతో ఉపయోగపడుతోంది. ఇటువంటి వ్యవస్థను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు చేసింది. అనంతరం కేంద్ర హోంశాఖ ఇదే వ్యవస్థను జాతీయస్థాయిలో నెలకొల్పింది. అటువంటి సమర్థమైన సీసీటీఎన్ఎస్ పరిధిలో ప్రస్తుతం శాంతిభద్రతలను పర్యవేక్షించే పోలీసు విభాగమే ఉంది. గంజాయి, అక్రమ ఇసుక, అక్రమ మద్యం, ఎర్రచందనం స్మగ్లింగ్ తదితర నేరాల కట్టడికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేసిన సెబ్‌ను సీసీటీఎన్ఎస్ పరిధిలోకి తీసుకురావాలని పోలీసు శాఖ తాజాగా నిర్ణయించింది. దీంతో రాష్ట్రంలో గంజాయి, ఇసుక, మద్యం అక్రమ రవాణా, ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు, ఆ నేరస్తుల వివరాలన్నీ సీసీటీఎన్ఎస్లో నమోదు చేస్తారు. ఆ నేరస్తుల స్వభావం, నేరాల చరిత్ర, పెండింగ్‌లో ఉన్న కేసులు తదితర సమాచారమంతా సెబ్ అధికారులకు అందుబాటులోకి వస్తుంది. ఆ కేసుల పరిశోధన కోసం ఇతర రాష్ట్రాల పోలీసుల సహకారం తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో నేరాలకు పాల్పడుతున్న వారికి ఇతర రాష్ట్రాల్లో ఉన్న నేరస్తులు, సిండికేట్లతో ఉన్న సంబంధాలు, వ్యాపార, ఆర్థిక లావాదేవీల వివరాలన్నీ పోలీసులకు అందుబాటులోకి వస్తాయి. తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల్లో వ్యవస్థీకృతమైన ముఠాలు అక్కడి నుంచి మన రాష్ట్రంలో గంజాయి, ఎర్రచందనం స్మగ్లింగ్ వంటి దందాలకు పాల్పడుతున్నాయి. అక్రమ రవాణాకు పాల్పడుతున్నవారిపై ప్రస్తుతం సెబ్ దాడులు చేసి కేసులు నమోదు చేస్తోంది. తాజాగా సీసీటీఎన్ఎస్ పరిధిలోకి రావడంతో ఇతర రాష్ట్రాల్లోని ముఠాలపై కూడా కేసులు నమోదు చేసేందుకు, అక్రమ దందాను మూలాలతోసహా పెకలించేందుకు మార్గం సుగమమైంది. కేసు దర్యాప్తునకు దేశంలోని ఏ ప్రాంతాలకు వెళ్లాలో తెలియడంతోపాటు సంబంధిత రాష్ట్రాల పోలీసు, దర్యాప్తు సంస్థల సహకారం పొందడం సులభతరమవుతుంది. పోలీసు, సెబ్ వ్యవస్థల అనుసంధానం అక్రమ దందాలను అరికట్టడంతో పోలీసు, సెబ్ విభాగాలు మరింత సమన్వయంతో పనిచేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. సీసీటీఎన్ఎస్ పరిధిలోకి పోలీసు విభాగంతోపాటు సెబ్ కూడా చేరింది. అంటే సీసీటీఎన్‌ఎస్‌లోని సమాచారం రాష్ట్రంలోని 950 పోలీసు స్టేషన్లతోపాటు 208 సెబ్ పోలీసుస్టేషన్లకు అందుబాటులోకి వచ్చింది. రాష్ట్ర పోలీసు బాస్ డీజీపీనే సెబ్‌కు ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. అదే రీతిలో జిల్లాస్థాయిలో ఎస్పీల పర్యవేక్షణలోనే ఏఎస్పీల నేతృత్వంలో సెబ్ విభాగాలు పనిచేస్తున్నాయి. ఇప్పటివరకు పోలీసు, సెబ్ విభాగాల మధ్య సాంకేతిక అంశాల్లో కొంత సందిగ్ధత ఉంది. ప్రస్తుతం ఈ రెండు విభాగాలు కూడా సీసీటీఎన్ఎస్ పరిధిలోకి చేరడంతో వాటిమధ్య పూర్తి సమన్వయం సాధించినట్లయింది. శాంతి భద్రతల పరిరక్షణతోపాటు గంజాయి, మద్యం, ఇసుక అక్రమ రవాణా, ఎర్రచందనం స్మగ్లింగ్‌ను సమర్థంగా కట్టడిచేసేందుకు అవకాశం ఏర్పడిం ది. దర్యాప్తులో ఇబ్బందులు తొలగను న్నాయి. సాంకేతిక అంశాలను సాకుగా చూపించి నేర స్తులు తప్పించుకునేందుకు అవకాశం ఉండదు. -
ఎర్ర దుంగలపై దొంగలు!
పెనుకొండ మండలం పులేకమ్మ గుడి వెనుక భాగంలోని (చిగ్రాల్) అటవీ ప్రాంతంలో పలు చెట్లను 5 రోజుల క్రితం అక్రమంగా కొందరు వ్యక్తులు రంపంతో కోసేశారు. అనంతరం దుంగలుగా మార్చి కారులో బెంగళూరు తరలించేందుకు సిద్ధమయ్యారు. దుంగలను కారులో తీసుకెళ్లడంపై అనుమానపడిన ఓ గొర్రెల కాపరి సోమందేపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు వెంటనే దాడులు నిర్వహించారు. వెలగమాకులపల్లి క్రాస్ వద్ద 44వ జాతీయ రహదారిపై స్వాధీనం చేసుకున్నారు. తీరా దొంగలను ఆరా తీస్తే పట్టుబడింది ఎర్రచందనం దుంగలని తేలింది. 40 దుంగల విలువ సుమారు రూ. 5 లక్షలకుపైగా ఉంటుందని పోలీసులు తేల్చారు. బెంగళూరు తరలించి అక్కడి నుంచి స్మగ్లర్ల ద్వారా విదేశాలకు తరలించేందుకు తీసుకెళ్తునట్లు విచారణలో బయటపడింది. పెనుకొండ: పెనుకొండ రేంజ్ పరిధిలో 26 వేల హెక్టార్లలో అటవీప్రాంతం విస్తరించి ఉంది. బుక్కపట్నం 33,803, కదిరి 49,391, కళ్యాణదుర్గం రేంజ్ పరిధిలో 24,224 హెక్టార్లలో అటవీప్రాంతం ఉంది. 2000 సంవత్సరం నుంచి 2009 మధ్య కాలంలో పలు విడతలుగా అటవీశాఖ అధికారులు ఈ ప్రాంతంలో ఎర్రచందనం మొక్కలు నాటారు. అప్పట్లో నాటిన మొక్కలు నేడు ఏపుగా పెరిగి కోత దశకు చేరుకున్నాయి. విలువైన సంపదపై స్మగ్లర్ల కన్ను.. భూ మండలంపై అత్యంత అరుదుగా దొరికే సంపదలో ఎర్రచందనం ఒకటి. విదేశీ మార్కెట్లో దీనికి ఉండే విలువ అంతా ఇంతా కాదు. ఎర్రబంగారంగా ఎర్రచందనాన్ని అభివర్ణిస్తారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా ఎర్రచందనం అంటే శేషాచలం కొండలు గుర్తొస్తాయి. ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు జిల్లాలో విస్తరించిన ఈ అటవీ ప్రాంతంపైనే స్మగ్లర్ల కన్ను ఎక్కువగా ఉంటుంది. కానీ, ఇప్పుడు పెనుకొండ ప్రాంతంలోనూ ఇలాంటి వారి ఆనవాళ్లు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకూ పోలీసులు, అటవీ అధికారులే గుర్తించని ఎర్రచందనం చెట్లపై వీరి గొడ్డలివేటు పడడం కలకలం సృష్టించింది. ఎర్రదొంగలు ఇచ్చిన సమాచారంతో చెట్లను లెక్కించే పనిలో పడిన అటవీ శాఖ అధికారులు.. వైఎస్సార్, చిత్తూరు, నెల్లూరు జిల్లాలో పెరిగే ఎర్రచందనం చెట్లు ఈ ప్రాంతంలో ఇంత భారీగా ఎలా పెరిగాయన్న ఆలోచనల్లో మునిగిపోయారు. సిబ్బంది కొరతతో సతమతం.. అంతర్జాతీయ స్థాయిలో భారీ రేటు పలికే ఎర్ర చందనం జాడ ఉనికిలోకి రావడంతో ఇప్పుడు వాటి సంరక్షణ అటవీ అధికారులకు తలకు మించిన భారంగా పరిణమించింది. పెనుకొండ రేంజ్ పరిధిలో అటవీశాఖను సిబ్బంది కొరత వేధిస్తోంది. ఇక్కడ శాశ్వత‡ రేంజర్ లేకపోగా కళ్యాణదుర్గం రేంజర్ రాంసింగ్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఇక డిప్యూటీ రేంజర్ కానీ, బీట్ ఆఫీసర్ కానీ లేరు. ఇటీవల డీఆర్ఓ రామకృష్ణ, బీట్ ఆఫీసర్ గంగాధర్ అవినీతి ఆరోపణలతో సస్పెండ్ కావడంతో మరింత భారం పడింది. వారి స్థానంలో ఇప్పటికీ ఎవరినీ నియమించలేదు. 10 మంది బీట్ ఆఫీసర్లకు గానూ, 8 మంది ఉన్నారు. అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు 10 మందికి, ఇద్దరు ఉన్నారు. దీంతో ఎర్రచందనం చెట్ల సంరక్షణ ప్రమాదంలో పడింది. ఎంతో విలువైన సంపదగా పేరుగాంచిన ఎర్రచందనాన్ని పోలీసులతో సమన్వయం చేసుకుంటూ అటవీ శాఖ అధికారులు కాపాడాల్సి ఉంది. గస్తీ పెంచుతాం ఎర్రచందనం చెట్ల మనుగడకు ఎలాంటి ఇబ్బంది రానీయం. కొన్ని చెట్లు కోత దశలో ఉన్నట్లు కనిపించినా, పూర్తిగా ఆ స్థితికి చేరుకునేందుకు చాలాకాలం పడుతుంది. తగినంత మంది సిబ్బందిని కేటాయించాలని ఉన్నతాధికారులను కోరాం. గస్తీ పెంచి ఎర్రచందనం చెట్లను సంరక్షిస్తాం. – శామ్యూల్, సబ్ డీఎఫ్ఓ, పెనుకొండ -
‘ఎర్ర’బంగారం వైపు చూస్తే ఖబడ్దార్
సాక్షి రాయచోటి : అన్నమయ్య జిల్లాలో ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవించేలా పోలీసు యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఎక్కడికక్కడ అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనకు జిల్లా పోలీసుశాఖ నిఘాను ముమ్మరం చేసింది. సీసీ కెమెరాల ఏర్పాటు మొదలుకొని అవసరమైన అన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని అడవుల్లో అత్యధికంగా విస్తరించిన ఎర్రచందనం అక్రమ రవాణా జరగకుండా ఉండేందుకు అవసరమైన ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నారు. ఇందులోభాగంగా స్మగ్లర్లు ఎర్రచందనం కూలీలకు కౌన్సెలింగ్ ఇవ్వడంతోపాటు ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలోని రౌడీషీటర్లు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచడంతోపాటు ఇసుక దొంగలు, మట్కా, గ్యాంబ్లింగ్, దొంగతనాలకు పాల్పడిన పాత నేరస్తులను స్టేషన్‌కు పిలిచి బైండోవర్ చేస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం అన్ని స్టేషన్లలో నిర్వహించేలా ఎస్పీ హర్షవర్దన్‌రాజు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. వేళ్లూనుకున్న నాటుసారా స్థావరాలను కూకటివేళ్లతో పెకలించేలా పోలీసులను కదిలిస్తున్నారు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. గ్రామాల్లో గొడవలకు సంబంధించి అనుమానాస్పద వ్యక్తులుగా ముద్రపడిన వారితోపాటు రౌడీషీటర్లు, దొంగతనాలకు పాల్పడే పాత నేరస్తులు, ఇసుక దొంగలు, పేకాట, మట్కా, క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే వారిని స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇవ్వడంతోపాటు బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నారు. బైండోవర్‌లో భాగంగా రూ. 50 వేల నుంచి రూ. లక్ష, కేసులను బట్టి రూ. లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు బైండోవర్ చేస్తున్నారు. అయితే పాత నేరస్తులకు గతం గతించింది...ఇప్పుడు ప్రశాంతంగా ఉండండి...అలా కాకుండా మళ్లీ నేరాలకు పాల్పడితే కచ్చితంగా బైండోవర్ ప్రకారం కేసులతోపాటు పూచీకత్తు కింద రాసిన సొమ్మును చెల్లించాల్సి ఉంటుందని కరాఖండిగా వివరిస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు నెల రోజుల వ్యవధిలో 850 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేయడం విశేషం. జిల్లాలో నాటుసారా స్థావరాలపై ఎస్ఈబీ అధికారులతో కలిసి పోలీసులు సంయుక్త దాడులు చేస్తున్నారు. నాటుసారా కాస్తున్న ప్రాంతాలకు వెళ్లి బట్టీలను ధ్వంసం చేయడంతోపాటు నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటివరకు 95 నాటుసారా బట్టీలను ధ్వంసం చేయడమే కాకుండా 35 మందిపై కేసులు నమోదు చేశారు. గ్రామాల్లోకి వెళ్లి నాటుసారా వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ ఎవరూ కూడా బట్టీలు ఏర్పాటు చేయకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ‘ఎర్ర’బంగారం వైపు చూస్తే ఖబడ్దార్ జిల్లాలోని రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి, పీలేరు ప్రాంతాల్లో విస్తరించిన శేషాచలం, పాలకొండలు ప్రాంతాల్లోని ఎర్రచందనం అక్రమ రవాణా వ్యవహారంపై ఎస్పీ ప్రత్యేక దృష్టి సారించారు. అక్రమ రవాణా నిరోధానికి సంబంధిత స్మగ్లర్లతోపాటు కూలీలను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చేలా చర్యలు చేపట్టారు. ఎర్రచందనం అక్రమ రవాణాలో పాత కేసులు ఉన్న వారిని కూడా డీఎస్పీ స్థాయి అధికారుల ద్వారా హెచ్చరిస్తున్నారు. జిల్లాలోని సుమారు 250 మందికి పైగా స్మగ్లర్లు, కూలీలు, సానుభూతి పరులను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించడంతోపాటు అక్రమ వ్యవహారానికి పాల్పడితే పీడీ యాక్టు నమోదు లాంటి కఠిన చర్యలు చేపడతామని స్పష్టం చేస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాల జోలికి వెళ్లొద్దు జిల్లాలో శాంతి భద్రతలకు సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవించేలా వాతావరణం కల్పిస్తున్నాం. రౌడీ షీటర్లు, సమస్యలు సృష్టించేవారు, ఇసుక అక్రమ రవాణా చేసేవారు, దొంగతనాలకు పాల్పడే వారిపై ఇప్పటికే పెద్ద ఎత్తున బైండోవర్ కేసులు పెట్టాం. అలా కాదని మళ్లీ నేరాలకు పాల్పడితే కేసులతోపాటు కఠిన చర్యలు ఉంటాయి. ఎర్రచందనం అక్రమ రవాణా జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. చెక్‌పోస్టులతోపాటు పోలీసుల వ్యూహాలు అమలు చేస్తున్నాం. ఇప్పటికే 250 మందికి పైగా స్మగ్లర్లు, కూలీలను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చాం. ప్రతిరోజు ప్రత్యేకంగా అక్రమ రవాణా అడ్డుకోవడం కోసమే పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రతి మంగళవారం రౌడీషీటర్లు, ఇతర నేరస్తులు స్టేషన్‌కు వచ్చి సంతకాలు చేసేలా చర్యలు తీసుకున్నాం. నాటుసారాపై కొరడా ఝళిపిస్తున్నాం. – వి.హర్షవర్దన్‌రాజు, జిల్లా ఎస్పీ -
ఎర్రచందనానికి సాంకేతిక రక్ష
సాక్షి, అమరావతి: ఎర్రచందనం అక్రమంగా రవాణాను మరింత సమర్థంగా అరికట్టేందుకు ప్రభుత్వం అత్యాధునిక టెక్నాలజీని వినియోగించనుంది. ఇప్పటికే బేస్‌క్యాంప్‌లు, స్ట్రైకింగ్ ఫోర్స్‌లు, చెక్‌పోస్టులు, ఈ–నిఘా ద్వారా స్మగ్లర్ల కార్యకలాపాలను చాలావరకు నిరోధించింది. ఇప్పుడు టెక్నాలజీని ఉపయోగించుకుని స్మగ్లర్లు అడుగు ముందుకువేసే పరిస్థితి లేకుండా చేసేందుకు పక్కా ప్రణాళిక రూపొందించింది. హై రిజల్యూషన్ శాటిలైట్, లైడార్ డేటా ద్వారా ప్రతి చెట్టును పర్యవేక్షించే ఏర్పాట్లు చేస్తున్నారు. చెట్లు కూలిపోయినప్పుడు తెలుసుకునేందుకు సౌండ్ అండ్ మోషన్ సెన్సార్‌ను కొన్ని కీలకమైన పాయింట్లలో అమర్చనున్నారు. అలాగే జియో రిఫరెన్సింగ్‌ద్వారా కూడా చెట్లను పర్యవేక్షించనున్నారు. అటవీ ప్రాంతాల్లోని రోడ్లు, వ్యూ పాయింట్ల వద్ద హై రిజల్యూషన్ ఐపీ కెమెరాలు అమర్చడం ద్వారా చీమచిటుక్కుమన్నా తెలిసిపోయేలా నిఘాను పటిష్టం చేసేందుకు రంగం సిద్ధమైంది. డ్రోన్ కెమెరాలతో అడవిలోని మారుమూల ప్రాంతాలను సైతం స్పష్టంగా జల్లెడ పట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అక్రమంగా అడవి దాటించడం అంత ఈజీ కాదు ఎర్రచందనం వృక్షాలున్న అటవీ ప్రాంతాల్లో తిరిగే వాహనాల సమాచారం తెలుసుకునేందుకు నంబర్ ప్లేట్ రీడర్స్ ఉన్న ఆటోమేటిక్ కెమెరాలను (నంబర్ ప్లేట్‌ను స్కాన్‌చేసి ఆ వాహనం వివరాలు తెలుపుతుంది) సిద్ధం చేస్తున్నారు. దుంగలను తరలించే వాహనాలను గుర్తించేందుకు అడ్వాన్స్డ్ వెహికల్ స్కానర్లను వినియోగించనున్నారు. దీనికితోడు ఎర్రచందనం కేసుల్లో ఉన్న పాత నేరస్తులను గుర్తించేందుకు ఫేస్ ఐడెంటిఫికేషన్ వ్యవస్థను సమకూరుస్తున్నారు. వారి పూర్తి సమాచారంతో డేటాబేస్ సిద్ధం చేస్తున్నారు. ఈ డేటాను చెక్‌పోస్టులు, ఫేస్ డిటెక్షన్ యాప్స్‌తోపాటు పోలీసు, కస్టమ్స్ విభాగాలతో అనుసంధానం చేస్తున్నారు. ఇవన్నీ అందుబాటులోకి వస్తే ఎర్ర చందనం దుంగల్ని నరకడం, అక్రమంగా తరలించడం దాదాపు అసాధ్యమని అటవీ అధికారులు చెబుతున్నారు. ఏడాదిలోపే ఈ వ్యవస్థలను అమల్లోకి తీసుకురావడానికి రంగం సిద్ధమవుతోంది. 20 సంవత్సరాల్లో 17 వేల కేసులు గత 20 సంవత్సరాల్లో అక్రమంగా తరలిస్తున్న 15 వేల మెట్రిక్ టన్నుల ఎర్రచందనం దుంగల్ని, 10 వేల వాహనాల్ని పోలీసు, అటవీశాఖల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 17 వేల కేసులు పెట్టి 30 వేలమందికిపైగా నిందితుల్ని అరెస్టు చేశారు. 2021–22లో 133.57 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం దుంగల్ని స్వాధీనం చేసుకున్నారు. 255 కేసులు నమోదు చేసి 635 మందిని అరెస్ట్ చేసి 144 వాహనాలను సీజ్‌చేశారు. అంతరించే దశలో.. అంతరిస్తున్న వృక్షాల జాబితాలో ఉన్న ఎర్రచందనం రాయలసీమ అటవీ ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణ. ప్రపంచంలో ఎక్కడా ఈ తరహా ఎర్రచందనం వృక్షాలు పెరగవు. అందుకే ఈ దుంగల్ని అక్రమంగా విదేశాలకు తరలించి సొమ్ము చేసుకునేందుకు స్మగ్లర్లు ఎంతకైనా తెగిస్తారు. ఉమ్మడి వైఎస్సార్, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లోని శేషాచలం, వెలిగొండ, లంకమల, పాలకొండ అడవుల్లో 5.30 లక్షల హెక్టార్లలో ఈ వృక్షాలున్నాయి. సుమారు 5,300 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఎర్రచందనం చెట్లు ఉన్నట్లు అటవీశాఖ లెక్కలు చెబుతున్నాయి. అత్యధికంగా ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో 3,063 చదరపు కిలోమీటర్లలో, నెల్లూరు జిల్లాలో 671.17, చిత్తూరు జిల్లాలో 1,090, ప్రకాశం జిల్లాలో 263, కర్నూలు జిల్లాలో 212 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. -
పుష్పరాజ్‌లపై ‘సెబ్’ నిఘా
సాక్షి, అమరావతి: ఎర్ర చందనం స్మగ్లింగ్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కార్యాచరణ సత్ఫలితాలనిస్తోంది. స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్‌ను ‘స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(సెబ్) పరిధిలోకి తెస్తూ రూపొందించిన వ్యూహం విజయవంతమవుతోంది. రాష్ట్రం మొత్తాన్ని ఒక యూనిట్‌గా పరిగణిస్తూ డీఐజీ పర్యవేక్షణలో ‘సెబ్’ ఆపరేషన్లు నిర్వహిస్తోంది. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్ల నరికివేతకు అడ్డుకట్ట వేస్తోంది. పటిష్ట నిఘా.. ముమ్మర కూంబింగ్ ఎర్రచందనం స్మగ్లింగ్‌ను నిరోధించేందుకు ‘సెబ్’ బహుళ అంచెల వ్యవస్థను నెలకొల్పింది. తమిళనాడు, కర్ణాటక, కేరళ పోలీసుల సహకారంతో పటిష్ట వ్యూహాన్ని అమలు చేస్తోంది. పొరుగు రాష్ట్రాల్లో స్మగ్లర్లను గుర్తించి కార్యకలాపాలపై నిఘా పెట్టింది. మన రాష్ట్రంలో ఎర్రచందనం చెట్ల నరికి వేతలో పాల్గొంటున్న కూలీలు, రవాణా వాహనా లను సమకూర్చే వారిని గుర్తించింది. స్మగ్లర్లపై హిస్టరీ షీట్స్ తెరవడంతోపాటు పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తోంది. శేషాచలం అడవుల్లో కూంబింగ్ ముమ్మరం చేసింది. కనీసం రెండు పార్టీలు నిరంతరం కూంబింగ్ చేసేలా షెడ్యూల్ రూపొందించింది. అటవీ, రెవెన్యూ, ఎన్హెచ్ఏఐ శాఖల సహకారంతో దాడులు తీవ్రతరం చేస్తోంది. వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. కీలక ప్రదేశాల్లో సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేసింది. దశాబ్దం తరువాత తొలిసారిగా.. రెండేళ్లుగా సెబ్ బృందాలు పెద్ద ఎత్తున ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకుంటూ కేసులు నమోదు చేస్తున్నాయి. 520 కేసులు నమోదు చేసి 2,546 మందిని అరెస్టు చేశారు. 18,033 ఎర్రచందనం దుంగలు, 345 వాహనాలను జప్తు చేశారు. రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్ తగ్గుముఖం పట్టడం దశాబ్దం తరువాత ఇదే తొలిసారని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. -
'ఎర్ర'స్మగ్లింగ్‌పై ఎల్లలు లేని నిఘా!
సాక్షి, అమరావతి: ఎర్ర చందనం స్మగ్లింగ్‌ను పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు ప్రభుత్వం పటిష్ట కార్యాచరణకు ఉపక్రమించింది. ఎర్ర స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ఉద్దేశించిన టాస్క్ ఫోర్స్‌ను ‘స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(సెబ్) పరిధిలోకి తీసుకొచ్చింది. రాష్ట్ర స్థాయిలో కేంద్రీకృత వ్యవస్థ ద్వారా ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులిచ్చింది. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు దశాబ్దాలుగా చేస్తున్న యత్నాలు పూర్తి స్థాయిలో సఫలీకృతం కావడం లేదు. చాలా ఏళ్ల కిందటే ప్రభుత్వం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. కానీ జిల్లా ఎస్పీల బాధ్యత ఆయా జిల్లాలకే పరిమితమవుతుండటంతో ఆశించిన ఫలితాలు రావడం లేదు. చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో విస్తరించి ఉన్న ఎర్ర చందనం ఆయా జిల్లాలతో పాటు అనంతపురం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లోంచి రాష్ట్ర సరిహద్దులు దాటుతోంది. మరోవైపు ఎర్రచందనం స్మగ్లర్లు తమిళనాడులో ఉంటూ ఏపీలో కూలీలు, ఏజంట్ల ద్వారా యథేచ్చగా దందా సాగిస్తున్నారు. దీంతో ఈ స్మగ్లింగ్‌ను అరికట్టాలంటే పొరుగు రాష్ట్రాలతో మరింత కేంద్రీకృత సమన్వయం అవసరమని గుర్తించారు. ఈ నేపథ్యంలో సెబ్ పరిధిలోకి ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక టాస్క్‌ఫోర్స్‌ను తీసుకొచ్చారు. గంజాయి సాగు, రవాణాను రూపుమాపడంలో సెబ్ విజయవంతం అక్రమ ఇసుక, అక్రమ మద్యం, గుట్కా, గంజాయి దందాలను అరికట్టడంతో సెబ్ ఇప్పటికే విజయవంతమైంది. తాజాగా ఆంధ్ర–ఒడిశా సరిహద్దు(ఏవోబీ)ల్లో దశాబ్దాలుగా సాగుతున్న గంజాయి సాగు, అక్రమ రవాణాను విజయవంతంగా రూపుమాపడం సెబ్ సమర్థతకు నిదర్శనం. అందుకే ఎర్రచందనం స్మగ్లింగ్‌ను నిరోధించే బాధ్యతను సెబ్‌కు అప్పగించింది. డీజీపీ నియంత్రణలో సెబ్ కమిషనర్ ఎర్రచందనం నిరోధక టాస్క్ ఫోర్స్‌ను పర్యవేక్షిస్తారు. ఆయనకు సెబ్ డైరెక్టర్ సహకరిస్తారు. అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ పాలనపరమైన అంశాలను పర్యవేక్షిస్తారు. ఈ మేరకు గతంలో జారీ చేసిన ఉత్తర్వులకు ప్రభుత్వం సవరణలు చేసింది. రాష్ట్రం అంతా సెబ్ అధికార పరిధిలోకి వస్తున్నందున జిల్లా సరిహద్దులు వంటి సాంకేతిక అడ్డంకులుండవు. సెబ్‌కు ఇప్పటికే ప్రత్యేక పోలీస్ స్టేషన్లున్నాయి. పొరుగు రాష్ట్రాల పోలీసులు, కేంద్ర పరిధిలోని పోర్టు అధికార వర్గాలతో సంప్రదింపులు, సహకారం వంటివి సెబ్‌కు మరింత సులభతరమవుతాయి. అవసరమైనప్పుడు పొరుగు రాష్ట్రాల పోలీసులతో కలసి జాయింట్ ఆపరేషన్లు కూడా నిర్వహించేందుకు అవకాశముంటుంది. ఏవోబీలో గంజాయి దందాను అరికట్టేందుకు ఒడిశా పోలీసులతో సమన్వయంతో పనిచేయడం తాజా తార్కాణం. ఈ నేపథ్యంలో ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక టాస్క్‌ఫోర్స్‌ను సెబ్ పరిధిలోకి తీసుకురావడం సానుకూల నిర్ణయమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీని ద్వారా దశాబ్దాలుగా వేళ్లూనుకుని ఉన్న ఎర్రచందనం స్మగ్లింగ్‌ను తుద ముట్టించవచ్చని భావిస్తున్నారు. -
‘పుష్ప’ను ఫాలో అయ్యి.. పరారయ్యారు!
శృంగవరపుకోట/నర్సీపట్నం: ఇటీవల విడుదలైన పుష్ప సినిమాలో పాల ట్యాంకర్లో ఎర్రచందనం దుంగలను స్మగ్లింగ్ చేస్తారు. ఈ ఐడియా ఏదో మనకు పనికొస్తుంది అనుకున్నారో ఏమో.. ఆ గంజాయి స్మగ్లర్లు అచ్చం అదే ఐడియాను అనుసరించారు. ఆయిల్ ట్యాంకర్లో గంజాయి రవాణా చేస్తూ విజయనగరం జిల్లా ఎస్.కోట పోలీసులకు దొరికిపోయారు. అరకు నుంచి ఎస్.కోట వైపు వస్తున్న ఆయిల్ ట్యాంకర్లో అక్రమంగా గంజాయి తరలిస్తున్నారన్న సమాచారం ఆదివారం ఎస్.కోట ఎస్ఐ తారకేశ్వరరావుకు అందింది. దీంతో తన సిబ్బందితో కలిసి బొడ్డవర చెక్‌పోస్టు వద్ద కాపుకాశారు. ఉదయం 7.30 గంటల సమయంలో ఆయిల్ ట్యాంకర్‌ను పోలీసులు అడ్డుకున్నారు. తొలుత తమ లారీలో ఎలాంటి గంజాయి లేదని డ్రైవర్, క్లీనర్లు బుకాయించారు. పోలీసులు ట్యాంకర్ పైకి ఎక్కి నాలుగు కంపార్ట్మెంట్లపై క్యాప్‌లకు ఉన్న నట్లు తీసేందుకు ప్రయత్నించగా వారు అక్కడ నుంచి ఉడాయించారు. ట్యాంకర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించి నాలుగు కంపార్ట్మెంట్ల క్యాప్‌లు తెరచి చూడగా.. ముందున్న కంపార్ట్మెంట్, వెనుక ఉన్న రెండు కంపార్ట్మెంట్లను ఖాళీగా వదిలేశారు. మధ్యలోని రెండో కంపార్ట్మెంట్లో లోడ్ చేసిన 780 కిలోల 149 గంజాయి ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.30 లక్షలు ఉంటుందని భావిస్తున్నారు. పరారైన నిందితుల కోసం గాలిస్తున్నారు. నర్సీపట్నంలో రూ.3 లక్షల విలువైన గంజాయి స్వాధీనం లారీలో తరలిస్తున్న 1100 కిలోల గంజాయిని విశాఖ జిల్లా నర్సీపట్నం రూరల్ పోలీసులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు ఎస్ఐ రమేష్ తన సిబ్బందితో కలిసి చింతపల్లి రోడ్డు నెల్లిమెట్ట వద్ద శనివారం రాత్రి వాహన తనిఖీలు నిర్వహించారు. పోలీసులను గమనించిన డ్రైవర్ కొద్ది దూరంలో లారీ ఆపి పారిపోయాడు. లారీని పోలీసులు తనిఖీ చేయగా సుమారు రూ.3 లక్షల విలువైన గంజాయి బయటపడింది. -
వైరల్: ‘పుష్ప’ స్టైల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్.. చివర్లో షాకిచ్చిన పోలీసులు
ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ‘పుష్ప’ సినిమా ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చెప్పిన తగ్గేదేలే డైలాగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించింది. సినిమా వచ్చినప్పటి నుంచి ప్రతి చోట, అందరి నోటా ఈ డైలాగే వినిపిస్తోంది. తాజాగా అచ్చం పుష్ప సినిమాను ఆదర్శంగా తీసుకొని ఓ వ్యక్తి ఎర్రచందనం స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే పక్కా ప్లాన్‌తో వెళ్లిన ఆ స్మగ్లర్‌కు పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే… కర్ణాటకలోని బెంగుళూరు సమీపంలోని అనేకల్‌కు చెందిన సయ్యద్ యాసిన్ అనే స్మగ్లర్ పోలీసులకు చిక్కకుండా ఎర్ర చందనాన్ని అనుకున్న గమ్యానికి చేరవేయడంలో దిట్ట. అచ్చం పుష్ప సినిమా మాదిరే పోలీసులకు అనుమానం రాకుండా చాకచక్యంగా వ్యవహరిస్తూ ప్రతి చెక్ పోస్ట్ దాటిస్తూ సరుకును రవాణా చేస్తుంటాడు. ఎప్పటిలాగే తన ట్రక్కులో కర్ణాటక-ఆంధ్ర సరిహద్దు నుంచి మహారాష్ట్రకు మార్గమధ్యంలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేందుకు బయలు దేరాడు. చదవండి: వివాహేతర సంబంధం: 16 ఏళ్ల క్రితం పెళ్లి, భర్త అడ్డొస్తున్నాడనే ప్రియుడితో కలిసి.. లారీ ముందు భాగంలో కోవిడ్ బాధితులకు పండ్లు సరఫరా చేసేవాహనం అని రాయించి.. లారీలో ఎర్ర చందనం దుంగలతో పాటు కొన్ని పండ్లు కూడా లోడ్ చేయించుకుని బయలు దేరాడు. ఆంధ్ర, కర్ణాటక చెక్ పోస్టుల్లో అధికారుల కళ్లు కప్పి జనవరి 31న మహారాష్ట్రకు చేరుకున్నాడు. మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా మీరజ్ నగర్ వద్ద సరిహద్దు దాటుతుండగా పోలీసులు అతన్ని పట్టుకున్నారు. పోలీసులు తనిఖీ చేసి అతని నుంచి రూ.2.45 కోట్ల విలువైన చందనంతో పాటు రూ.10 లక్షల విలువైన లారీని స్వాధీనం చేసుకున్నారు. చదవండి: స్కూల్ భవనం వెనక్కి తీసుకెళ్లి.. విద్యార్థినిపై ఆరుగురు టీనేజర్ల లైంగిక దాడి -
భారీగా ఎర్రచందనం పట్టివేత
కర్నూలు (ఓల్డ్‌సిటీ)/ఓర్వకల్లు: కర్నూలు సమీపంలోని నన్నూర్ టోల్గేట్ ప్లాజా వద్ద భారీగా ఎర్రచందనం దుంగలను ఆదివారం పోలీసులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారం ప్రకారం వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా సాయంత్రం 4.05 గంటల సమయంలో హైదరాబాద్ నుంచి చెన్నైకు వెళ్తున్న డీసీఎం వాహనంలో 177 ఎర్రచందనపు దుంగలను గుర్తించారు. లారీతో సహా వీటిని స్వాధీనం చేసుకొని ఓర్వకల్లు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇవి 3.84 టన్నుల బరువున్నాయని, రూ. 3.84 కోట్ల విలువ చేస్తాయని కర్నూలు డీఎస్పీ వెంకట్రామయ్య తెలిపారు. ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన మాగుంట విశ్వనాథ్‌రెడ్డి అలియాస్ ప్రసాద్‌రెడ్డి కొంతకాలం నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నట్లు డీఎస్పీ చెప్పారు. చదవండి: అడ్డదారిలో అక్రమ కిక్కు..! జైల్లో ఉన్న నిందితుడిని పోలీసులు విచారించగా శంషాబాద్ గోడౌన్ల్లలో ఉన్న ఎర్రచందనం దుంగలను కల్లూరు ఎస్టేట్‌కు చెందిన కంద గడ్డల సుబ్బారావు కుమారుడు శివకుమార్ (లారీ డ్రైవర్ కమ్ ఓనర్, స్కంద వెంచర్లో పనిచేస్తున్న నజీర్ అనే వ్యక్తి సహకారంతో చెన్నైకి తరలిస్తున్నట్లు చెప్పారన్నారు. పక్కా సమాచారంతో ఎర్రచందనం దుంగులను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. లారీ డ్రైవర్ శివకుమార్‌ను అరెస్టు చేశామని, నజీర్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. గతంలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తుండగా శివకుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారని, బెయిల్‌పై వచ్చి అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. వీరిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. తనిఖీల్లో కర్నూలు రూరల్ సీఐ ఎం. శ్రీనాథ్‌రెడ్డి, కర్నూలు మూడో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ ఎం.తబ్రేజ్, ఓర్వకల్లు ఎస్ఐ మల్లికార్జున సిబ్బందితో పాల్గొన్నారు. చదవండి: పేదల వకీల్ తరిమెల బాలిరెడ్డి కన్నుమూత -
ప్రభుత్వ అధికారులను కూడా వదలం
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో ఇసుక, మద్యం అక్రమ రవాణాను సక్సెస్ ఫుల్‌గా కట్టడి చేశాం. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(ఎస్ఈబీ)కి రాష్ట్ర ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది అన్నారు సెబ్ (ఎస్ఈబీ) కమిషనర్ వినీత్ బ్రిజ్ లాల్. ఈ సందర్భంగా సాక్షి టీవీతో ఆయన మాట్లాడుతూ.. ‘సెబ్ పరిధిలో 4వేల మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. తాజాగా 106 మంది సిబ్బందిని అదనంగా పెంచారు. గంజాయి, గుట్కా, ఎర్ర చందనం స్మగ్లింగ్, ఆన్లైన్ గాంబ్లింగ్‌లను కూడా ప్రభుత్వం సెబ్ పరిధిలోకి తీసుకువచ్చింది. ఆన్లైన్ బెట్టింగ్, గాంబ్లింగ్ అడుతూ యువకులు భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు. మాఫియాల మూలాలు కనిపెట్టి కఠినమైన చర్యలు తీసుకుంటాం’ అన్నారు. (చదవండి: అక్రమార్కుల బెండు తీస్తున్న సెబ్) ‘ఎర్ర చందనంపై ప్రత్యేక నిఘా ఎర్పాటు చేస్తాం. ఫారెస్ట్, పోలీస్ శాఖలను సమన్వయ పరుచుకొని ఎర్రచందనం రవాణాకు అడ్డుకట్ట వేస్తాం. కొండకింద గ్రామాల ప్రజలకు అవగాహన కల్పించి స్మగ్లర్ల భరతం పడతాం. అక్రమ రవాణాని అడ్డుకొనేందుకు రాష్ట్ర సరిహద్దులోని సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తాం. అక్రమార్కులకు సహకరిస్తే ప్రభుత్వాధికారులను కూడా వదలం. ప్రభుత్వ లక్షాన్ని ఛేదించటమే లక్ష్యంగా సెబ్ ముందుకు సాగుతుంది అన్నారు. -
అంతర్జాతీయ 'ఎర్ర' స్మగ్లర్ బాషా భాయ్ అరెస్ట్
కడప అర్బన్: మోస్ట్ వాంటెడ్ అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ షేక్ అబ్దుల్ హకీం అలియాస్ బాషా భాయ్ ఎట్టకేలకు పోలీసుల చేతికి చిక్కాడు. వైఎస్సార్ జిల్లా ఎస్పీ అన్బురాజన్ పర్యవేక్షణలో జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) ఖాసీం, ఓఎస్డీ (ఆపరేషన్స్) దేవప్రసాద్, డీఎస్పీ సూర్యనారాయణ, ఇతర సిబ్బంది.. బాషాతోపాటు మరో 11 మందిని సోమవారం అరెస్టు చేశారు. కడపలోని జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్లో నిందితులను మీడియా ఎదుట హాజరుపరిచారు. వివరాలను ఎస్పీ అన్బురాజన్ మీడియాకు వెల్లడించారు. బాషా భాయ్‌తో పాటు కడపకు చెందిన జయరాం నాయక్, వెంకట మహేశ్వరరాజు, గిరీశ్‌కుమార్, తిప్పిరెడ్డిపల్లెకు చెందిన విశ్వనాథరెడ్డి, కొత్తపల్లికి చెందిన ప్రేమ్‌కుమార్, తూర్పుగల్లూరు కాలనీకి చెందిన నవీన్‌కుమార్, బీడీ కాలనీకి చెందిన రవికాంత్, పెద్దచెప్పలికి చెందిన పెయ్యల చిరంజీవి ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ కడపలో పట్టుబడ్డారు. అలాగే రైల్వేకోడూరులో వీరరాఘవ సెట్టియార్, రామన్ అశోక్, మణిమాధవన్లు స్మగ్లింగ్ చేస్తూ అరెస్టయ్యారు. ఈ 12 మంది నుంచి 1.300 టన్నుల బరువున్న 34 ఎర్రచందనం దుంగలను, లారీ, కారు, మూడు మోటార్‌సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో బయటికి.. ఈ నెల 2న కడప– కమలాపురం రహదారిపై స్కార్పియో వాహనం.. టిప్పర్‌ను ఢీకొన్న ఘటనలో ఐదుగురు మరణించిన సంగతి తెలిసిందే. ఈ కేసును పోలీసులు సవాల్‌గా తీసుకుని దర్యాప్తు చేపట్టారు. ఎర్రచందనం నరికి అప్పగించడానికి తమిళనాడుకు చెందిన తొమ్మిది మంది కూలీలతో బాషా ఒప్పందం కుదుర్చుకున్నాడు. కూలీలు ఎర్రచందనం దుంగలతో ఈ నెల 2న స్కార్పియోలో బయలుదేరారు. అయితే వారికి ఇస్తానన్న మొత్తం ఎగ్గొట్టాలని బాషా నిర్ణయించుకున్నాడు. వీరిని అటకాయించి దుంగలు తీసుకురావాలని తన అనుచరులను కారులో పంపాడు. ఆ కారును చూసిన తమిళ కూలీలు పోలీసులు అనుకుని భయపడ్డారు. దీంతో వాహనాన్ని వేగంగా పోనిస్తూ టిప్పర్‌ను ఢీకొట్టి ఐదుగురు మృతి చెందారు. ఎవరీ భాషా? పోలీసులు తమ దర్యాప్తులో బాషా భాయ్‌ని ఘటనకు బాధ్యుడిగా తేల్చారు. ఇతడిపై వివిధ జిల్లాల్లో 26 కేసులు ఉన్నాయి. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన బాషా భాయ్ కడపలోని బంధువుల వద్దకు వచ్చిపోతూ ఉండేవాడు. అనేక వ్యాపారాలు చేసిన అతడు గుప్తనిధుల కోసం ప్రయత్నాలు చేశాడు. సులువుగా డబ్బు సంపాదించేందుకు ఎర్రచందనం స్మగ్లింగ్‌ను ఎంచుకున్నాడు. గతంలో 9 నెలలు కడప, చిత్తూరు జైళ్లలో గడిపాడు. విడుదలయ్యాక కోయంబత్తూరులో బట్టల వ్యాపారం ముసుగులో మళ్లీ ఎర్రచందనం స్మగ్లింగ్ మొదలుపెట్టాడు. -
ఎవరీ బాషా భాయ్..?
కడప అర్బన్: కొందరు పోలీసు, అటవీ అధికారుల వైఫల్యం..లాలూచీ.. వెరసి జిల్లాలో యథేచ్ఛగా ఎర్రచందనం స్మగ్లింగ్‌కు ద్వారాలు తెరుచుకుంటున్నాయి. జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా ఎర్రచందనం స్మగ్లింగ్ జోరుగా సాగుతూనే ఉంది. తరచూ పోలీసు, అటవీ అధికారులు ఎర్రచందనం స్మగ్లర్ల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నామని.. కొందరు కూలీలను, స్మగ్లర్లను అరెస్టు చేశామని దుంగలు, దొంగలతో ఫొటోలకు ఫోజులివ్వడం రివాజుగా మారింది. ఎర్రచందనం తరలిస్తూ పోలీసులకు లేదా అటవీ అధికారులకు దొరికిన వారి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టడంలో సంబంధిత అధికారులు విఫలమవుతున్నారా.. లేక ఆ దిశగా దర్యాప్తు చేసేందుకు వేరే కారణాలేమైనా అడ్డుగా ఉన్నాయా అనేది అర్థం కావడం లేదు. సాధారణంగా ఒక కేసులో నిందితుడిని అరెస్టు చేసినప్పుడు అతన్ని ఈ ప్రాంతానికి తీసుకొచ్చింది ఎవరు.. అతనితో వీరికి పరిచయం ఎలా కలిగింది.. ఇక్కడి అడవుల్లో మకాం వేసిన తర్వాత వారికి అవసరమైన నిత్యావసరాలను సరఫరా చేస్తున్నది ఎవరు.. స్థానికంగా వారికి సహకరిస్తున్నది ఎవరు.. ఇక్కడి సంపదను ఎక్కడికి తరలిస్తారు.. వారి డంప్ ఎక్కడ ఉంది.. స్మగ్లింగ్‌లో భాగస్వాములైన కీలక వ్యక్తులు ఎవరు.. ఇలాంటి పలు అంశాల ఆధారంగా లోతుగా దర్యాప్తు చేపడితే ఎర్రచందనం స్మగ్లర్ల మూలాలను తెలుసుకునేందుకు వీలుంటుంది. కానీ నిత్యం ఎర్రచందనం కూలీలను అరెస్టు చేశామని ప్రకటించడం తప్ప వారి వెనుక ఉన్న బడా వ్యక్తుల గుట్టు రట్టు చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రపంచంలోనే అరుదైన ఎర్రచందనం రాయలసీమ వ్యాప్తంగా దాదాపు 5లక్షల హెక్టార్లలో ఉండగా కేవలం జిల్లాలోని అటవీప్రాంతంలోనే 3.5 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉంది. కడప, ప్రొద్దుటూరు, రాజంపేట అటవీ డివిజన్ల పరిధిల్లో అన్నిచోట్ల 13 అటవీశాఖ చెక్‌పోస్ట్‌లు ఉన్నప్పటికీ, ఆయా ప్రాంతాల్లో పోలీసుల సమన్వయంతో విధులను నిర్వహించాల్సిన సిబ్బంది స్మగ్లర్లు ఇచ్చే డబ్బులకు ఆశపడి, వారి మార్గాన్ని సులువు చేస్తున్నారు జిల్లాలోని రైల్వేకోడూరు, రాజంపేట, రాయచోటి, బద్వేల్, సిద్దవటం, అట్లూరు, మైదుకూరు, ఖాజీపేట, చెన్నూరు, వనిపెంట, గువ్వలచెరువు, రామాపురం, పెండ్లిమర్రి, కడప నగర శివార్లలోని పాలకొండలు, మామిళ్లపల్లె ప్రాంతాల నుంచి ఎర్రచందనం స్మగ్లర్లు అడవుల్లోకి చొరబడుతున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు ప్రాంతం నుంచి కూలీలను చెన్నైలోని కోయంబేడు బస్టాండ్ నుంచి గతంలో జిల్లాకు యథేచ్ఛగా ఆర్టీసి బస్సుల్లోనే తీసుకుని వచ్చేవారు. ఇప్పుడు రూటు మార్చి చైన్నె నుంచి వాహనాల్లోనే జిల్లాలో తమకు అనుకూలంగా ఉన్న అటవీప్రాంతంలోకి చొరబడుతున్నారు. రైల్వేకోడూరు, రాయచోటి, దువ్వూరు, ప్రొద్దుటూరు, రాజంపేట, పెండ్లిమర్రి ప్రాంతాలకు చెందిన వ్యక్తులే ఎర్రచందనం స్మగ్లర్లుగా పేరొందుతున్నారు. స్థానికంగా ఉన్న స్మగ్లర్ల సహకారంతో జిల్లా స్థాయి నుంచి అంతర్జాతీయస్థాయి స్మగ్లర్లు దశలవారీగా కొందరు పోలీసు, అటవీ అధికారులకు, సిబ్బందికి లక్షల్లో ముడుపులు ఇవ్వడంతోనే వారిని చెక్‌పోస్టులను సైతం సులభంగా దాటించేస్తున్నారు. ఒకచోట అటవీప్రాంతంలోకి ప్రవేశించి, ఎర్రచందనం చెట్లను నరికేసి, మరో మార్గంలో రోడ్లపైకి తీసుకుని వచ్చేస్తూ, స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు. అక్రమరవాణా చేసుకుని తీసుకుని వచ్చిన ఎర్రచందనం దుంగలను కడప–రాయచోటి మీదుగా చిన్నమండెం బెంగళూరులోని కటిగెనహళ్లికి, రైల్వేకోడూరు వైపుగా తిరుపతి మీదుగా చైన్నెకి తీసుకుని వెళుతున్నారు. స్మగ్లర్లు బరితెగించి పోతుండగా మధ్యలో వారి మాటలు నమ్మి వచ్చిన కూలీలు పలు సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయారు. అయినా తమిళనాడు ప్రాంతం నుంచి కూలీలు ఎర్రచందనం దుంగలు నరికి తరలించేందుకు ఇక్కడికి వస్తూనే ఉన్నారు. స్మగ్లర్లకు సహకరించారనే కారణంగా గతంలో పలువురు అధికారులపై వేటు పడింది. కానీ మిగిలిన వారి వైఖరిలో మార్పు రాకపోవడం విచారకరం. ఇప్పటికైనా పోలీసు, అటవీ అధికారులు నిజాయితీగా వ్యవహరించి స్మగ్లర్ల ఆటకట్టించాల్సిన అవసరం ఉంది. సమగ్ర దర్యాప్తు చేస్తున్నాం– ఎస్పీ వల్లూరు మండలం గోటూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు సజీవదహనం, మరొకరు ఆసుపత్రిలో మృతి చెందిన సంఘటనపై సమగ్రంగా దర్యాప్తు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ తెలిపారు. మరో రెండు రోజుల్లో అన్ని విషయాలను వెల్లడిస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రధాన సూత్రధారి, పాత్రధారి బాషాభాయ్.. గోటూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తమిళ కూలీలు మృతి చెందిన సంఘటనకు సంబంధించి ప్రధాన సూత్రధారి, పాత్రధారి బాషాభాయ్‌గా పోలీసులు గుర్తించారు. జిల్లాకు చెందిన బాషాభాయ్ గత కొన్ని సంవత్సరాలుగా ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతూ పోలీసుల కళ్లుగప్పి చెన్నైకి మకాం మార్చినట్లు తెలుస్తోంది. ఇతనిపై జిల్లాలో మూడు పోలీసు స్టేషన్ల పరిధిలో కేసులు ఉన్నట్లు సమాచారం. ఇతన్ని పట్టుకునేందుకు ఎర్రచందనం టాస్‌్కఫోర్స్ ప్రత్యేక బృందం చెన్నై వెళ్లినట్లు తెలిసింది. కాగా, ఇతను కారులో ప్రయాణిస్తున్న లోకల్ గ్యాంగ్‌కు రూ.10 లక్షలు ఎర చూపి తమిళ కూలీల స్కార్పియోను అటకాయించాలని చెప్పినట్లు తెలిసింది. దీంతో ఇటియోస్ కారులోని ముగ్గురు నిందితులు స్కారి్పయోను వెంబడించి ప్రమాదానికి కారణమయ్యారు. కారులోని ముగ్గురు నిందితులలో పెండ్లిమర్రి మండలానికి చెందిన విశ్వనాథరెడ్డి, రాయచోటికి చెందిన జయరాం నాయక్, కడపకు చెందిన మహేష్‌లు ఉన్నారు. వీరిని ప్రత్యేక పోలీసు బృందం అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. వీరిలో విశ్వనాథరెడ్డిపై ఎనిమిది కేసులు, మహేష్‌పై 14 కేసులు, జయరాం నాయక్‌పై 6 కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. -
టిప్పర్‌ను ఢీకొన్న స్మగ్లర్ల వాహనం
వల్లూరు (వైఎస్సార్ జిల్లా): వైఎస్సార్ జిల్లా కడప–తాడిపత్రి ప్రధాన రహదారిపై వల్లూరు మండల పరిధిలోని గోటూరు, తోల్లగంగనపల్లె బస్‌స్టాప్‌ల మధ్య సోమవారం వేకువజామున చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరికి గాయాలు కాగా.. వారిలో ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కంకరను అన్లోడ్ చేసిన టిప్పర్ వేకువజామున 3.15 గంటల సమయంలో కడప వైపు వెళ్లేందుకు ప్రధాన రహదారిపైకి ఎక్కుతుండగా అనంతపురం వైపు ఎర్ర చందనం దుంగలను తరలిస్తున్న స్కార్పియో వాహనం అతి వేగంగా వచ్చి ఢీకొట్టింది. దాని వెనుకే వస్తున్న మరో కారు సైతం వీటిని ఢీకొంది. దీంతో టిప్పర్ డీజిల్ ట్యాంక్ ధ్వంసమై మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో స్కార్పియో వాహనంలోని ఎర్రచందనం స్మగ్లింగ్ ముఠాకు చెందిన కూలీల్లో నలుగురు సజీవ దహనం కాగా.. అందులో ఉన్న ఎర్ర చందనం దుంగలు కాలిపోయాయి. తీవ్ర గాయాల పాలైన మరో ముగ్గురిని 108 వాహనంలో కడప రిమ్స్‌కు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మూర్తి అనే మరో కూలీ మృతి చెందాడు. ప్రాథమిక ఆధారాలను బట్టి సజీవ దహనమైన వారిలో ముగ్గురు తమిళనాడుకు చెందిన రాజన్, సందిరన్, రామచంద్రన్‌గా తెలుస్తోంది. మృతుల్లో మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదంలో టిప్పర్, స్కార్పియోతో పాటు మరో కారు కూడా కాలిపోయాయి. ప్రమాదం జరిగిన వెంటనే టిప్పర్ డ్రైవర్ కిందకు దూకి అపాయం నుంచి తప్పించుకున్నాడు. ప్రమాదానికి గురైన మరో కారు ఎవరిది, అందులో ప్రయాణిస్తున్న వారు ఏమయ్యారనేది ఇంకా తెలియరాలేదు. ప్రమాదంతో వెలుగులోకొచ్చిన స్మగ్లింగ్ అరుదైన ఎర్ర చందనం చెట్లు కడప, రాజంపేట, ప్రొద్దుటూరు డివిజన్ల పరిధిలో దాదాపు 3.5 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉన్నాయి. ఈ మూడు డివిజన్ల పరిధిలో అటవీ శాఖ ఆధ్వర్యంలో 13 చెక్ పోస్టులు నడుస్తున్నాయి. గతంలో కడప డివిజన్లోని సిద్ధవటం, రాయచోటి, వేంపల్లె, భాకరాపేట ప్రాంతాల నుంచి ఎర్ర చందనం ఎక్కువగా స్మగ్లింగ్ అయ్యేది. ఆ తరువాత సద్దుమణిగినా.. ఈ ఘటనతో స్మగ్లర్ల ఉనికి మరోసారి వెలుగులోకి వచ్చింది. -
ఎర్రచందనం స్మగ్లింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటాం
-
పాత దుస్తుల మాటున ఎర్రచందనం రవాణా
-
పాత దుస్తుల మాటున ఎర్రచందనం రవాణా
కాంచీపురం (తమిళనాడు): పాత దుస్తుల మాటున ఎర్రచందనం దుంగలను అక్రమంగా రవాణా చేస్తున్న లారీని తమిళనాడు పోలీసులు శనివారం రాత్రి పట్టుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న దుంగల విలువ సుమారు రూ.30 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. కాంచీపురం జిల్లా శ్రీపెరంబుదూరు సమీపంలోని బన్రుట్టి అనే గ్రామంలో కలైసెల్వం అనే వ్యక్తికి చెందిన స్థలంలో రెండు గోదాములున్నాయి. వీటిని లీజుకు తీసుకుని పలువురు పాత దుస్తుల వ్యాపారం చేస్తున్నారు. అయితే అక్కడి నుంచి ఎర్రచందనం రవాణా చేస్తున్నట్లు అందిన సమాచారంతో పోలీసులు శనివారం రాత్రి ఆ సమీపంలో మాటు వేసి ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్న లారీని పట్టుకున్నారు. లారీలోని పాత దుస్తుల మూటల్లో దాచిన 15 టన్నుల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. గోదాములో అక్రమంగా ఉంచిన 10 టన్నుల దుంగలను స్వాధీనం చేసుకుని, గోదామును సీజ్ చేశారు. లారీ డ్రైవర్‌ను, గోదాములో పనిచేస్తున్న మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్నారు. -
ఆ ‘ఇద్దరే’ టార్గెట్ .!
►ఎర్రచందనం అక్రమ రవాణాలో ఇక మిగిలింది అంతర్జాతీయ ప్రధాన స్మగ్లర్ ‘సాహుల్’ ‘ఏటీఎం’లే ►దుబాయ్‌లో కింగ్‌మేకర్‌గా ‘సాహుల్’ ►9 నెలల్లో 26 మందిపై పీడీ యాక్ట్ నమోదు ►వీరంతా ‘ సాహుల్’ అనుచరులే...! కడప అర్బన్: అంతర్జాతీయ స్థాయిలో ఎర్రచందనం స్మగ్లింగ్ సామ్రాజ్యాన్ని శాసిస్తున్న వారిలో ఇక మిగిలింది ఇద్దరే.. ఆ ఇద్దరు చెన్నైకి చెందిన సాహుల్ భాయ్ ఒకరు, పాండిచ్చేరికి చెందిన అహ్మద్ తయ్యుబ్ మొహిద్దీన్ అలియాస్ ఏటీఎం మరొకరు. వీరిద్దరి పేర్లు ప్రస్తుతం పోలీసుల రికార్డుల్లో ఉన్నట్లు సమాచారం. వీరిని అరెస్ట్ చేయగలిగితే అంతర్జాతీయ స్థాయిలో ఎర్ర చందనం అక్రమ రవాణా ప్రక్రియను పూర్తిగా కూకటి వేళ్లతో పెకలించినట్లవుతుందని పలువురు భావిస్తున్నారు. జిల్లా ఎస్పీగా పీహెచ్డీ రామకృష్ణ బాధ్యతలు చేపట్టిన తర్వాత గత ఏడాది ఆగస్టు నుంచి 26 మందిపై పీడీ యాక్ట్‌లను ప్రయోగించారు. వీరంతా సాహుల్ భాయ్ అనుచరులేనని పోలీసులు తమ విచారణలో తేల్చినట్లు సమాచారం. ఎర్రదుంగల అక్రమ రవాణాలో చురుగ్గా ‘ఏటీఎం’ జిల్లా నుంచి ఎర్రచందనం అక్రమ రవాణాను చెన్నై, కోల్‌కత్తాల నుంచి దుబాయ్, ఇతర దేశాలకు చాకచక్యంగా చేయడంలో ఏటీఎం నేర్పరి. పాండిచ్చేరిలో తనకున్న రిసార్ట్స్‌కు వచ్చి వెళుతుంటాడని సమాచారం. సాహుల్కు ఎర్రచందనం అక్రమ రవాణాలో సహకరించడంలో ఏటీఎందే ‘కీలక పాత్ర’. 9 నెలల్లోనే 26 మందిపై పీడీ యాక్ట్‌ల ప్రయోగం: వీరంతా సాహుల్ అనుచరులే..! వైఎస్ఆర్ జిల్లా పోలీసు యంత్రాంగం జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ పర్యవేక్షణలో టాస్క్‌ఫోర్స్, వివిధ పోలీస్ స్టేషన్ల అధికారులు, సిబ్బంది గత ఏడాది ఆగస్టు నుంచి ఇప్పటి వరకు 26 మందిపై పీడీ యాక్ట్‌లను ప్రయోగించి కడప కేంద్ర కారాగారంలో ఉంచారు. వీరిలో ప్రధానంగా పార్తిబన్, సుబ్రమణ్యం అలియాస్ సింగపూర్ సుబ్రమణ్యం, జాకీర్, ఫయాజ్ అహ్మద్ అలియాస్ ఫయాజ్‌లతో పాటు ఉన్నవారంతా సాహుల్ భాయ్ అనుచరులేనని పోలీసుల విచారణలో తేలినట్లు తెలుస్తోంది. టాస్క్‌ఫోర్స్ టార్గెట్‌లో ‘ఏటీఎం’, సాహుల్’.. జిల్లా పోలీసు యంత్రాంగం ఏటీఎం, సాహుల్లను అరెస్ట్ చేయగలిగితే ఎర్రచందనం అక్రమ రవాణాను కూడా పూర్తిగా నిర్మూలించినట్లేనని అనుకుంటున్నారు. ఇందుకోసం పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వారి కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం ముమ్మరంగా చేస్తున్నారు. నిఘా పెంచి వారిని త్వరగా అరెస్ట్ చేస్తే ఎర్రచందనం స్మగ్లింగ్ సామ్రాజ్యాన్ని కుప్పకూల్చినట్లే అవుతుందనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. దుబాయ్‌లో కింగ్ మేకర్‌గా‘సాహుల్ భాయ్’ ఎర్రచందనం స్మగ్లింగ్ సామ్రాజ్యాన్ని అంతర్జాతీయ స్థాయిలో విస్తరింపజేసేందుకు ‘సాహుల్ భాయ్’ దుబాయ్‌ని స్థావరంగా చేసుకున్నాడు. అక్కడ లైసెన్స్డ్ ఫర్నీచర్ షాపును నడుపుతూ తాను సంపాదించిన అక్రమార్జన ద్వారా అక్కడ కింగ్ మేకర్‌గా పేరు తెచ్చుకున్నాడు. తన ప్రధాన అనుచరుడు ఏటీఎం ద్వారా అనేక దేశాలకు సముద్ర మార్గంలో ఎర్రచందనం దుంగలను రవాణా చేస్తూ, వ్యాపారాన్ని యథేచ్ఛగా నిర్వహిస్తున్నాడు. వీరిద్దరూ పోలీసులకు చిక్కితే 100 శాతం ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టినట్లవుతుందని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. -
ఫ్రిజ్, టీవీల కోసం ఎర్ర స్మగ్లింగ్
శేషాచలంలో చొరబడ్డ వారంతా తమిళ యువకులే - అరెస్టయిన వారిలో అధిక శాతం వీరే - బైక్‌లు, రిఫ్రిజిరేటర్లు, కలర్ టీవీలపై మక్కువ - జైళ్లలో మగ్గుతున్న జువ్వాదీహిల్స్ ‘ఉడ్ కట్టర్స్’ కుటుంబాలు సాక్షి ప్రతినిధి, తిరుపతి: తమిళనాడుకి చెందిన యువత ఎర్రచందనం స్మగ్లింగ్‌పై ఆసక్తి చూపుతోంది. ధర్మపురి, తిరువణ్ణామలై, కాట్పాడి, వేలూరు జిల్లాలకు చెందిన వంద లాది మంది గిరిజన యువకులు శేషాచలం వైపు అడుగులు వేస్తున్నారు. గ్రామాల్లో తిరిగే దళారులు వ్యూహాత్మకంగా వేసే ఉచ్చులో పడుతున్న యువకులు బైక్‌లు, కలర్ టీవీలు, రిఫ్రిజిరేటర్లపై మోజుతో రెడ్ శాండల్ స్మగ్లిం గ్‌కు సిద్ధమవుతున్నారు. అనతికాలంలోనే లక్షలు సంపాదించాలన్న ఆశతో అడవుల్లో చొరబడి బయటకు రాలేక పోలీసులకు చిక్కి చివరికి జైళ్లల్లో మగ్గుతున్నారు. చిత్తూరు, కడప జిల్లాల్లో విస్తరించి ఉన్న శేషాచలంలో సరిహద్దుల్లో ఉన్న ఎర్ర చందనం చెట్లన్నీ నరికివేతకు గురయ్యాయి. ప్రస్తుతం అడవి మధ్య ప్రాంతాల్లోనే చెట్లు న్నాయి. వీటిని నరికి, శుద్ధి చేసిన దుంగలను భుజాన వేసుకుని దూరాన ఉండే వాహనాల దగ్గరకు చేర్చాలంటే బరువు మోసే సత్తా ఉన్న యువకులు అవసరం. చెట్టు కోయాలన్నా, కొమ్మలు నరకాలన్నా, స్వల్ప వ్యవధిలోనే దుంగలను తరలించాలన్నా యువకులకే సాధ్యం. రాళ్లతో కూడిన కాలిబాటలో నడవడం, నాలుగైదు రోజులు తిండీ నిద్రా లేకుండా పనిలో నిమగ్నం కావడం యువకులకే సాధ్యమవుతుంది. దీన్ని గుర్తించిన ఎర్ర చందనం స్మగ్లర్లు ధర్మపురి, తిరువణ్ణామలై, జువ్వాదిమలై ప్రాంతాలకు వెళ్లి యువకులకు ఎర వేస్తున్నారు. కిలోకి గరిష్టంగా రూ.500 చొప్పున కూలీ చెల్లిస్తామంటూ యువకులకు ఆశ చూపుతున్నారు. ఉదాహరణకు ఒక ఎర్ర చందనం దుంగ బరువు 25 నుంచి 28 కిలోల బరువు ఉంటుంది. ఒక్కొక్కరూ రెండేసి చెట్లు నరికి వాటిని స్మగ్లింగ్ చేస్తే పాతిక వేల దాకా కూలీ దక్కుతుంది. ఈ లెక్కన ఒక్కొక్కరూ నాలుగు చొప్పున రెండు వారాలకు రూ.50 వేల దాకా సంపాదిస్తున్నారు. కలలు చెదిరి కటకటాల్లోకి... ఈ మధ్య కాలంలో తిరుపతి టాస్క్‌ఫోర్స్ పోలీసులు సుమారు 160 మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు. వీరిలో 100 మందికి పైగా యువకులే ఉన్నారు. అదేవిధంగా ఫారెస్ట్, లా అండ్ ఆర్డర్ పోలీసులకు చిక్కిన వారిలోనూ యువకులే ఎక్కువ ఉన్నారు. తిరుపతి, చిత్తూ రు, నగరి, సత్యవేడు, మదనపల్లి జైళ్లల్లో వీరి సంఖ్య పెరుగుతూనే ఉంది. విషయాన్ని గుర్తించిన టాస్క్‌ఫోర్స్ ఐజీ కాంతారావు రెండుసార్లు జువ్వాదిమలై వెళ్లి ఆయా కుటుం బాలతో మాట్లాడారు. రెడ్ శాండల్ స్మగ్లింగ్ నేరమనీ, యువకుల భవిష్యత్తును భద్రంగా చూసుకోమని చెప్పినా ప్రయోజనం కనిపించడం లేదు. బైక్‌లు, కలర్ టీవీలపై ఆసక్తి... తిరువణ్ణామలై జిల్లా జువ్వాది హిల్స్‌లో ఉడ్ కట్టర్స్ కుటుంబాలు ఎక్కువ. ఇక్కడున్న ఎక్కువ మంది వీరప్పన్ అనుచరులుగానూ, సహాయకులుగానూ పనిచేశారు. చెట్లు నరకడం తప్ప వీరికి మరే పనీ రాదు. ప్రస్తుతం ఆర్థిక పరంగా ఇబ్బందుల్లో ఉండి పిల్లలను సరిగ్గా చదివించే స్థోమత లేని వారెందరో ఉన్నారు. అలాంటి కుటుంబాల్లోని యువకులకు బడాబడా స్మగ్లర్లు ఎక్కువ మొత్తంలో కూలీ ఆశ చూపి వీరిని అడవుల్లోకి పంపుతున్నారు. -
స్మగ్లర్ల ఆటకట్టించేదెవరు?
సమన్వయంతో అక్రమ రవాణాను నియంత్రించండి.. విలువైన ఎర్రచందనం తరలిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత పోలీసులు, అటవీశాఖపై ఉంది.. లోతైన దర్యాప్తు చేసి మూలాలను వెలికి తీయండి.. ఇవి అప్పుడప్పుడూ సమావేశాలు ఏర్పాటు చేసి ఉన్నతాధికారులు జిల్లా, కింది స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేçస్తుంటారు. అయితే మరోవైపు ఎర్రదొంగలు మరింత తెలివి మీరి సంబంధిత శాఖల అధికారుల కళ్లుగప్పి ఎర్రచందనాన్ని అక్రమ రవాణాను కొనసాగిస్తున్నారు. నెల్లూరు(బారకాసు): తక్కువ సమయంలో రూ.లక్షలు కొల్లగొట్టే ఆదా య వనరుగా మారిన ఎర్రచందనం స్మగ్లింగ్ నానాటికి పతాక స్థాయికి చేరుకుంటోంది. కొందరు అధికార పార్టీ నాయకులు కీలక పాత్ర పోషిస్తూ స్మగ్లర్ల అవతారం ఎత్తడంతో అక్రమ రవాణాకు అడ్డూఅదుపూ లేకుండా పో తోంది. అధికారుల్లోనూ కొందరి అండ లభిస్తుండటంతో ఈ అక్రమ వ్యాపారం మూడు చెట్లు ఆరు దుంగలుగా సాగిపోతోంది. ప్రభుత్వం అదనపు బలగాలను అడవు ల్లో మోహరించినా సిబ్బందికి ఆయుధాలిచ్చినా దుంగ ల దొంగతనానికి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. 1.90 లక్షల హెక్టార్లలో ఎర్రచందనం జిల్లాలోని మర్రిపాడు, అనంతసాగరం, ఆత్మకూరు, సీతారామపురం, వెంకటగిరి, రాపూరు, డక్కిలి, కలువాయి తదితర ప్రాంతాల్లోని అడవుల్లో దాదాపు 1.90 లక్షల హెక్టార్లలో ఎర్రచందనంచెట్లు విస్తరించి ఉన్నాయి. నాణ్యమైన ఈ చందనానికి విదేశాల్లో గిరాకీ ఉండడంతో స్మగ్లర్లు వీటిపై కన్నేశారు. అటవీశాఖలోని కొందరు ఇంటి దొంగల సహకారంతో అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు స్మగ్లర్ల అవతారం ఎత్తారు. చిత్తూరు, వైఎస్సార్‌కడప, నెల్లూరుజిల్లాలకు చెందిన పలువురు ఈ స్మగ్లింగ్ వ్యవహారంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. స్థానిక కూలీలతో పాటు తమిళనాడు నుంచి కూలీలను రప్పించి కోట్లాదిరూపాయల విలువైన ఎర్రచందనాన్ని చెన్నై, బెంగళూరుకు అక్కడి నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు. ఇంటిదొంగల అండతోనే.. ఎర్రచందనం స్మగ్లింగ్ రోజురోజుకూ పెరుగుతున్నా అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్న దాఖలాలు లేవు. ఆ శాఖలోని కొందరు అధికారులే స్మగ్లర్లతో కుమ్మక్కు కావడంతో నిజాయితీగా పనిచేసేవారున్నా అడ్డుకట్ట వేయలేకపోతున్నారనే ఆరోపణలున్నాయి. సివిల్ పోలీసుల పాత్ర స్మగ్లింగ్ వ్యవహారంలో అటవీ అధికారులు, సిబ్బందితో పాటు పోలీసుల పాత్రపైనా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్‌కు సహకరిస్తున్నారనే ఆరోపణలపై గతంలో వైఎస్సార్‌కడప జిల్లాలో ముగ్గురు సీఐలతో పాటు 21మంది పోలీసులు, ఫారెస్ట్ సిబ్బందిని సస్పెండ్ చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే సివిల్ పోలీసులతో పాటు అటవీశాఖ ఉద్యోగులు కొందరు చర్యల నుంచి తప్పించుకుంటూ స్మగ్లింగ్‌లో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఉన్నతాధికారులు వీరిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్న దాఖలాలు లేవు. ఏదైనా ఘటన జరిగినప్పుడు ప్రకటనలతో హడావుడి చేసి అనంతరం మౌనం దాలుస్తున్నారనే విమర్శలున్నాయి. ప్రకటనలకే పరిమితం గతంలో చిత్తూరు జిల్లాలో అటవీశాఖ అధికారులపై స్మగ్లర్లు దాడులు చేసి హతమార్చిన నేపథ్యంలో అటవీ సిబ్బందికి ఆయుధాలిస్తామని అంతేకాకుండా అటవీశాఖలో కొరతగా ఉన్న సిబ్బంది సంఖ్యను పెచుతామని పలుమార్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆయుధాలు ఇప్పటి వరకు ఇవ్వక పోగా సిబ్బంది నియామకం కూడా చేపట్టలేదు. అడ్డుకునేందుకు ప్రత్యేక చర్యలు జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా జరగకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. అక్రమంగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న సమాచారం తెలిస్తే వెంటనే తనిఖీలు నిర్వహించి పట్టుకుంటున్నాం. జిల్లా సరిహద్దులో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేశాం. ఎంతటి వారైనా ఆటవీ సంపదను అక్రమంగా కొల్లగొడితే ఉపేక్షించేది లేదు. –చంద్రశేఖర్, ఇన్చార్జి డీఎఫ్ఓ -
ఎర్రచందనం స్మగ్లింగ్‌లో అధికారుల హస్తం
-
‘ఎర్ర’ క్వీన్‌కి అరెస్టు వారెంట్
చిత్తూరు(అర్బన్): మాజీఎయిర్ హోస్టెస్, ఎర్రచందనం స్మగ్లింగ్ క్వీన్ సంగీత చటర్జీకి చిత్తూరు న్యాయస్థానం అరెస్టు వారెంటు జారీ చేసింది. అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ లక్ష్మణ్ రెండో భార్య అయిన సంగీతపై చిత్తూరు డివిజన్లోని మూడు స్టేషన్లలో ఎర్రచందనం కేసులు ఉన్నాయి. లక్ష్మణ్ అరెస్టు తరువాత ఈమె ఎర్రచందనం ఎగుమతి, స్మగ్లర్లకు భారీ ఎత్తున నగదు సమకూర్చడం తెలిసిందే. కోల్‌కతాలో ఈమెను అరెస్టు చేసిన చిత్తూరు పోలీసులు, అక్కడున్న న్యాయస్థానంలో హాజరు పరచి రిమాండు చేశారు. తదుపరి బెయిల్‌పై వచ్చిన ఆమె, కేసు విచారణకు చిత్తూరు కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతోంది. ఈ నేపథ్యంలో నాలుగు నెలల క్రితం సంగీతపై చిత్తూరు న్యాయస్థానం నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీనిపై కోల్‌కతా పోలీసులు స్పందించలేదు. తాజాగా మరో అరెస్టు వారెంటును జారీ చేస్తూ, జనవరి 10లోపు ఆమెను చిత్తూరు కోర్టులో హాజరుపరచాలని కోల్‌కతా పోలీస్ కమిషనర్‌ను ఆదేశించింది. -
‘ఉద్దేశపూర్వకంగానే టాస్క్‌ఫోర్స్ నిర్వీర్యం’
హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకంగానే ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధానికి వేసిన స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌ను నిర్వీర్యం చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. ఆయన శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఎర్రచందనం కాపాడతామని, దాని వేలం ద్వారా వచ్చే డబ్బుతో రుణమాఫీ చేస్తామని చెప్పారని చెప్పారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పటిదాకా ఎర్రచందనం ద్వారా కేవలం రూ.800కోట్లు మాత్రమే ఎందుకు వచ్చాయని, 10వేల 500 టనన్నుల ఎర్రచందనం నిల్వలను ఎందుకు వేలం వేయలేదని భూమన సూటిగా ప్రశ్నించారు. స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌ను ఎందుకు నీరుగార్చుతున్నారని భూమన ధ్వజమెత్తారు. ఎర్రచందనం స్మగ్లర్లకు, టీడీపీ నేతలకు ఉన్న బంధం విడదీయరానిదని, లక్షల కోట్ల ఎర్రచందనం దోచుకుంటుంటే చంద్రబాబు చేతులు ముడుచుకుని చూస్తున్నారని అన్నారు. ప్రకృతి సంపదను దోచుకునే అధికారం మీకెక్కడిదంటూ ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకువచ్చి వెంటనే చట్టాన్ని సవరించాలని డిమాండ్ చేశారు. -
’ఉద్దేశపూర్వకంగానే టాస్క్‌ఫోర్స్ నిర్వీర్యం’
-
ఎన్నాళ్లీ ఫోర్స్?
తిరుపతి ఏపీ టాస్క్ఫోర్సులో సిబ్బంది కొరత ఉండాల్సింది 463.. ఉన్నది మాత్రం 247 మందే కత్తిమీద సాములా మారిన కమెండో ఆపరేషన్లు పని ఒత్తిడితో సతమతమవుతున్న ఉద్యోగులు ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ప్రభుత్వం తిరుపతి కేంద్రంగా ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ టాస్క్ఫోర్సు విభాగం సిబ్బంది కొరతతో సతమతమవుతోంది. ప్రస్తుతం ఉన్న ఎస్ఐలు, కానిస్టేబుళ్లపై పనిభారం పెరిగింది. విశ్రాంతి లేని విధులతో ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. అన్ని కేడర్లలోనూ ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామని ఎప్పటికప్పుడు చెబుతున్న సర్కారు రెండేళ్లుగా ఉదాసీనత కనబరుస్తోంది. దీంతో ఉన్న ఉద్యోగుల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. తిరుపతి: పని ఒత్తిడితో టాస్క్ ఫోర్స్ విభాగం సతమతమవుతోంది. విధుల నిర్వహణ కత్తిమీద సాములా మారింది. చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అరుదుగా ఉన్న ఎరచ్రందనం వంటి విలువైన వృక్ష సంపదను పరిరక్షించడంతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి శేషాచలంలో చొరబడే స్మగ్లింగ్ ముఠాలను అరికట్టేందుకు ప్రభుత్వం 2014లో రెడ్ శాండల్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ఫోర్సు (ఆర్ఎస్ఏ ఎస్టీఎఫ్) విభాగాన్ని నెలకొల్పింది. తిరుపతి కేంద్రంగా ఇది పనిచేస్తుంది. మొదట్లో మొత్తం 463 మంది కానిస్టేబుళ్లు, ఎస్ఐలు, సీఐలు, డీఎస్పీలను ప్రభుత్వం టాస్క్ఫోర్సుకు కేటారుుంచింది. అరుుతే రెండు దశల్లో కేవలం 247 మందిని మాత్రమే కేటారుుంచింది. ఇందులో డీఐజీ, డీఎస్పీలు, సీఐలు, ఎస్సై, కానిస్టేబుళ్లు ఉన్నారు. రెండేళ్లుగా వీరు విధులు నిర్వర్తిస్తున్నారు. అరుుతే 5 లక్షల హెక్టార్ల పరిధిలో విస్తరించి ఉన్న శేషాచలంలో నిత్యం కాపలా కాయడం, స్మగ్లర్లను అరికట్టడం ఉన్న కొద్దిమంది ఉద్యోగులతో సాధ్యం కావడం లేదు. ఒక్కో కానిస్టేబుల్ రోజూ కిలోమీటర్ల కొద్దీ అడవిలో తిరగాల్సి వస్తోంది. ఒక్కోసారి ఎర్ర కూలీలు పట్టుబడినపుడు వారి వద్ద ఉన్న దుంగలను సైతం అడవి నుంచి వీరే బయటకు తీసుకెళ్లాల్సి వస్తోంది. కొంతమంది కమెండో ఆపరేషన్లలో ఉన్నపుడు అడవుల్లో సిబ్బంది సరిపోవడం లేదు. అంతేకాకుండా టాస్క్ఫోర్సుకే కేసులు నమోదు చేసే బాధ్యతలను కూడా అప్పగించారు. ఈ నేపథ్యంలో కే సులు నమోదు చేయడం, నేరస్తులను కోర్టులకు తీసుకెళ్లడం వంటి పనులు కూడా పెరిగారుు. ఎరచ్రందనం దుంగలను స్మగ్లర్లు ఎక్కడెక్కడ విక్రరుుంచారో, లేక గోదాముల్లో దాచారో గుర్తించాల్సిన బాధ్యత కూడా వీరిపైనే ఉంది. ఒకవేళ దేశవిదేశాల్లో ఎక్కడ సరుకున్నా రికవరీ చేయాల్సిన బాధ్యత కూడా వీరిదే. అధికారాలు, బాధ్యతలు పెరిగినప్పటికీ సరిపడ ఉద్యోగులను కేటారుుంచకపోవడం టాస్క్ఫోర్సుకు ఇబ్బందికరంగా మారింది. సేకరించిన గణాంకాల ప్రకారం.. ఏపీ టాస్క్ఫోర్సు విభాగంలో ఒక ఎస్పీ, ముగ్గురు ఏసీఎఫ్‌లు, ఒక సీఐ, సివిల్ ఎస్సైలు 3, ఎఫ్‌బీవోలు 4, సివిల్ పీసీలు 20, ఏఆర్ పీసీలు 66, ఏపీఎస్పీ పీసీలు 65, ఎస్పీవోస్ 80, హెడ్గార్డ్స 50, అవుట్సోర్సింగ్ పోస్టులు 24 ఖాళీగా ఉన్నారుు. వీటన్నింటిని భర్తీ చేస్తే స్మగ్లింగ్‌ను అరికట్టడం తేలికవుతుందని అధికారవర్గాలు చెబుతున్నారుు. పని ఒత్తిడితోనే రోగాలు.. పెరిగిన పని ఒత్తిడి రోగాలకు దారితీస్తోందని టాస్క్‌ఫోర్స్ ఉద్యోగ వర్గాలు అభిప్రాయపడుతున్నారుు. అడవుల్లో ఎక్కువ రోజులు ఉండటం వల్ల వివిధ రకాల రోగాలు సంక్రమిస్తున్నాయనీ, సిబ్బంది ఎక్కువమంది ఉంటే రొటేషన్ పద్ధతి ప్రకారం విధుల నిర్వహణ ఉంటుందని కానిస్టేబుళ్లు చెబుతున్నారు. ఇటీవల హార్ట్ ఎటాక్‌తో మరణించిన హన్మంతు అనే కానిస్టేబుల్ కూడా పనిఒత్తిడి కారణంగానే గుండెనొప్పికి గురై మరణించినట్లు ఉద్యోగులు చెబుతున్నారు. ఉన్న పరిస్థితులను అర్థం చేసుకుని ప్రభుత్వం ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. -
మా బంధువులను అరెస్ట్ చేశారు: సినీ నటి
హైదరాబాద్ : ఎర్రచందనం స్మగ్లింగ్‌లో సంబంధం లేకున్నా తమ ముగ్గురు బంధువులను అరెస్ట్ చేశారని సినీ నటి నీతూ అగర్వాల్ ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్‌లో నీతూ అగర్వాల్ విలేకర్లతో మాట్లాడుతూ.. కడప, ప్రొద్దుటూరు పోలీసులు తనపట్ల అనుసరిస్తున్న వ్యవహారశైలిపై ఆమె మండిపడ్డారు. సదురు పోలీసులుపై ఆమె ఆరోపణలు గుప్పించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో నిందితురాలు అయిన సినీ నటి నీతూ అగర్వాల్.. బెయిల్‌పై బయట ఉన్నారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్ బీరంగూడలోని బంధువుల ఇంట్లో నీతూ అగర్వాల్ ఉంటున్నారు. -
ఎర్రచందనం కేసులో చైనా స్మగ్లర్ అరెస్టు
చిత్తూరు (అర్బన్): ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో చైనాకు చెందిన లిన్‌డాంగ్ ఫూ (39) అనే వ్యక్తిని చిత్తూరు పోలీసులు శుక్రవారం రాత్రి బెంగళూరులో అరెస్టుచేశారు. చిత్తూరు ఎస్పీ శ్రీనివాస్ శనివారం ఈ వివరాలు వెల్లడించారు. చైనాలోని ఫుజియన్ రాష్ట్రానికి చెందిన లిన్డాంగ్ఫూ మూడేళ్ల నుంచి చైనా, ఇండియా మధ్య తిరుగుతూ ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నాడు. ముందస్తు సమాచారంతో చిత్తూరు పోలీసులు బెంగళూరులో దాడులు నిర్వహించిన శుక్రవారం రాత్రి ఫూను అరెస్టు చేశారు. నిందితుడి నుంచి ఏడు దేశాలకు చెందిన 52 కరెన్సీ నోట్లు, రూ.10వేల విలువగల చైనా యన్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా దుబాయ్‌కి చెందిన సాహుల్‌భాయ్, హాంకాంగ్‌కు చెందిన సలీం అనే ఇద్దరు స్మగ్లర్లకు ఫూ ఆరు కంటైనర్లలో ఎర్రచందనం దుంగలు పంపినట్లు పోలీసులు గుర్తించారు. ఇతనితోపాటు చిత్తూరు జిల్లా ఎర్రావారిపాళెంకు చెందిన ప్రసాద్‌నాయక్ (28) అనే మధ్యవర్తిని కూడా పోలీసులు అరెస్టుచేశారు. -
నలుగురు ఎర్ర స్మగ్లర్లు అరెస్ట్
11 దుంగల స్వాధీనం ఉదయగిరి : ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న నలుగురు స్మగ్లర్లను అరెస్ట్ చేసి, తరలించేందుకు సిద్ధంగా 11 దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి టాస్క్‌ఫోర్స్ డీఎస్పీ జి.హరినాథ్‌బాబు తెలిపారు. ఆయన ఉదయగిరి అటవీ రేంజ్ కార్యాలయం లో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ నాలుగు రోజుల క్రితం తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లాకు చెందిన 30 మంది ఎర్రచందనం స్మగ్లర్లు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ లారీలో నెల్లూరు నుంచి వైఎస్సార్ జిల్లా బద్వేల్ మండలం ద్వారా వెలుగొండ అడవుల్లోకి ప్రవేశించారన్నారు. సీతారామపురం మండలంలో దేవమ్మ చెరువు బీట్ పరిధిలో దున్నపోతుల గుండం, కణితిల సిరి ప్రాంతాల్లో చొరపడ్డారని సమాచారం అందిందన్నారు. దీంతో తిరుపతి టాస్క్‌ఫోర్స్, పోలీస్, అటవీ శాఖ సిబ్బంది సిబ్బంది సంయుక్తంగా కూంబింగ్ నిర్వహించామన్నారు. తరలించేందుకు సిద్ధంగా ఉన్న 11 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకోవడంతో పాటు స్మగ్లర్లు సెల్వకుమార్, ఎలుమలై, సత్యరాజు, కుమార్‌ను అరెస్ట్ చేశామన్నారు. ఉదయగిరి రేంజ్ అధికారి వెంకటేశ్వరరావు, సీఐ శ్రీనివాసరావు, టాస్క్‌ఫోర్స్ రేంజ్ అధికారి వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు. -
హెరిటేజ్ మాటున ఎర్రచందనం రవాణా!
పాల వ్యాన్‌ను సీజ్ చేసిన పోలీసులు తిరుపతి రూరల్: ఎర్రచందనం తరలించేందుకు అనువుగా ఏర్పాటుచేసిన అరలతో కూడిన పాలవ్యాన్‌ను పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. దీనిపై సీఎం కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫ్యాక్టరీ లోగో ఉండటం చర్చనీయాంశంగా మారింది. తిరుపతికి సమీపంలోని పూతలపట్టు-నాయుడుపేట హైవేపై ఎంఆర్ పల్లి పోలీసులు సోమవారం తనిఖీ చేస్తుండగా హెరిటేజ్ లోగో ఉన్న పాల వ్యాను నడుపుతున్న వ్యక్తులు పోలీసుల్ని చూిసి వాహనాన్ని వదిలి పారిపోయారు. అందులో ఎర్రచందనం దుంగలను తరలించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక అరలున్నాయి. దీంతో వ్యానును ఎం.ఆర్.పల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. స్వాధీనం చేసుకున్న వ్యాన్‌పై ఎపీ 03టీ 4959 అని నంబర్ ఉంది. ఇంజన్ నంబర్‌తో ట్యాలీ చేయగా వ్యాన్ నంబర్ దొంగదని తేలింది. ఈ వ్యాన్ చిత్తూరు వ్యక్తిదిగా గుర్తించారు. సమగ్ర విచారణ కోసం ఎస్ఐ ఇమ్రాన్ బాషా ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని నియమించారు. ఏర్పాట్లను చూస్తేపాలవ్యానులో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నట్లు అనుమానంగా ఉందని ఎం.ఆర్.పల్లి సీఐ తమ్మిశెట్టి మధు తెలిపారు. కాగా పోలీసులు స్వాధీనం చేసుకున్న పాలవ్యాన్‌కు హెరిటేజ్ కంపెనీతో సంబంధం లేదని కాశిపెంట్ల హెరిటేజ్ ఫుడ్స్ డీజీఎం వంశీధర్‌రెడ్డి ఖండించారు. -
‘ఎర్ర’ స్మగ్లర్ల ఏరివేత!
