సాక్షి, నెల్లూరు : జిల్లాలో పతాకస్థాయికి చేరిన ఎర్రచందనం స్మగ్లింగ్ ఎప్పుడు ఆగుతుందనేది ప్రశ్నార్థకమైంది. కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన పలువురు ప్రజాప్రతి నిధులు, నేతలు, పోలీసులు, అటవీ సిబ్బంది సైతం అక్రమ రవాణాలో కీలకపాత్ర పోషిస్తున్నారనేది బహిరంగ రహస్యమే. ముఖ్యంగా కడప, చిత్తూరు జిల్లాల స్మగ్లర్లు జిల్లాలో మకాం వేసి అక్రమ రవాణా చేస్తున్నట్టు సమాచారం. పైన పేర్కొన్న రెండు జిల్లాల్లో ఉన్నతాధికారుల నిఘా కట్టుదిట్టం చేయడంతో అక్కడి స్మగ్లర్లు నెల్లూరు కేంద్రంగా అక్రమ రవా ణా సాగిస్తున్నట్టు సమాచారం.
అధికారుల నామమాత్రపు తనిఖీలు, ప్రభుత్వ పెద్దలే సహకరిస్తుండటంతో చందనం స్మగ్లింగ్ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. మ రోవైపు కొందరు అటవీ, సివిల్ పోలీసులు సైతం స్మగ్లింగ్‌కు సహకరిస్తున్న నేపథ్యంలో అక్రమ రవాణాకు అడ్డూఅదుపూ లేకుండాపోయింది. ఈ నేపథ్యంలో తమకు అడ్డంకిగా మా రిన నిజాయితీ అధికారులపై దాడులకే కాకుండా అంతమొందించేందుకు స్మగ్లర్లు వెనుకాడటం లేదు. గత నెలలో చిత్తూరు జిల్లాలో జరిగిన దాడులే ఇందుకు నిదర్శనం. ఇంటి దొంగలున్నంత వరకూ ప్రభుత్వం ఎంత మంది అదనపు సిబ్బందిని ఇచ్చినా, ఆయుధాలు ఎన్ని ఇచ్చినా స్మగ్లింగ్ ఆగే పరిస్థితి ఉండదు.
రోజుకు రూ.2 కోట్ల చందనం స్మగ్లింగ్ : రోజుకు రెండు కోట్ల విలువైన ఎర్రచందనం జిల్లా సరిహద్దులు దాటుతున్నట్టు అంచనా. ప్రపంచంలోనే అరుదైన ఎర్రచందనం మర్రిపాడు, అనంతసాగరం, ఆత్మకూరు, సీతారామపురం, వెంకగిరి, రాపూరు తదితర ప్రాంతాల్లో లక్షా90 వేలకు పైగా హె క్టార్ల విస్తీర్ణంలో విస్తరించింది. కొందరు ఇంటిదొంగల సహకారంతో స్థానిక నేతలతో పాటు కొందరు ప్రజాప్రతి నిధులు సైతం స్మగ్లర్ల అవతారం ఎత్తారు. కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన కొందరు ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు కూడా స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నట్టు తెలుస్తోం ది. వెలుగొండలు, శేషాచలం అడవుల్లో ఎర్రచంద నం నరికించి విదేశాలకు ఎగుమతి చేస్తూ కోట్లు గడిస్తున్నారు.
ఇంటిదొంగలతో ఇబ్బందులు : అటవీ సిబ్బంది కొరత ఉన్నా మరోవైపు ఆ శాఖలోని కొందరు అధికారులే స్మగ్లర్లతో కు మ్మక్కై అక్రమాలను ప్రోత్సహిస్తున్నారు. కోట్లాది రూపాయ లు అప్పనంగా వస్తుండటంతో స్మగ్లర్లు నిజాయితీ పరులైన అటవీ సిబ్బందిపై దాడులకు తెగబడిన సంఘటనలూ ఉ న్నాయి. స్మగ్లర్లకు సహకరించారన్న ఆరోపణలపై ఇప్పటి వ రకూ మూడు జిల్లాల పరిధిలో 40 మందికిపైగా పైగా అధికారులపై చర్యలు తీసుకున్నారు. తాజాగా డీఎఫ్‌ఓనే పెద్ద ఎత్తున డబ్బుతో ఏసీబీకి పట్టుబడిన విషయం విదితమే.
చందనం స్మగ్లింగ్‌లో సివిల్ పోలీసులు : 2007లో స్మగ్లర్లకు సహకరిస్తున్నారన్న ఆరోపణలపై కడప జిల్లాలో ముగ్గురు సీఐలతోపాటు 21 మంది పోలీసులు, ఫారెస్ట్ సిబ్బందిని సస్పెండ్ చేయడం సంచలనం సృష్టించింది. అటవీ అధికారులపై దాడుల నేపథ్యంలో అటవీ సిబ్బందికి శిక్షణతో పా టు వెంటనే ఆయుధాలు సరఫరా చేస్తున్నట్టు ప్రభుత్వం చెప్పింది. అటవీ శాఖలో పనిచేస్తున్న యువ సిబ్బందికి సంబంధించిన వివరాలతో జాబితాను ఉన్నతాధికారులకు స్థానిక అధికారులు నివేదించారు. గత నెలలో హైదరాబాద్‌లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో అడవిలో పూర్తిస్థాయిలో కూంబింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం అటవీ సిబ్బందితో పాటు సివిల్, ఏపీఎస్పీ విభాగాల నుంచి పోలీసులను కేటాయించనున్నట్టు చెప్పా రు. కండీషన్‌లో ఉన్న వాహనాలను సైతం సమకూర్చనున్నట్టు ప్రకటించారు. ఇవన్నీ ఎప్పటికి ఆచరణకు నోచుకుంటాయో తెలియని స్థితి నెలకొంది.
అక్రమ రవాణాను అడ్డుకోలేరా?
Published Thu, Jan 9 2014 5:14 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement