sheshachalam forest
-
అటవీ ప్రాంతంలో నిప్పుపెట్టిన ఆకతాయిలు
సాక్షి, తిరుమల : జీవకోన స్థానిక నివాస అటవీ ప్రాంతంలో ఆకతాయిలు గురువారం నిప్పంటించారు. దీంతో శేషాచల అటవీ ప్రాంతంలో భారీగా మంటలు చెలరేగి పెద్ద ఎత్తున ఎగసి పడుతున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక గృహాల వరకు మంటలు రాకుండా, అటవీ ప్రాంతంలోని వాటిని అదుపు చేసేందుకు ఫారెస్ట్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. వెదురు మండలతో మంటలను అదుపు చేస్తున్నారు. అగ్ని మాపక సిబ్బంది కూడా మంటలను అదుపు చేసే పనిలో పడ్డారు. అయినప్పటికి మంటలు అదుపులోకి రావటం లేదు. -
అడవుల్లో గాలింపు!
శేషాచలం అడవుల్లో లొకేషన్స్ వెతికే పనిలో ఉన్నారు దర్శకుడు సుకుమార్. పనిలో పనిగా చిత్తూరు, నెల్లూరు ప్రాంతాల్లోని లొకేషన్స్‌ను కూడా చుట్టి రావాలని అనుకుంటున్నారట. సడన్‌గా సుకుమార్ ఈ ఫారెస్ట్ ట్రిప్ ఎందుకు చేస్తున్నారు అంటే... నెక్ట్స్ సినిమా కోసం. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, చెరుకూరి మోహన్ ఓ సినిమాను రూపొందించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కోసమే శేషాచలం అడవుల్లో లొకేషన్స్ గాలిస్తున్నారు సుకుమార్. ఎందుకంటే ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలు అడవి నేపథ్యంలో ఉంటాయట. ఈ సినిమా ప్రారంభోత్సవం ఈ నెల 11న జరుగుతుందని సమాచారం. ఈ చిత్రంలో రష్మికా మండన్నా కథానాయికగా నటించనున్నట్లు తెలిసింది. స్క్రిప్ట్ వర్క్‌ను ఆల్మోస్ట్ పూర్తి చేశారట సుకుమార్. ‘ఆర్య, అర్య 2’ సినిమాల తర్వాత సుకుమార్–అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తోన్న ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాతో బిజీగా ఉన్నారు అల్లు అర్జున్. అలాగే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్: కనబడుటలేదు’ అనే సినిమాకు కూడా అల్లు అర్జున్ కమిట్మెంట్ ఇచ్చారు. -
శృంగార సామర్థ్యాన్ని పెంచే ఎర్రచందనం!
పురాతన భారతీయ గ్రంథాలలో నిక్షిప్తమై ఉన్న అనేక అంశాలు విదేశీయులు అర్ధం చేసుకున్నంతగా మనవారు అర్ధం చేసుకోలేకపోతున్నారు. అలాగే మనదేశంలో లభించే వనమూలికలకు ఉండే ఔషద గుణాలు కూడా మనవారు పూర్తిగా తెలుసుకోలేకపోతున్నారు. తెలిసినా వాటిని సరైన రీతిలో ఉపయోగించుకోవడంలేదు. ప్రపంచంలోని వృక్ష జాతుల్లో అత్యంత ఖరీదైనది మనదేశంలో, ముఖ్యంగా మన రాష్ట్రంలోనే ఉందంటే నమ్మగలరా? నమ్మకం తప్పదు. అదే ఎర్రచందనం వృక్షం. ఈ వృక్షాలు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో అక్కడక్కడా ఉన్నప్పటికీ, శ్రీవారు నడయాడిన శేషాచలం అడవుల్లో అపారంగా ఉన్నాయి. ఎర్రచందనాన్ని గృహోపకరణాలకు మాత్రమే వినియోగిస్తారని చాలా మంది అనుకుంటారు. ఇది శృంగార పురషులకు గొప్ప ఔషదమని చాలామందికి తెలియదు. చైనీయులకు, జపాన్ వారికి ఇదంటే ఎంత పిచ్చో! ఎర్రచందనానికి ఔషద గుణాలతోపాటు శృంగార సామర్థ్యాన్ని పెంచే లక్షణం కూడా ఉంది. ఈ విషయం తెలిసిన చాలా మంది విదేశీయులు తమ శృంగార సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఎర్రచందనం పౌడర్‌ను వినియోగిస్తున్నారు. ఈ పౌడర్‌ను రోజుకు 5 గ్రాముల చొప్పున పాలల్లో గాని, తేనెలో గాని కలుపుకొని పడుకోవడానికి ఒక గంట ముందు తీసుకొంటే శరీరంలో లైంగిక హార్మోన్లు ఉత్పత్తి పెరుగి లైంగిక ప్రేరణను ఎక్కువగా కలగజేస్తుందని చెబుతున్నారు. ఎర్రచందనం గుణాలు తెలిసిన చైనా,జపాన్ వంటి విదేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలు ఎన్ని కోట్ల రూపాయలైనా ఎర్రచందనం కోసం ఖర్చు చేయడానికి వెనుకాడటం లేదు. చైనా, జాపాన్లలో పెళ్లి జరగాలంటే ఎర్రచందనం తప్పని సరిగా ఉండవలసిందే. ఈ దేశాలలొ షామిచాన్ అనే సంగీత వాయిద్యానికి అత్యంత ప్రాదాన్యత వుంది. పెళ్లిళ్లు చేసుకొనే ముందు యువకులు పెళ్లి కుమార్తెకు తప్పని సరిగా షామిచాక్ అనే వాయిద్య పరికరాన్ని కానుకగా ఇవ్వడం ఈ దేశాలలో ఆనవాయితీ. ఈ వాయిద్య పరికరాలను నాణ్యమైన ఎర్రచందనంతోనే తయారు చేస్తారు. మన దేశంలో పెళ్ళి కుమారులకు కట్నం ఇచ్చినట్లు అక్కడ పెళ్లి కుమార్తెలకు షామిచాన్ ఇచ్చి తీరతవలసిందే. ఈ వాయిద్య పరికరం తయారు చేయడానికి ఎంతలేదన్నా రెండు లక్షల రూపాయల ఖర్చు అవుతుంది. ఈ పరికరం తయారి కోసం ఈ దేశాలు ఏటా కనీసం 800 వందల టన్నుల ఎర్రచందనాన్ని దిగుమతి చేసుకుంటుంటాయి. ఈ ఎర్రచందనం అంతా మన దేశం నుంచి అడ్డదారినే దిగువతి చేసుకుంటుంటారు. -
శేషాచలం అడవుల్లో కొనసాగుతున్న కూంబింగ్!
తిరుమల: ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకునేందుకు శేషాచల అడవుల్లో పోలీసులు కూంబింగ్ కొనసాగిస్తున్నారు. పోలీసులపై గొడ్డళ్లతో ఎర్రచందనం స్మగ్లర్లు దాడికి పాల్పడటంతో ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో ముగ్గురు చనిపోయినట్టు ఎస్పీ రాజశేఖరబాబు తెలిపారు. స్మగ్లర్లు పోలీసులపై గొడ్డళ్లతో దాడి చేశారు. ఆత్మరక్షణ కోసం జరిపిన పోలీసుల కాల్పుల్లో ముగ్గురు చనిపోయారు. ఇంకా 100మంది స్మగ్లర్లు ఉన్నట్లు అనుమానంగా ఉంది. శేషాచలం అడవులను స్మగ్లర్ల ఫ్రీజోన్‌గా మారుస్తాం అని ఎస్పీ రాజశేఖరబాబు అన్నారు. -
శేషాచలంలో కూంబింగ్, ముగ్గురు స్మగ్లర్లు మృతి
-
శేషాచలంలో కూంబింగ్, ముగ్గురు స్మగ్లర్లు మృతి
తిరుమల : తిరుమల శేషాచలం అడవులు మరోసారి కాల్పుల మోతతో హోరెత్తింది. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం అక్రమ రవాణాను ఆరికట్టేందుకు పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఎర్రచందనం స్మగ్లర్లు పోలీసులపై దాడి చేశారు. పరిస్థితి అదుపు తప్పటంతో పోలీసులు ప్రతిగా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎదురు కాల్పుల్లో ముగ్గురు స్మగ్లర్లు మృతి చెందగా, అయిదుగురు పోలీసులు గాయపడ్డారు. కాగా ఎర్రచందనం స్మగ్లర్ల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. అటవీ శాఖ అధికారులతో కలిసి అన్ని వైపుల నుంచి పట్టుబిగిస్తున్నా రు. ఎర్రచందనం స్మగ్లింగ్‌పై కఠినంగా వ్యవహరించాలని పోలీసు బాస్ నుంచి ఉత్తర్వులు రా వడంతో రాయలసీమ జోన్ ఐజీ నవీన్‌చంద్, అనంతపురం రేంజ్ డీఐజీ బాలకృష్ణ పర్యవేక్షణలో టాస్క్‌ఫోర్స్‌తోపాటు పోలీసు సర్కిల్స్ పరిధిలోని సీఐలతో ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశారు. -
శేషాచలం అడవుల్లో భారీ అగ్ని ప్రమాదం
-
అక్రమ రవాణాను అడ్డుకోలేరా?
సాక్షి, నెల్లూరు : జిల్లాలో పతాకస్థాయికి చేరిన ఎర్రచందనం స్మగ్లింగ్ ఎప్పుడు ఆగుతుందనేది ప్రశ్నార్థకమైంది. కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన పలువురు ప్రజాప్రతి నిధులు, నేతలు, పోలీసులు, అటవీ సిబ్బంది సైతం అక్రమ రవాణాలో కీలకపాత్ర పోషిస్తున్నారనేది బహిరంగ రహస్యమే. ముఖ్యంగా కడప, చిత్తూరు జిల్లాల స్మగ్లర్లు జిల్లాలో మకాం వేసి అక్రమ రవాణా చేస్తున్నట్టు సమాచారం. పైన పేర్కొన్న రెండు జిల్లాల్లో ఉన్నతాధికారుల నిఘా కట్టుదిట్టం చేయడంతో అక్కడి స్మగ్లర్లు నెల్లూరు కేంద్రంగా అక్రమ రవా ణా సాగిస్తున్నట్టు సమాచారం. అధికారుల నామమాత్రపు తనిఖీలు, ప్రభుత్వ పెద్దలే సహకరిస్తుండటంతో చందనం స్మగ్లింగ్ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. మ రోవైపు కొందరు అటవీ, సివిల్ పోలీసులు సైతం స్మగ్లింగ్‌కు సహకరిస్తున్న నేపథ్యంలో అక్రమ రవాణాకు అడ్డూఅదుపూ లేకుండాపోయింది. ఈ నేపథ్యంలో తమకు అడ్డంకిగా మా రిన నిజాయితీ అధికారులపై దాడులకే కాకుండా అంతమొందించేందుకు స్మగ్లర్లు వెనుకాడటం లేదు. గత నెలలో చిత్తూరు జిల్లాలో జరిగిన దాడులే ఇందుకు నిదర్శనం. ఇంటి దొంగలున్నంత వరకూ ప్రభుత్వం ఎంత మంది అదనపు సిబ్బందిని ఇచ్చినా, ఆయుధాలు ఎన్ని ఇచ్చినా స్మగ్లింగ్ ఆగే పరిస్థితి ఉండదు. రోజుకు రూ.2 కోట్ల చందనం స్మగ్లింగ్ : రోజుకు రెండు కోట్ల విలువైన ఎర్రచందనం జిల్లా సరిహద్దులు దాటుతున్నట్టు అంచనా. ప్రపంచంలోనే అరుదైన ఎర్రచందనం మర్రిపాడు, అనంతసాగరం, ఆత్మకూరు, సీతారామపురం, వెంకగిరి, రాపూరు తదితర ప్రాంతాల్లో లక్షా90 వేలకు పైగా హె క్టార్ల విస్తీర్ణంలో విస్తరించింది. కొందరు ఇంటిదొంగల సహకారంతో స్థానిక నేతలతో పాటు కొందరు ప్రజాప్రతి నిధులు సైతం స్మగ్లర్ల అవతారం ఎత్తారు. కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన కొందరు ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు కూడా స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నట్టు తెలుస్తోం ది. వెలుగొండలు, శేషాచలం అడవుల్లో ఎర్రచంద నం నరికించి విదేశాలకు ఎగుమతి చేస్తూ కోట్లు గడిస్తున్నారు. ఇంటిదొంగలతో ఇబ్బందులు : అటవీ సిబ్బంది కొరత ఉన్నా మరోవైపు ఆ శాఖలోని కొందరు అధికారులే స్మగ్లర్లతో కు మ్మక్కై అక్రమాలను ప్రోత్సహిస్తున్నారు. కోట్లాది రూపాయ లు అప్పనంగా వస్తుండటంతో స్మగ్లర్లు నిజాయితీ పరులైన అటవీ సిబ్బందిపై దాడులకు తెగబడిన సంఘటనలూ ఉ న్నాయి. స్మగ్లర్లకు సహకరించారన్న ఆరోపణలపై ఇప్పటి వ రకూ మూడు జిల్లాల పరిధిలో 40 మందికిపైగా పైగా అధికారులపై చర్యలు తీసుకున్నారు. తాజాగా డీఎఫ్ఓనే పెద్ద ఎత్తున డబ్బుతో ఏసీబీకి పట్టుబడిన విషయం విదితమే. చందనం స్మగ్లింగ్‌లో సివిల్ పోలీసులు : 2007లో స్మగ్లర్లకు సహకరిస్తున్నారన్న ఆరోపణలపై కడప జిల్లాలో ముగ్గురు సీఐలతోపాటు 21 మంది పోలీసులు, ఫారెస్ట్ సిబ్బందిని సస్పెండ్ చేయడం సంచలనం సృష్టించింది. అటవీ అధికారులపై దాడుల నేపథ్యంలో అటవీ సిబ్బందికి శిక్షణతో పా టు వెంటనే ఆయుధాలు సరఫరా చేస్తున్నట్టు ప్రభుత్వం చెప్పింది. అటవీ శాఖలో పనిచేస్తున్న యువ సిబ్బందికి సంబంధించిన వివరాలతో జాబితాను ఉన్నతాధికారులకు స్థానిక అధికారులు నివేదించారు. గత నెలలో హైదరాబాద్‌లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో అడవిలో పూర్తిస్థాయిలో కూంబింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం అటవీ సిబ్బందితో పాటు సివిల్, ఏపీఎస్పీ విభాగాల నుంచి పోలీసులను కేటాయించనున్నట్టు చెప్పా రు. కండీషన్లో ఉన్న వాహనాలను సైతం సమకూర్చనున్నట్టు ప్రకటించారు. ఇవన్నీ ఎప్పటికి ఆచరణకు నోచుకుంటాయో తెలియని స్థితి నెలకొంది. -
అడవి దొంగల భరతం పడతాం
కర్నూలు(రూరల్), న్యూస్‌లైన్ : ప్రపంచంలో అరుదుగా ఉంటూ జగదేక వృక్షంగా పేరొందిన ఎర్రచందనం కోసం ఎంతకైనా తెగించే అటవీ దొంగల భరతం పట్టేందుకు ఫారెస్టు శాఖాధికారులు చర్యలు మొదలెట్టారు. ఇందులో భాగంగా స్మగ్లర్ల ఏరివేత కోసం అటవీ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. శేషాచలం అడవుల్లో ఫారెస్టు అధికారులపై స్మగ్లర్ల ఘాతుకం నేపథ్యంలో ఈ మేరకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించినట్లు కర్నూలు సర్కిల్ ఫారెస్ట్ కన్జర్వేటర్ శాంతిప్రియ పాండే తెలిపారు. ఇందుకు ఆమె ‘న్యూస్‌లైన్’కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రశ్న : కర్నూలు సర్కిల్లో ఎర్రచందనం ఎంత పరిధిలో విస్తరించి ఉంది? జవాబు : కర్నూలు సర్కిల్ పరిధిలోకి కడప, కర్నూలు జిల్లాలు వస్తాయి. రుద్రవరం రేంజ్లో 5 బీట్ల పరిధిలో 230 చ.కి.మీ. విస్తీర్ణంలో ఎర్ర చందనం ఉంది. కడప జిల్లా సిద్ధవఠం, బండిమెంట, రాయచూటి, వేంపల్లి రేంజ్‌లలో 1200 చ.కి.