సాక్షి, కడప : ‘ఎర్ర’ స్మగ్లర్ల వరుస అరెస్టులు జిల్లాలో కలకలం రేపుతున్నాయి. రెండు నెలల వ్యవధిలో అంతర్జాతీయ స్మగ్లర్లు బొడ్డె వెంకట రమణ, మణి అణ్ణన్, బదాని, ప్రేమ్తార్, కిన్వున్ఫ్యాన్లతోపాటు తాజాగా శనివారం జంగాల శివశంకర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పెండ్లిమర్రి మండలం తిప్పిరెడ్డిపల్లె క్రాస్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా శనివారం ఉదయం వాహనంతో పోలీసులను ఢీకొట్టేలా వచ్చి పారిపోయేందుకు ప్రయత్నిం చిన అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ జంగాల శివశంకర్‌తోపాటు మరో ఏడుగురు అంతర్ రాష్ట్ర స్మగ్లర్లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్‌గులాఠీ వెల్లడించారు. శుక్రవారం తన అనుచరులతో కలిసి వాహనాలలో కడపకు వచ్చిన శివశంకర్.. శేషాచలం అడవుల్లో సేకరించిన ఎర్రచందనం దుంగలను పొలతల అటవీ ప్రాం తంలో ఓపెల్ అస్ట్రా, టాటా ఇండికా కార్లలో లోడ్ చేసుకున్నారని తెలి పారు. బెంగళూరు వరకు దారిలో ముందు పెలైట్‌గా కొందరు వెళుతుండగా మిగిలిన వారు వెనుక వాహనాల్లో వచ్చేటట్లు ప్రణాళిక రూపొం దించినట్లు ఎస్పీ వివరించారు. జం గాల శివశంకర్, మరో ఇద్దరు కార్లలో బయలుదేరి పొలతల అటవీ ప్రాంతం నుంచి బెంగళూరు వెళ్లేందుకు వస్తుం డగా తిప్పిరెడ్డిపల్లె క్రాస్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా పట్టుబడినట్లు తెలిపారు. వారి సమాచారం మేరకు పొలతల రిజర్వు ఫారెస్టులోని నీరుకోన శివాలయం వద్ద దుంగలను లోడు చేసుకుని కార్లలో, లారీల్లో బయలు దేరేందుకు సిద్ధంగా ఉన్న మిగిలిన నిందితులను పట్టుకున్నామని ఆయన పేర్కొన్నారు. జంగాల శివశంకర్ ఒంటిమిట్ట మండలం గాండ్లపల్లె గ్రామానికి చెందిన వాడని, తిరుపతిలో ఉంటూ వ్యవహారాలు చక్కబెట్టేవాడన్నారు. అతని అనుచరులు కర్ణాటక రాష్ర్టం హోస్పేట తాలూకాలోని శంకనిపురానికి చెందిన సయ్యద్ ఆసిఫ్ అలీ, చిత్తూరు జిల్లా బాసినకొండ గ్రామానికి చెందిన బి.సురేంద్రనాయక్, అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన సుధాకర్‌రెడ్డి, కర్ణాటకకు చెందిన సయ్యద్ ఆరీఫ్, వైఎస్సార్ జిల్లా మిట్టపల్లెకు చెందిన డి.రవిశంకర్, నందలూరు మండలం చింతకుంటకు చెందిన పులి కృష్ణయ్య, వల్లూరు మండలం పుష్పగిరికి చెందిన డి.శ్రీను తదితరులను కూడా అరెస్టు చేశామన్నారు. వారి వద్ద నుంచి రూ.8 కోట్ల విలువైన 42 టన్నుల (190) దుంగలు స్వాధీనం చేసుకున్నామన్నారు. శివశంకర్ పీడీ యాక్టు కింద రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉండి 2014లో విడుదలయ్యాడని వివరించారు. బొడ్డె వెంకటరమణ ద్వారా సమాచారం మే నెల మొదటి వారంలో అంతర్రాష్ట్ర స్మగ్లర్ బొడ్డె వెంకట రమణను అరెస్టు చేసిన తర్వాత విచారణలో జంగాల శివశంకర్ గురించి తెలిసిందని ఎస్పీ వివరించారు. శివశంకర్ ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌తోపాటు మరికొన్ని ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన అంతర్జాతీయ స్మగ్లర్లతో సంబంధాలు పెట్టుకుని యథేచ్ఛగా ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా సాగించాడన్నారు. ఇతనికి సయ్యద్ ఆసిఫ్ అలీ, సురేంద్రనాయక్, సయ్యద్ ఆరీఫ్‌లు ప్రధాన అనుచరులు కాగా.. ఆసిఫ్ అలీ కర్ణాటక రాష్ట్రం శంకనిపురం గ్రామ సర్పంచ్‌గా 2002లో పనిచేశాడని, 2014లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మరోమారు సర్పంచ్‌గా పోటీ చేసి ఓడిపోయాడన్నారు. ఇతనికి కర్ణాటక రాష్ట్రంలోని కటిగనహళ్లి, బెంగళూరులో ఉన్న కొందరు అంతర్జాతీయ స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నట్లు తెలిసిందన్నారు. డి.రవిశంకర్ అనుచరులైన పులి కృష్ణయ్య, శ్రీనివాసులు ద్వారా జిల్లాలోని అడవుల్లో కూలీలతో ఎర్రచందనం చెట్లను నరికించి దుంగలుగా చేసి రవిశంకర్ స్నేహితుడైన తాడిపత్రికి చెందిన సుధాకర్‌రెడ్డి ద్వారా జంగాల శివశంకర్ కర్ణాటకకు చెందిన ఆసిఫ్ అలీ, సయ్యద్ ఆరీఫ్‌లకు అమ్మేవాడన్నారు. కూరగాయల వాహనాల్లో దుంగలను తరలించేవారన్నారు. టాస్క్‌ఫోర్స్ సిబ్బందికి అభినందనలు ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టేందుకు ఏర్పడిన టాస్క్‌ఫోర్స్ ప్రత్యేక బృందాన్ని ఎస్పీ డాక్టర్ నవీన్ గులాఠీ అభినందించారు. ప్రత్యేకంగా రివార్డులను కూడా ఇవ్వనున్నట్లు తెలియజేశారు. స్మగ్లర్లను అరెస్టు చేయడంలో కీలకపాత్ర పోషించిన ఓఎస్డీ రాహుల్‌దేవ్‌శర్మ ఆధ్వర్యంలోని బృందం సభ్యులు ఎస్బీ డీఎస్పీ ఎం రాజగోపాల్‌రెడ్డి, ఫ్యాక్షన్ జోన్ డీఎస్పీ బి.శ్రీనివాపులు, ఇన్స్పెక్టర్లు రాజేంద్రప్రసాద్, బి.వెంకట శివారెడ్డి, మైదుకూరు అర్బన్ సీఐ వెంకటేశ్వర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు హేమకుమార్, రోషన్, శివశంకర్, ఎస్.మహబూబ్‌బాష, రాజేశ్వరరెడ్డి, పెద్ద ఓబన్న, ఆర్వీ కొండారెడ్డి, నాగరాజు, సురేష్‌రెడ్డి, రామచంద్ర, ఇతర సిబ్బందిని ఎస్పీ అభినందించారు. విలేకరుల సమావేశంలో ఎస్పీతోపాటు ఓఎస్డీ రాహుల్‌దేవ్‌శర్మ, పులివెందుల ఏఎస్పీ అన్బురాజన్ పాల్గొన్నారు. -
పచ్చ స్మగ్లర్ల పరార్
సాక్షి, కడప : ఎర్రచందనం అక్రమ రవాణాపై పోలీసు యంత్రాగం కొరడా ఝళిపిస్తోంది. అక్రమ రవాణాకు పాల్పడిన, స్మగ్లర్లకు సహకరించిన వారెవరైనా సరే చర్యలు తప్పవనే సంకేతాలు స్పష్టం కావడంతో పలువురు స్మగ్లర్లు జిల్లా వదిలివెళ్లినట్లు సమాచారం. జిల్లా ఎస్పీ నవీన్ గులాఠీ నేతృత్వంలో ఓ వైపు టాస్క్‌ఫోర్స్, మరో వైపు ఇటీవలే బాధ్యతలు చేపట్టిన ఓఎస్డీ రాహుల్‌దేవ్ శర్మ వ్యూహాత్మకంగా దూసుకు పోతుండటంతో స్మగ్లర్లలో వణుకు ఆరంభమైంది. ఇటీవలి కాలంలో చైనా, ఢిల్లీ, హర్యానాకు చెందిన స్మగ్లర్ల అరెస్టుతో అధికార పార్టీకి చెందిన స్మగ్లర్లను భయం వెంటాడుతోంది. ఇక నుంచి మరింత దూకుడు ఎర్రచందనం స్మగ్లర్లపై పోలీసులు మరింత దూకుడు పెంచనున్నారు. ఓఎస్డి రాహుల్ దేవ్ శర్మ ప్రస్తుత దృష్టి ఎర్రచందనం అక్రమ రవాణాపై మాత్రమే ఉండటంతో ఎర్ర స్మగ్లర్లనందరినీ అణిచివేయడానికి ప్రత్యేక వ్యూహం రూపొందించుకున్నారు. అడవిలో ఓ వైపు కూంబింగ్ కొనసాగిస్తూనే, రహదారుల్లో ముఖ్యమైన చోట్ల తనిఖీలు ముమ్మరం చేశారు. అడవిలో కూలీలు, స్మగ్లర్లను ఎదుర్కోనే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పోలీసులకు వివరిస్తున్నారు. అటవీ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఇన్ఫార్మర్ వ్యవస్థను పటిష్టం చేస్తున్నారు. తద్వారా ఎర్ర స్మగ్లర్లను సులువుగా పట్టుకోడానికి మార్గం సుగమం చేసుకుంటున్నారు. అండర్ గ్రౌండుకు స్మగ్లర్లు ప్రస్తుత పరిణామాల రీత్యా ‘ఎర్ర’ వ్యవహారంతో సంబంధం ఉన్న ‘పచ్చ’ నేతలు పలువురు అండర్ గ్రౌండుకు వెళ్లినట్లు సమాచారం. ఒక్కొక్కరే ఇతర ప్రాంతాలకు వెళ్లి తలదాచుకుంటున్నారు. సుండుపల్లికి చెందిన ఓ టీడీపీ నాయకుడు రెండు నెలలుగా కనిపించడం లేదని పలువురు చర్చించుకుంటున్నారు. ఆ పచ్చ స్మగ్లర్‌పై చిత్తూరు జిల్లాలో ఏడెనిమిది కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత తరుణంలో ఈ ప్రాంతంలో ఉండటం అంత మంచిది కాదని కొందరు అధికార పార్టీ నేతలు సలహా ఇవ్వడంతో చెన్నైకి అని చెప్పి కర్ణాటకకు వెళ్లినట్లు సమాచారం. సిద్దవటం ప్రాంతానికి చెందిన మరో పచ్చ నేత కూడా అండర్ గ్రౌండుకు వెళ్లినట్లు తెలిసింది. సేలం స్మగ్లర్ల కోసం వేట తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన కొంత మంది ఎర్రచందనం అక్రమ రవాణాలో తలదూర్చినట్లు పోలీసుల వద్ద పక్కా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో వారి కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. పాత స్మగ్లర్ల కదలికలపై కూడా నిఘా ముమ్మరం చేశారు. బయటి ప్రాంతాల్లో ఎర్ర చందనం కొంటున్న బడా స్మగ్లర్ల భరతం పడితే స్థానికంగా పరిస్థితి అదుపులోకి వస్తుందని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆ దిశగా బయటి ప్రాంతాల్లోని స్మగ్లర్లపై కూడా దృష్టి సారించారు. -
డోంట్ వర్రీ.. మై హూనా ..!
జోరుగా ఎర్రచందనం అక్రమ రవాణా అధికార పార్టీ నేతలకు అభయమిస్తున్న డివిజన్ పోలీస్ బాస్ బెయిల్‌పై బయటకు వచ్చిన డాన్లు బదానీ విచారణలో పలు ముఖ్య నేతల పేర్లు మైదుకూరు టౌన్ : ‘ఎర్ర’దొంగలపై ఖాకీలు కన్నెర్ర చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణను అడ్డుకునేందుకు నడుంబిగించారు. స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న వారి జాబితాను సిద్ధం చేసి అరెస్టు చేసేందుకు ప్రణాళిక రచించారు. ఇప్పటికే కొందరిని అరెస్టు చేయగా, మిగతా వారిని అదుపులోకి తీసుకుందుకు పక్కా ప్రణాళికతో వెళుతున్నారు. అయితే దొంగల జాబితాలో టీడీపీ నేతలు అధికంగా ఉండటంతో.. పోలీసులపై అధికార పార్టీ నేతల నుంచి ఒత్తిళ్లు అధికమయ్యాయి. డాన్ తన పాత పేరు నిలుపుకునే యత్నం: ప్రపంచలో ఎక్కడా లేని అత్యంత అరుదైన, విలువైన ఎర్రచందనం వనాలు శేషాచలం, నల్లమల అటవీ ప్రాంతంలో వేలాది హెక్టార్లలో విస్తరించి ఉన్నాయి. కొన్నేళ్లుగా ‘అడవి దొంగలు’ ఈ వృక్షాలను తెగనరికి విదేశాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే పలు ఎర్రచందనం కేసుల్లో స్మగ్లింగ్‌కు పా ల్పడి డాన్ పేరు తెచ్చుకొని పీడీ యాక్ట్ నమోదైన వ్యక్తి ఇప్పుడు మళ్లీ తన పాత పేరును నిలుపుకునేందుకు అధికార పార్టీ నాయకులతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. అలాగే జాండ్లవరం సమీపంలో ఓ సామాజిక వర్గానికి చెందిన నాయకుడి నుంచి కొన్ని రోజుల క్రితం ఫారెస్ట్ అధికారులు రెడ్‌హ్యాండ్‌గా ఎర్రచందనం దుంగలను, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే అతనిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకొన లేదు. వాహనాన్ని కూడా తిరిగి ఇచ్చేశారు. ఎక్కువ శాతం టీడీపీ వర్గీయులే: బద్వేలు పట్టణంలోని ఓ ప్రముఖ స్మగ్లర్ ఇప్పటికే అధికార పార్టీ నాయకుడిని కలసి తన కార్యకలాపాలను యథేచ్ఛగా నడుపుతున్నాడు. మైదుకూరు మండలంలో ఎర్రచందనం కేసులో పట్టుబడ్డ వారు ఎక్కువ శాతం టీడీపీ వర్గీయులే. బద్వేలు పోలీస్‌స్టేషన్‌లో ఇంటర్నేషనల్ డాన్ ముఖేష్బదానీని అరెస్ట్ చేసి, అతని వద్ద సమాచారం రాబట్టారు. ఇందులో టీడీపీ కీలక నాయకుల పేర్లు బయటకు వినిపిస్తున్నాయి. మైదుకూరు సబ్‌డివిజన్ పరిధిలోని పోరుమామిళ్ల, జాండ్లవరం, నాగసానుపల్లెకు చెందిన బడా స్మగ్లర్ల పేర్లు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో ఈ గ్రామాల్లోని వారు అధికార పార్టీ నాయకుల వద్దకు వెళ్లి తమకు మీరే దిక్కు సార్.. అరెస్టులు కాకుండా అడ్డుకోవాలని కోరినట్లు తెలుస్తోంది. పార్టీ కోసం భారీగా డబ్బులు ఖర్చు చేశామని, తాము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకోవాలని విన్నవించారు. దీంతో ఆయన సంబంధిత డివిజన్ బాస్‌ను కోరగా సరే అన్నట్లు సమాచారం. ‘డోంట్ వర్రీ..మై హూనా.. అరెస్టులు ఇక వేగంగా ఉండవు అన్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. రాత్రి వేళ్లలో జోరుగా రవాణా: ప్రభుత్వాలు ఎన్ని ఆంక్షలు పెడితే మాకేమి అభయమిచ్చిన నాయకుల అనుమతిస్తే చాలు ఇక ఎర్రచందనం ఎక్కడికైనా అట్లే పంపించవచ్చు అన్నట్లు ఆ బడా స్మగ్లర్లు రాత్రి సమయంలో విచ్చలవిడిగా తరలిస్తున్నారని సమాచారం. అసలైన స్మగ్లర్లను శిక్షించి విలువైన ఎర్రచందనం కాపాడాల్సిన బాధ్యత జిల్లా పోలీస్ బాస్‌పై వుంది. ఆయన ఎంత వరకు దృష్టి సారిస్తారో వేచి చూడాలి. -
‘ఎర్ర’ స్మగ్లర్లకు రిమాండ్
- మదనపల్లె కోర్టుకు చైనా దేశీయుడు చెన్యీ ఫియాన్ - చిత్తూరు కోర్టుకు చెన్నైకి చెందిన సెల్వరాజ్ మదనపల్లె రూరల్/పూతలపట్టు : ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో నిందితులుగా ఉన్న చైనాకు చెందిన చెన్యీ ఫియాన్‌ను, చెన్నైకి చెందిన ఆర్.సెల్వరాజ్‌ను బుధవారం చిత్తూరు జిల్లా పోలీసులు కోర్టు హాజరుపరిచారు. వారిని కోర్టురిమాండ్కు ఆదేశించింది. మే 28న మదనపల్లె నుంచి డాబా శ్రీను, హరిబాబు ఎర్రచందనం తరలిస్తుండగా పోలీసులు అరెస్టుచేసి విచారించగా చైనాకు చెందిన చైనాకు చెందిన చెన్యీ ఫియాన్, తమిళనాడుకు చెందిన ఆర్.సెల్వరాజ్ పేర్లు చెప్పాడరు. దీంతో గత శుక్రవారం ఢిల్లీలో చిత్తూరు పోలీసులు అరెస్టుచేశారు. పూతలపట్టు పోలీసులు బుధవారం చెన్నైలో ఆర్.సెల్వరాజ్‌ను అరెస్టుచేశారు. చెన్యీ ఫియాన్‌ను మదనపల్లె కోర్టులో హాజరు పరిచారు. సెల్వరాజ్‌ను చిత్తూరు కోర్టులో హాజరుపరిచారు. వారిద్దరికీ 14 రోజులు రిమాండ్ విధించారు. నేను దొంగను కాదు .. ‘‘సారీ.. ఐయామ్ నాట్ ఏ తీఫ్.. ఐయామ్ బిజినెస్ పర్సన్’’ అంటూ విలేకరుల ముందు చెన్యీఫియాన్ కన్నీటి పర్యంతమయ్యారు. తన భార్య ప్రోద్భలంతో అప్పుచేసి వ్యాపారం చేయడానికి ఢిల్లీకి వచ్చానన్నారు. తనను పోలీసులు అరెస్టు చేశారని, తన భార్య చుయాన్‌ఛుంగ్ ఆత్మహత్య చేసుకుంటుందని విలపించాడు. కాగా ఢిల్లీలో చెన్యై ఫియాన్‌ను అరెస్టు చేసినపుడు స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలు బుధవారం చిత్తూరుకు చేరుకున్నాయి. -
రూ.20.22 లక్షల ఎర్రచందనం పట్టివేత
సిద్దవటం : మండలంలోని భాకరాపేట-రామస్వామిపల్లె రైల్వేట్రాక్ దక్షిణం వైపున అక్రమంగా తరలిస్తున్న రూ.20.22 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను పట్టుకున్నట్లు ఒంటిమిట్ట సీఐ ఉలసయ్య తెలిపారు. సిద్దవటం పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఆయన నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతోందని సమాచారం రావడంతో సిద్దవటం ఎస్ఐ లింగప్ప, సిబ్బంది, తిరుపతికి చెందిన స్పెషల్ టాస్క్‌ఫోర్స్, భాకరాపేట చెక్‌పోస్టు అటవీ శాఖ అధికారులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. భాకరాపేట-రామస్వామిపల్లె రైల్వేట్రాక్ దక్షిణ వైపు నుంచి తుర్రా వెంకటసుబ్బయ్య ఏపీ04 డబ్ల్యూ 8528 నంబరు గల ట్రాక్టర్లో ఎర్రచందనం దుంగలను తరలిస్తుండగా తుర్రా ప్రతాప్, తుర్రా ప్రభాకర్ పల్సర్ ద్విచక్ర వాహనంలో ట్రాక్టర్‌కు ముందు వైపున పెలైట్‌గా వెళుతున్నారు. పోలీసులను చూసిన వెంటనే తుర్రా ప్రతాప్, ప్రభాకర్ ద్విచక్ర వాహనాన్ని పడేసి పరారు కాగా, ట్రాక్టర్‌ను నడుపుతున్న తుర్రా వెంకట సుబ్బయ్య, సుబ్బరాజు పరారయ్యారు. ట్రాక్టర్ ట్రాలీలో ఉన్న కూలీల మేస్త్రీ కొత్త మాధవరానికి చెందిన అలిశెట్టి వెంకట సుబ్బయ్య, అట్లూరు మండలం మాడపూరు గ్రామానికి చెందిన గాలిశెట్టి యల్లయ్య, మాధవరం-1కు చెందిన బొడిచెర్ల సుబ్రమణ్యం, నేకనాపురం పల్లె గోపయ్య, మాధవరం-1 అంబేద్కర్ నగర్ తిప్పన హరిబాబు, అలీనగర్ డేరింగుల వెంకటేశ్వరరావులను పోలీసులు శుక్రవారం సాయంత్రం అరెస్టు చేయగా, పరారీలో ఉన్న మరో కూలీ, మాధవరం-1కు చెందిన భాషాను శనివారం ఉదయం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. పట్టుబడిన 36 ఎర్రచందనం దుంగలు ఒక టన్ను 200 కిలోల బరువు ఉంటాయని, వీటి విలువ రూ. 20.22 లక్షలు కాగా, రూ. 4 లక్షలు విలువజేసే ట్రాక్టర్‌ను, రూ. 80 వేలు విలువజేసే పల్సర్ ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశామని సీఐ తెలిరు. తుర్రా వెంకట సుబ్బయ్య, ప్రతాప్, ప్రభాకర్, మిట్టపల్లెకు చెందిన చెంచయ్యనాయుడులను పట్టుకునేందుకు బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయని, వారికి సమాచారం ఇచ్చినా, ఎవరైనా సహకరించినా, వారితో తిరిగినా, వారిని ఆశ్రయించినా అటవీ చట్టం కింద కేసు నమోదు చేస్తామని, ప్రజలు ఈ విషయాన్ని గమనించి వారికి ఎలాంటి సహకారం అందించవద్దని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ లింగప్ప, ఏఎస్ఐ మల్లికార్జున, హెడ్ కానిస్టేబుల్ కురబత్, సిబ్బంది పాల్గొన్నారు. -
సినీ నటిపై దాడి
కర్నూలు: తనపై నాగరాజు అనే వ్యక్తి దాడి చేశాడని ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో నిందితురాలిగా ఉన్న సినీ నటి రీతూ అగర్వాల్ ఆరోపించింది. కర్నూలు జిల్లా రుద్రవరం పోలీసుస్టేషన్ లో సంతకం చేసి హైదరాబాద్ కు తిరిగి వెళుతుండగా సిరివెల్ల వద్ద తనపై దాడి చేశారని పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. కాగా, తనకు రావాల్సిన డబ్బుల కోసం ఏ1 ట్రావెల్ అధినేత నాగరాజు... రీతూ అగర్వాల్ కారు తాళాలు లాక్కున్నట్టు తెలుస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో బెయిల్ పై బయటికి వచ్చిన రీతూ అగర్వాల్ ప్రతి ఆదివారం రుద్రవరం పోలీసుస్టేషన్ కు వచ్చి సంతకం చేయాల్సివుంది. ఈ క్రమంలోనే దాడి జరిగినట్టు సమాచారం. ఎర్రచందనం స్మగ్లింగ్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని రీతూ అగర్వాల్ అంతకుముందు స్పష్టం చేసింది. అనవసరంగా తనను ఈ కేసులో ఇరికించారని ఆమె వాపోయింది. -
‘పచ్చ’ తమ్ముళ్లే ఎర్ర దొంగలు!
సీఎంతో ఎర్రచందనం స్మగ్లర్లకు ప్రత్యక్ష అనుబంధం సాక్షి హైదరాబాద్,నెట్వర్క్: ఎర్రచందనం స్మగ్లింగ్ పుట్ట తవ్వినకొద్దీ తెలుగుతమ్ముళ్ల పేర్లే బయటకు వస్తున్నాయి. టీడీపీ అధినేతతోపాటు కీలక నేతలతో ప్రత్యక్ష సంబంధాలున్న స్థానిక నేతలదే స్మగ్లింగులో కీలకభూమికని వెల్లడవుతోంది. తమపార్టీలోని బడా స్మగ్లర్లను రక్షించుకునేందుకే 20 మంది కూలీలను ఎన్కౌంటర్ చేయించారన్న విమర్శలూ వినవస్తున్నాయి. చిత్తూరు, వైఎస్సార్ జిల్లాలో పీడీ చట్టం కింద కేసులు నమోదైన వారిలో అత్యధికులు టీడీపీ నేతలు కావడమే ఇందుకు నిదర్శనం. గత ఎన్నికల్లో పలువురు ఎర్రస్మగ్లర్లకు టీడీపీ టిక్కెట్లు ఇవ్వడమే ప్రత్యక్షసాక్ష్యం. ఒకప్పుడు బతుకుదెరువుకోసం కువైట్ వెళ్లి వచ్చిన వారే పచ్చ గొడుగు నీడలో బడా స్మగ్లర్లుగా మారారు. రాష్ట్రంలోని తిరుపతి, హైదరాబాద్ లాంటి నగరాల్లోనే కాకుండా బెంగళూరు, చెన్నైల్లో సైతం భారీ భవంతులకు అధినేతలయ్యారు. వేలకోట్ల విలువైన ఎర్రచందనం కొల్లగొట్టి వందలకోట్లు పార్టీకి విరాళాలుగా ఇచ్చారు. పోలీసు, అటవీ అధికారులకు నోట్ల కట్టలు వెదజల్లారు... లొంగని వారిని బెదిరించారు. పచ్చజెండా అండతో మరికొందరు తెలుగు తముళ్లుకూడా శేషాచలం అడవుల బాట పడుతున్నారు. వారి నుంచి పార్టీ అధినేతకు భారీగా ముడుతోందనే ఆరోపణలు అధికార పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి. గురుశిష్యులతో అనుబంధం ఎర్రచందనం స్మగ్లింగ్‌తో సంబంధం ఉన్న టీడీపీ నాయకుల పేర్ల జాబితా కొండవీటి చాంతాడంతవుతుంది. ముందుగా చప్పిడి మహేష్‌నాయుడు, మద్దిపెట్ల రెడ్డినారాయణ అనే గురుశిష్యుల గురించి తెలుసుకుందాం. వైఎస్సార్ జిల్లా సుండుపల్లె, సంబేపల్లె మండలాల పరిధిలో ఆ ఇరువురి గ్రామాలున్నాయి. జీవనోపాధికోసం ఇద్దరూ కువైట్‌కు వెళ్లి వచ్చారు. ఆ తర్వాత పక్కనే ఉన్న శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ మొదలుపెట్టారు. 15 ఏళ్లుగా అదే ప్రధానవృత్తిగా జీవనం సాగిస్తున్నారని పోలీసు రికార్డులు తేటతెల్లం చేస్తున్నాయి. గ్రామీణులను అడవులకు పంపించి చందనం చెట్లు నరికించి చెన్నై పంపించడం ద్వారా స్మగ్లింగ్ మొదలుపెట్టిన వీరు ఇప్పుడు అంతర్జాతీయ స్మగ్లర్లుగా ఎదిగిపోయారు. వీరి వ్యవహారాలకు అడ్డు నిలిచిన అటవీ అధికారులపై అనేకసార్లు దాడులకు తెగబడ్డారు. ఆమేరకు సుండుపల్లె, సంబేపల్లె పోలీసుస్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి. వారే టీడీపీలో కీలక నేతలుగా ఎదిగారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా అసెంబ్లీలో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారనే కారణంగా వైఎస్సార్ జిల్లాకు చెందిన ఆకేపాటి అమర్నాథరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు ఎమ్మెల్యే పదవులు కోల్పోయిన సందర్భంగా జరిగిన ఉప ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ తరఫున ఈ గురుశిష్యులే ప్రధాన భూమిక పోషించారు. రాజంపేట అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా మహేష్‌నాయుడుకు చంద్రబాబు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. అతని పిలుపుతోప్రచారం నిమిత్తం సుండుపల్లెకు హెలికాప్టర్లో వెళ్లారు. ఆ సభలో మహేష్‌నాయుడును తన పక్కనే కూర్చోబెట్టుకొని పొగడ్తలతో ముంచెత్తారు. రాయచోటి నియోజకవర్గ పరిధిలో రెడ్డినారాయణ నిర్ణయాలకే బాబు ప్రాధాన్యం ఇచ్చారు. అప్పటికే ఓమారు పీడీ యాక్టు కింద అరెస్టయిన రెడ్డినారాయణకు సంబేపల్లె జెడ్పీటీసీ అభ్యర్థిగా బీఫారం ఇచ్చారు. ఆయనను ప్రజలు ఓడించారు. సుండుపల్లె మండలంలో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక మహేష్‌నాయుడు కనుసన్నల్లో సాగింది. స్మగ్లింగు సొమ్మును నీళ్లలా ఖర్చుచేసి ఆయన తల్లి శ్రీలతదేవికి జీ.రెడ్డివారిపల్లె ఎంపీటీసీగా గెలిపించుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ‘ఎర్రదండు’ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఎర్రచందనం స్మగ్లర్లనే టీడీపీ ప్రోత్సహించింది. సుండుపల్లె మండలం జీకే రాచపల్లెకు చెందిన పటాల రమణపై పలు కేసులున్నాయి. ఆయన సోదరుడు వీరమల్లనాయుడుకు టీడీపీ సుండుపల్లె జడ్పీటీసీ టికెట్ ఇచ్చింది. ఒంటిమిట్ట మండలం చింతరాజుపల్లె ఎంపీటీసీ సుబ్బానాయుడు, రాజంపేట మండలం బసినాయుడుగారిపల్లెకు చెందిన దేవానాయుడు, సాతుపల్లెకు చెందిన సత్యాల రామకృష్ణ మీద కూడా స్మగ్లింగ్ కేసులు ఉన్నాయి. మైదుకూరు మండలం జాండ్లవరానిక చెందిన టీడీపీ నేత శ్రీనివాసులనాయుడు ప్రస్తుతం పీడీ యాక్టు కింద రాజమండ్రి జైల్లో ఉన్నారు. బి.మఠం మండలంలో టీడీపీ కీలక నేత చెంచయ్యగారిపల్లెకు చెందిన సి.సుబ్బారెడ్డికీ ఈ స్మగ్లింగ్‌తో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. టీడీపీ మైదుకూరు ఇన్‌ఛార్జి పుట్టా సుధాకర్‌యాదవ్ అనుచరులు చినమల నరసింహులు యాదవ్, కటారి చిన్న వీరయ్యపైనా ఈ కేసులు ఉన్నాయి. కర్నూలు జిల్లాలో....: కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని కొందరు టీడీపీ నేతలకు కూడా ఈ స్మగ్లింగ్‌తో సంబంధాలున్నాయి. రుద్రవరం మండలం నాగులవరం గ్రామానికి చెందిన గంధం భాస్కరరెడ్డి 2014 ఎన్నికల ముందు టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆయనపై రుద్రవరం పోలీసు స్టేషన్లో రౌడీషీట్ కూడా ఉంది. తర్వాత ఎర్రచందనం అక్రమ రవాణా కేసు నమోదైంది. కొత్తపల్లి మాజీ సర్పంచ్ సావిత్రి భర్త రాఘవరెడ్డిపై కూడా ఎర్రచందనం అక్రమ రవాణా కేసు ఉంది. ఆయన టీడీపీ నేత గంగుల ప్రతాప్‌రెడ్డి ముఖ్య అనుచరుడు. పీడీ యాక్టులో అత్యధికులు టీడీపీ నేతలే వైఎస్సార్ జిల్లాలో ఇటీవల కాలంలో 16 మందిపై పీడీ యాక్టు కింద కేసులు నమోదుకాగా ఇందులో ఎనిమిది మంది టీడీపీ మద్దతుదారులే. జాండ్లవరం శ్రీనివాసులునాయుడు, ఒంటిమిట్ట మండలంలోని గాండ్లపల్లె జంగాల శివశంకర్, అదేమండలంలోని పట్రపల్లెకు చెందిన బొడ్డే శ్రీనివాసులు, కాశినాయన మండలానికి చెందిన ఎంబడి జయరాజు, సిద్దవటం మండలం తుర్రావెంకటసుబ్బయ్య, సంబేపల్లె మండలానికి చెందిన రెడ్డినారాయణ, సుండపల్లె మండలానికి చెందిన మహేష్‌నాయుడు, శివప్రసాద్‌నాయుడు అలియాస్ గుట్ట బాబు పీడీ యాక్టు కింద గతంలో అరెస్టయ్యారు. వీరంతా టీడీపీ మద్దతుదారులే. మిగిలిన వారిలో ఐదుగురికి ఏ రాజకీయ పక్షంతో సంబంధం లేదని అటవీ అధికారులు తెలిపారు. సీఎం సొంత జిల్లాలో.... సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో పలువురు టీడీపీ నేతలు ఎర్రచందనం స్మగ్లింగ్ ద్వారా భారీగా సంపాదించి విదేశాల్లో సైతం వ్యాపారాలు సాగిస్తున్నారు. టీడీపీ ప్రచార కార్యదర్శిగా పనిచేసిన చెరుకూరి వసంతకుమార్‌పై జిల్లాలో ఏడు ఎర్రచందనం కేసులు ఉన్నాయి. గతంలో పోలీసులు అరెస్టు చేసినా బెయిల్‌పై బయటకు వచ్చేశారు. ఆయనపై పీడీ యాక్టు కింద కేసు పెట్టినా సీఎం తనయుడు లోకేష్ స్వయంగా కల్పించుకోవడంతో అడ్వయిజరీ బోర్డు సమావేశం పెట్టకుండానే ప్రభుత్వం కేసు ఎత్తివేసింది. అందుకు ప్రతిఫలంగా గత ఏడాది జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పలువురు టీడీపీ అభ్యర్థులకు వసంతకుమార్ డబ్బు పంపిణీ చేశారు. యాదమరి మండలానికి చెందిన పాపిదేశి ఆనందనాయుడు, చుండ్లవంకకు చెందిన శ్రీశైలం ఆంజనేయులు, చిన్నగొట్టిగల్లు తుమ్మిచేనపల్లెకు చెందిన ఆవుల మోహనరెడ్డిలపై కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులు ఉన్నాయి. -
‘ఎర్ర’ బంగారం ఇలా... ‘హద్దు’ దాటుతోంది!
► జిల్లా నుంచి ట్రాన్స్పోర్టర్ల ద్వారా ఎగుమతి ► పోలీసుల ఎదుట నోరు విప్పిన స్మగ్లర్లు ► షణ్ముగం ముఠాదే అతిపెద్ద స్మగ్లింగ్ ► నాలుగేళ్లలో రూ.1400 కోట్ల సంపద అక్రమ రవాణా ► మిగిలిన స్మగ్లర్లు తరిలించింది ఎంతో? శేషాచలం కొండల నుంచి ఎర్రచందనం ఎలా సరిహద్దులు దాటుతుందో విచారణలో పోలీసులకు స్మగ్లరు వివరించినట్లు సమాచారం. చెన్నై కేంద్రంగా ఎర్రచందనం దుంగలను ముంబయి, కోల్కత్తా, కేరళ ప్రాంతాలకు సముద్రమార్గంలో తరలిస్తున్నారు. అక్కడి నుంచి సరిహద్దులోని భూటాన్, చైనా, నేపాల్ లాంటి దేశాలకు ట్రాన్స్‌పోర్టు ద్వారా అక్రమంగా చేరవేస్తున్నారు. అక్కడి నుంచి వివిధ దేశాలకు అక్రమ రవాణా చేస్తున్నట్లు స్మగ్లర్లు నోరువిప్పినట్లు తెలిసింది. చిత్తూరు (అర్బన్) : ఎర్రచందనం అక్రమ రవాణాలో చెన్నై-బెంగళూరు ఆపరేషన్లలో కింగ్‌పిన్ షణ్ముగం, అతని అనుచరులు సౌందర్‌రాజన్, శరవణన్ బ్యాచ్‌లు నాలుగేళ్ల కాలంలో దాదాపు 700 మెట్రిక్ టన్నుల (7 లక్షల కిలోలు) ఎర్రచందనం దుంగలను దేశ సరిహద్దులు దాటించి విదేశాలకు తరలించినట్లు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. ఇప్పటికే స్మగ్లర్లను న్యాయస్థానం అనుమతితో విచారిస్తున్న చిత్తూరు పోలీసులకు నిందితులు స్మగ్లింగ్‌కు ఎలా చేస్తారనేదానిపై పలు విషయాలు వెల్లడించారు. ఈ ముఠా ఇప్పటి వరకు తరలించిన 700 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం విలువ దాదాపు రూ.1400 కోట్లు ఉంటుందని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ లెక్కన మిగిలిన వేలాది మంది స్మగ్లర్లు ఎంత ఎర్రచందనం స్మగ్లింగ్ చేశారు..? వీటి విలువ ఎంత అనేది ఆలోచిస్తేనే జిల్లా నుంచి ఏ స్థాయిలో ఈ వ్యవహారం నడిచిందో అర్థమవుతోంది. ఇలా సరిహద్దులు దాటిస్తారు... చెన్నై-పశ్చిమ బెంగాల్ ఆపరేషన్‌లో రిమాండుకు తరలించిన నిందితులను ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణలో స్మగ్లర్లు ఎలా ఎర్ర సంపదను సరిహద్దులు దాటవేస్తారనే విషయాలను పోలీసులకు పూసగుచ్చినట్లు వివరించారు. విశ్వసనీయ సమాచారం మేరకు .. తొలిగా శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్లను నరకడానికి తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో కూలీలను ఎంపిక చేసుకుంటారు. ఈ కూలీలను ఒక గ్రూపునకు 50 నుంచి 100 మంది వరకు సరఫరా చేసే మేస్త్రీల ద్వారా కాంట్రాక్టు కుదుర్చుకుంటారు. కూలీలు అడవుల్లోకి వచ్చి ఎర్రచందనం చెట్లను నరికి దానిని లోడింగ్ చేసి వెళ్లిపోతారు. దుంగలతో ఉన్న లోడింగ్ వాహనానికి ఇద్దరు పెలైట్లు దారి చూపిస్తూ ముందుకు వెళుతారు. సమస్య అంతా జిల్లా సరిహద్దుల నుంచి సరుకు చెన్నైకి చేరుకునే వరకే. అక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు. స్మగ్లర్లు ఇక్కడున్న కొందరు పోలీసు అధికారులకు నెలకు రూ.లక్షల్లో మామూళ్లు ఇస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. చెన్నైకి చేరుకున్న సరుకును ఇక్కడ సొంతంగా ట్రాన్స్‌పోర్టు వ్యవస్థ కలిగిన స్మగ్లర్లు వారి గోడౌన్లలో భద్రపరుస్తారు. ఒక్కో గోడౌన్‌కు సాధారణంగా నెలకు రూ.20 వేలు అద్దె ఉంటుంది. స్మగ్లర్లు నెలకు రూ.60 వేలు అద్దె ఇస్తుండడంతో గోడౌన్లు ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతోంది. ఇలా వచ్చిన సరుకును బయ్యర్లకు చూపించి పోర్టు ద్వారా కంటైనర్లలో బియ్యం, పప్పులు, ఇతర నిత్యావసర వస్తువుల నడుమ ఉంచి సముద్రమార్గంలో ముంబయి, కోల్కత్తా, కేరళ ప్రాంతాలకు తరలించి నిల్వ చేస్తారు. ఇక్కడి నుంచి సరిహద్దు దేశాలకు సరుకును లారీల ద్వారా చేరవేస్తారు. భూటాన్, చైనా, నేపాల్ లాంటి దేశాల్లో 500 కిలోలకన్నా తక్కువ ఎర్రచందనంను ఎలాంటి ఆంక్షలు లేకుండా, ఎవరైనా తీసుకెళ్లొచ్చు. ఇక్కడ అది నేరం కాదు. దీనికన్నా ఎక్కువ తీసుకెళితే జరిమానాలు వేసి వదిలేస్తారు. దీంతో స్వదేశంలో టన్ను ఎర్రచందనం ‘ఏ’ గ్రేడు దుంగలు రూ.30 లక్షలు పలికితే, అదే సరుకును విదేశాలకు స్మగ్లర్లు రూ.2 కోట్లకు అమ్ముతున్నారు. సరుకు చేరిన తరువాత విదేశాల్లోని స్మగ్లర్లు వారి ఏజెంట్ల ద్వారా మన దేశ స్మగ్లర్లకు నగదును ముట్టజెబుతారు. ఎర్రచందనంతో ఏం చేస్తారు? జిల్లాలో ఆపరేషన్ రెడ్ను ప్రారంభించి దాదాపు మూడేళ్లు కావస్తోంది. ఈ మూడేళ్లల్లో వేల మంది కూలీలను, స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. అయితే అందరి సందేహం ఒక్కటే. కేవలం ఎర్రచందనాన్ని విదేశాల్లో బొమ్మలు, గృహోపకరణ వస్తువుల తయారీకి మాత్రమే ఉపయోగిస్తారా..? దీనికి మించి మరేదైనా ఉందా..? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి జిల్లా పోలీసు యంత్రాంగం చేరువలో ఉంది. -
శేషాచలంలోనే ‘ఎర్ర’దొంగల పాగా
భారీగా పెరుగుతున్న చొరబాట్లు పట్టపగలే టన్నుల కొద్దీ ఎర్రచందనం అక్రమ రవాణా ఎర్రచందనాన్ని వేలం వేసే ప్రభుత్వం ఇక్కడి సంపదను కాపాడడం లేదు సాక్షి,తిరుమల: ఎర్రచందనం దుంగలను అక్రమంగా రవాణా చేసే వం దలాది మంది ‘ఎర్ర’ దొంగలు శేషాచలంలో పాగా వేశారు. శేషాచల అటవీప్రాంతానికే తలమానికమైన ఎర్రచందనం పట్టపగలే అక్రమ మా ర్గాల్లో తరలుతున్నా దీని నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగా ఉన్నాయి. అప్పుడప్పుడు పట్టుబడిన ఎర్రచందనం దుంగలను వేలం వేసేందుకు ఉత్సాహం చూపుతున్న ప్రభుత్వం, శేషాచలంలో ఎర్రదొంగల చొరబాట్లను ఆ పడంలో తగిన చర్యలు తీసుకోవడం లేదు. తూర్పు, పడమరలో చొరబాట్లు శ్రీవేంకటేశ్వర అభయారణ్యం పరిధి లో తిరుమల శేషాచల అటవీ ప్రాం తం ఉంది. ఇక్కడ అరుదైన జంతు, జీవజాలంతోపాటు విలువైన ఎర్రచందనం, శ్రీగంధం వృక్ష సంపద ఉంది. వీటికి అంతర్జాతీయ స్థాయిలో గిరాకీ ఉంది. తిరుమలకు పశ్చిమదిశలోని ఛామల రేంజ్ తలకోన నుంచి తిరుపతి వరకు విస్తరించింది. తూర్పుదిశలోని మామండూరు నుంచి వైఎస్ఆర్ జిల్లా రాజంపేట మీదుగా కర్నూలు జిల్లాలోని నల్లమల అటవీ మార్గం వరకు ఈ శేషాచల అటవీ ప్రాంతం విస్తరించింది. ఇక్కడ విలువైన ఎర్రచందనం వృక్షాలు అపారంగా ఉన్నా యి. పశ్చిమ దిశలో తలకోన, భాకరాపేట, రంగంపేట మార్గాల నుంచి దుండగులు నిత్యం శేషాచలంలోకి చొరబడుతున్నారు. ఇక తూర్పున మంగళం, కరకంబాడి, మామాం డూరు, రాజంపేట, సమీప అటవీ గ్రామాల నుంచి ఎర్రదొంగలు అడవిలోకి రాకపోకలు సాగిస్తున్నారు. గత 15 రోజులుగా పట్టపగలే అక్రమంగా రవాణా అవుతున్న వందల టన్నుల ఎర్రచందనం పోలీసులకు పట్టుబడింది. ఇందులో ఒకటి రెండు కేసుల్లో మినహా స్మగ్లర్లు కాని, కూ లీలు కాని పట్టుబడకపోవడం గమనార్హం. భక్తుల ముసుగులో.. తిరుమల నుంచి నాలుగు వైపులా అడవిలోకి వెళ్లే మార్గాలున్నాయి. ఇ ది ‘ఎర్ర’దొంగలకు కలసి వస్తోంది. ప్రధానంగా శ్రీవారిమెట్టు మార్గం నుంచి పశ్చిమదిశలో చాలా సులువు గా అడవిలోకి వెళ్లేందుకు వీలుంది. అలాగే, అలిపిరి కాలిబాట నుంచి కూడా భక్తుల ముసుగులో దుండగు లు అడవిలోకి చొరబడుతున్నారు. వీరిలో తమిళనాడుకు చెందిన తంబీ లే ఎక్కువగా ఉంటున్నారు. గతంలో ఇద్దరు ఫారెస్ట్ అధికారులను ఎర్రదొంగలు హత్య చేసిన తర్వాత ఫారె స్ట్ విభాగం, ఎస్టీఎఫ్ బలగాలతో నిత్యం కూంబింగ్ చేశారు. ఆరు నె లల కాలంలో వేర్వేరు ఘటనల్లో న లుగురు ఎర్రకూలీలు ఎన్కౌంటర్ లో మృతి చెందారు. అయినప్పటికీ ఎర్రకూలీల చొరబాట్లు మాత్రం ఆ గ టం లేదు. ఇటీవల కాలంలో ఎస్టీఎఫ్ బలగాలతోపాటు ఫారెస్ట్ అధికారుల కూంబింగ్, గాలింపు చర్యలు తగ్గిననట్టు కనిపిస్తోంది. అందువల్లే గడిచిన 15 రోజులుగా ఎర్రచంద నం అక్రమ రవాణా ఎక్కువగా సా గుతోంది. దీనిని బట్టి చూస్తే శేషాచలంలో వందల సంఖ్యలో ఎర్రదొంగలు తిష్టవేసినట్టు తెలుస్తోంది. సీఎంగారు .. శేషాచలంలో ఇంకా దొంగలున్నారు ? సీఎంగా ప్రమాణ స్వీకారం చేశా క తిరుమల పర్యటనలో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘ఎర్రదొం గలు ఇంకా ఉన్నారా? ఉంటే ఏరిపారేస్తాం’ అన్నారు. అయినప్పటికీ ఇక్కడి శేషాచలంలో మా త్రం ఎలాంటి మార్పు కనిపిం చడం లేదు. శేషాచల అడవుల్లో ఎర్రదొంగలు వందల సంఖ్యలో తిష్టవేసినట్టు నిత్యం పట్టుబడుతున్న దుంగలే తెలుపుతున్నా యి. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలను వేలం వేసి వేలకోట్ల రూపాయలు సంపాదించాలని రాష్ర్ట ప్రభుత్వం భా విస్తోంది. అయితే, తిరుమలేశుని క్షేత్రంలో అరుదైన వృక్షసంపద ను కాపాడేందుకు ప్రభుత్వ పె ద్దలు ఏ మాత్రం చొరవ చూపకపోవడంపై విమర్శలు వినిపిస్తు న్నాయి. -
ఎర్రదొంగల కట్టడికి ప్రధానిని కలుస్తా
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తిరుమల: శేషాచలం నుంచి ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలుస్తానని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, ఎర్రచందనం అక్రమ నరికివేతకు వ్యతిరేకంగా గతంలోనే తాను శేషాచల అడవుల్లో పాదయాత్ర చేశానని గుర్తుచేశారు. ఎర్రచందనం అక్రమ రవాణా అంతర్ రాష్ట్రాల మధ్య సాగుతోందని, దీనిపై కేంద్రం జోక్యం చేసుకుంటే పరిష్కారమవుతుందని చెప్పారు. వాటికన్ సిటీలో క్రైస్తవేతర మతాలు ప్రచారం చేసేందుకు తాను విరుద్ధమని, అలాగే తిరుమలలో కూడా హిందూయేతర మత ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. సున్నితమైన అంశంతో కూడిన అన్యమత ప్రచారం అడ్డుకునేందుకు పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. తిరుపతిలోని పేరూరు వద్ద అక్రమ మైనింగ్ మాఫియా కారణంగా వకుళమాత ఆలయం కూలే స్థితికి చేరుకుందన్నారు. దేవాలయ పునర్ నిర్మాణం కోసం ప్రభుత్వం కృషిచేయాలని, దాతలు కూడా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. సర్వ దర్శనానికి 6 గంటలు.. తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు సర్వదర్శనం కోసం 24 కంపార్ట్మెంట్లలో భక్తులు నిండారు. వీరికి 16 గంటలు, కాలిబాట మార్గాల్లో వచ్చిన వారికి 6 గంటల తర్వాత దర్శనం లభించనుంది. -
'ఎర్రచందనం స్మగ్లింగ్ కట్టడికి ఇంటర్‌పోల్ సాయం'
తిరుమల : ఎర్రచందనం అక్రమ రవాణను అరికట్టేందుకు ఇంటర్ పోల్ సహాయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నట్లు బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షడు, ఎమ్మెల్యే జి.కిషన్ రెడ్డి తెలిపారు. ఆదివారం తిరుమలలో వీఐపీ ప్రారంభ దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం కిషన్ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... వకుళామాత ఆలయం నిర్మాణానికి టీటీడీ పాలక మండలి ఆమోదం తెలిపినా... అధికారుల నిర్లక్ష్యంతోనే ఆ ఆలయ పనులు ఇప్పటికీ ప్రారంభకాలేదని ఆరోపించారు. దేవాలయ ప్రాంతాల్లో అన్యమత ప్రచారం సరికాదని విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. -
'ఎర్రచందనం అక్రమ రవాణాలో ఎవ్వరినీ వదలం'
తిరుపతి: ఎర్రచందనం అక్రమ రవాణాలో ఏ రాజకీయ పార్టీకి సంబంధమున్నా.. ఎవరున్నా వదిలిపెట్టమని ఆంధ్రప్రదేశ్ డీజీపీ జేవీ రాముడు స్పష్టం చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఎర్రచందనం మాఫియాకు పాల్పడుతున్న వారి వివరాలను సేకరిస్తున్నామని ఆయన అన్నారు. త్వరలోనే తిరుపతి పట్టణంలో కమిషనరేట్ ఏర్పాటు చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసుల యూనిఫామ్ ను మార్చ ప్రసక్తి లేదని, యథాతథంగా కొనసాగిస్తామన్నారు. -
అక్రమ రవాణాను అడ్డుకోలేరా?
సాక్షి, నెల్లూరు : జిల్లాలో పతాకస్థాయికి చేరిన ఎర్రచందనం స్మగ్లింగ్ ఎప్పుడు ఆగుతుందనేది ప్రశ్నార్థకమైంది. కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన పలువురు ప్రజాప్రతి నిధులు, నేతలు, పోలీసులు, అటవీ సిబ్బంది సైతం అక్రమ రవాణాలో కీలకపాత్ర పోషిస్తున్నారనేది బహిరంగ రహస్యమే. ముఖ్యంగా కడప, చిత్తూరు జిల్లాల స్మగ్లర్లు జిల్లాలో మకాం వేసి అక్రమ రవాణా చేస్తున్నట్టు సమాచారం. పైన పేర్కొన్న రెండు జిల్లాల్లో ఉన్నతాధికారుల నిఘా కట్టుదిట్టం చేయడంతో అక్కడి స్మగ్లర్లు నెల్లూరు కేంద్రంగా అక్రమ రవా ణా సాగిస్తున్నట్టు సమాచారం. అధికారుల నామమాత్రపు తనిఖీలు, ప్రభుత్వ పెద్దలే సహకరిస్తుండటంతో చందనం స్మగ్లింగ్ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. మ రోవైపు కొందరు అటవీ, సివిల్ పోలీసులు సైతం స్మగ్లింగ్‌కు సహకరిస్తున్న నేపథ్యంలో అక్రమ రవాణాకు అడ్డూఅదుపూ లేకుండాపోయింది. ఈ నేపథ్యంలో తమకు అడ్డంకిగా మా రిన నిజాయితీ అధికారులపై దాడులకే కాకుండా అంతమొందించేందుకు స్మగ్లర్లు వెనుకాడటం లేదు. గత నెలలో చిత్తూరు జిల్లాలో జరిగిన దాడులే ఇందుకు నిదర్శనం. ఇంటి దొంగలున్నంత వరకూ ప్రభుత్వం ఎంత మంది అదనపు సిబ్బందిని ఇచ్చినా, ఆయుధాలు ఎన్ని ఇచ్చినా స్మగ్లింగ్ ఆగే పరిస్థితి ఉండదు. రోజుకు రూ.2 కోట్ల చందనం స్మగ్లింగ్ : రోజుకు రెండు కోట్ల విలువైన ఎర్రచందనం జిల్లా సరిహద్దులు దాటుతున్నట్టు అంచనా. ప్రపంచంలోనే అరుదైన ఎర్రచందనం మర్రిపాడు, అనంతసాగరం, ఆత్మకూరు, సీతారామపురం, వెంకగిరి, రాపూరు తదితర ప్రాంతాల్లో లక్షా90 వేలకు పైగా హె క్టార్ల విస్తీర్ణంలో విస్తరించింది. కొందరు ఇంటిదొంగల సహకారంతో స్థానిక నేతలతో పాటు కొందరు ప్రజాప్రతి నిధులు సైతం స్మగ్లర్ల అవతారం ఎత్తారు. కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన కొందరు ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు కూడా స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నట్టు తెలుస్తోం ది. వెలుగొండలు, శేషాచలం అడవుల్లో ఎర్రచంద నం నరికించి విదేశాలకు ఎగుమతి చేస్తూ కోట్లు గడిస్తున్నారు. ఇంటిదొంగలతో ఇబ్బందులు : అటవీ సిబ్బంది కొరత ఉన్నా మరోవైపు ఆ శాఖలోని కొందరు అధికారులే స్మగ్లర్లతో కు మ్మక్కై అక్రమాలను ప్రోత్సహిస్తున్నారు. కోట్లాది రూపాయ లు అప్పనంగా వస్తుండటంతో స్మగ్లర్లు నిజాయితీ పరులైన అటవీ సిబ్బందిపై దాడులకు తెగబడిన సంఘటనలూ ఉ న్నాయి. స్మగ్లర్లకు సహకరించారన్న ఆరోపణలపై ఇప్పటి వ రకూ మూడు జిల్లాల పరిధిలో 40 మందికిపైగా పైగా అధికారులపై చర్యలు తీసుకున్నారు. తాజాగా డీఎఫ్ఓనే పెద్ద ఎత్తున డబ్బుతో ఏసీబీకి పట్టుబడిన విషయం విదితమే. చందనం స్మగ్లింగ్‌లో సివిల్ పోలీసులు : 2007లో స్మగ్లర్లకు సహకరిస్తున్నారన్న ఆరోపణలపై కడప జిల్లాలో ముగ్గురు సీఐలతోపాటు 21 మంది పోలీసులు, ఫారెస్ట్ సిబ్బందిని సస్పెండ్ చేయడం సంచలనం సృష్టించింది. అటవీ అధికారులపై దాడుల నేపథ్యంలో అటవీ సిబ్బందికి శిక్షణతో పా టు వెంటనే ఆయుధాలు సరఫరా చేస్తున్నట్టు ప్రభుత్వం చెప్పింది. అటవీ శాఖలో పనిచేస్తున్న యువ సిబ్బందికి సంబంధించిన వివరాలతో జాబితాను ఉన్నతాధికారులకు స్థానిక అధికారులు నివేదించారు. గత నెలలో హైదరాబాద్‌లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో అడవిలో పూర్తిస్థాయిలో కూంబింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం అటవీ సిబ్బందితో పాటు సివిల్, ఏపీఎస్పీ విభాగాల నుంచి పోలీసులను కేటాయించనున్నట్టు చెప్పా రు. కండీషన్లో ఉన్న వాహనాలను సైతం సమకూర్చనున్నట్టు ప్రకటించారు. ఇవన్నీ ఎప్పటికి ఆచరణకు నోచుకుంటాయో తెలియని స్థితి నెలకొంది. -
అదుపులో ప్రధాన స్మగ్లర్?
=‘ఎర్ర’కూలీల ద్వారా ఆచూకీ లభ్యం =దుబాయ్‌లో తలదాచుకున్న మరికొంత మంది స్మగ్లర్లు సాక్షి, తిరుపతి: ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే వారిపై ఉక్కుపాదం మోపడంతో, ఒక ప్రధాన స్మగ్లర్ పోలీసుల చేతికి చిక్కినట్లు తెలిసింది. ఇతడిని పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఇతని నుంచి అత్యంత కీలకమైన సమాచారం లభించినట్లు తెలుస్తోంది. అధికారుల హత్యకు సంబంధించిన సమాచారం కూడా ఇతని ద్వారా రాబట్టే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. శనివారం భాకరాపేట వద్ద ఎర్ర కూలీలను సరఫరా చేసే మేస్త్రీ పట్టుబడగా, పోలీసులు అత డిని విచారించారు. అతను ఇచ్చిన సమాచారం మేరకు ఒక ప్రధాన స్మగ్లర్‌ను అదుపులోకి తీసుకుని, రహస్యంగా విచారిస్తున్నట్లు తెలిసింది. అతని ద్వారా కొన్ని పేర్లు పోలీసులకు లభించినట్లు తెలిసింది. వీరిలో ఎక్కువ మంది దుబాయ్‌కు వెళ్లి తలదాచుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఒక అధికారి మాట్లాడుతూ దుబాయ్‌లో దాక్కుని ఉన్న వారిని కూడా వదిలే ప్రసక్తి లేదన్నారు. వీరి ఆచూకీ కోసం దుబాయ్ పోలీసుల సహకారం తీసుకుంటామన్నారు. తాము ఎర్ర స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపడంతో వీరు దుబాయ్, సింగపూర్, మలేషియా లాంటి దేశాలలో తలదాచుకుంటున్నారని తెలిపారు. అయితే ఎవరినీ వదిలేది లేదని చెప్పారు. ఇదిలా ఉండగా, పోలీసులు కూంబింగ్ తీవ్రం చేశారు. కూలీలపై లాఠీలను ఝుళిపిస్తున్నారు. ఆదివారం జరిగిన కూంబింగ్‌లో శేషాచలంలో కొంతమంది ఎర్ర కూలీలను పోలీసులు, అటవీ సిబ్బంది జాయింట్ ఆపరేషన్‌లో అరెస్టు చేసినట్లు తెలిసింది. వీరు పారిపోయే ప్రయత్నం చేయగా, లాఠీలు ఉపయోగించినట్లు తెలిసింది. ఇద్దరు అధికారులను పొట్టన పెట్టుకోవడంతో పోలీసులు ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీల అంతు తే ల్చాలనే నిర్ణయానికి వచ్చారు. ఇప్పటి వరకు అరెస్టు అయిన వారిని, ప్రధాన స్మగ్లర్‌ను కూడా సోమవారం కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలిసింది. -
'ఎర్రచందనం స్మగ్లింగ్ వెనుక సీఎం కిరణ్'
చిత్తూరులో ఎర్రచందనం స్మగ్లింగ్ వెనుక సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హస్తం ఉందని మాజీ మంత్రి పి.శంకర్రావు ఆరోపించారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌పై సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం వృక్షాలు యథేచ్ఛగా సాగుతుందంటే కిరణ్ కుమార్ రెడ్డి కారణమని పేర్కొన్నారు. తిరుపతి, నెల్లూరు, కడప జిల్లాల అటవీ ప్రాంతాలలో మాత్రమే పెరిగే అరుదైన వృక్ష జాతి అంతరించిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా తిరుపతి శేషాచలం కొండలో స్మగ్లర్లు అటవీశాఖ సిబ్బందిపై దాడి హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. ఆ ఘటనను ఆయన ఖండించారు. -
20 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
కడప : వైఎస్ఆర్ జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనాన్ని పోలీసులు పట్టుకున్నారు. కాశీనాయన మండలం మల్లెపల్లి వద్ద ఎర్రచందనం తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 20 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. రెండు మోటార్ బైక్‌లను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణాను నియంత్రించేందుకు పోలీసులు, అటవీ శాఖ అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా స్మగ్లర్లు మాత్రం యధేచ్చగా తమ పని తాము చేసుకు పోతున్నారు.