మీ., ప్రొద్దుటూరు పరిధిలో ప్రొద్దుటూరు, ఒనిపెంట, పోరుమామిళ్ల, బద్వేల్ రేంజ్‌లలో వెయ్యి కిలోమీటర్ల పరిధిలో చందనం ఉంది. ప్రశ్న : శేషాచలం అడవుల్లో దొంగల ఘాతుకం నేపథ్యంలో ఇక్కడ తీసుకుంటున్న చర్యలేంటి? జవాబు : స్మగ్లింగ్‌కు ప్రధాన సూత్రధారులుగా అనుమానిస్తున్న వారిపై నిఘా పెట్టాం. పోలీసుశాఖతో కలిసి నల్లమలలో సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాం. స్మగ్లర్ల వివరాల సేకరణకు ప్రత్యేక బృందాలను నియమించాం. మా శాఖ సిబ్బందితోపాటు పోలీసులు కూడా ఆయుధాలతో అడవుల్లో పర్యటిస్తూ తనిఖీలు నిర్వహిస్తున్నాం. ప్రశ్న : అటవీ సిబ్బందికి ఆయుధాలు ఇస్తున్నారా? జవాబు : స్మగ్లర్లు, క్రూర జంతువుల నుంచి రక్షణ కోసం అటవీ ఉద్యోగులకు ఆయుధాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 250కి పైగా ఆయుధాలు అవసరమని ప్రతిపాదించాం. రేంజర్ స్థాయివారికి రివాల్వర్, కిందిస్థాయి ఉద్యోగులకు తుపాకులు ఇస్తాం. శిక్షణ ఇచ్చిన తర్వాతే సిబ్బందికి ఆయుధాలు ఇస్తాం. ముందుగా పోలీసు అకాడమీలో ఫిట్నెస్ ట్రైనింగ్,, తర్వాత మూడు దఫాలుగా జిల్లాకు 70 మంది చొప్పున ఫిబ్రవరిలోపు శిక్షణ పొందేలా చర్యలు చేపట్టాం. ప్రశ్న : ఈ ఏడాది ఎన్ని పీడీ యాక్టు కేసులు నమోదు చేశారు? జవాబు : నంద్యాల రేంజ్ పరిధిలో నాలుగు, ప్రొద్దుటూరు రేంజ్లో 4, కడప రేంజ్లో 5 కేసులను పీడీ యాక్టు కింద ప్రతిపాదించాం. అనుమతి వచ్చిన వెంటనే నమోదు చేస్తాం. ప్రశ్న : అక్రమ రవాణా నిరోధానికి తీసుకుంటున్న చర్యలేంటి? జవాబు : 29 బేస్ క్యాంపులు, 9 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశాం. చెక్‌పోస్టుల్లో అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన సీసీ కెమెరాలు, జీపీఎస్ సెట్లు అమరుస్తున్నాం. అలాగే స్ట్రయికింగ్ ఫోర్స్తోఉన్న వాహనాలు, మూడు ప్రత్యేక పోలీసు బృందాలు పనిచేస్తున్నాయి. చెక్‌పోస్టుల్లో సోలార్ లైట్లు, స్టాపర్స్‌ను ఏర్పాటు చేయనున్నాం. ప్రశ్న : పీడీ యాక్టు కింద కేసు నమోదైనా స్మగ్లర్లు వారంలోపే బయటకు రావడమేంటి? జవాబు : ఎర్రచందనం స్మిగ్లింగ్ చేస్తూ ఆరు నెలల్లోపు రెండు/మూడుసార్లు పట్టుబడిన వారిపై పీడీ యాక్టు కింద కేసు పెడుతున్నాం. పీడీ యాక్టులో ఫారెస్టు అఫెండర్స్ అనే పదం లేకపోవడంతో ఈ కేసులు కోర్టు విచారణలో నిలవడం లేదు. విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఇటీవలే చట్టంలో ఆ పదాన్ని చేర్పించాం. ప్రశ్న : ఎర్రచందనం ముఠాల నుంచి ఫారెస్టు అధికారులకు మామూళ్లు అందుతున్నాయనే ఆరోపణలున్నాయి? జవాబు : అలాంటిదేమీ లేదు. ఉన్నట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రశ్న : అటవీ భూముల్లో అక్రమ మైనింగ్‌పై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? జవాబు : ప్రొద్దుటూరు రేంజ్లోఅక్రమ మైనింగ్ జరుగుతున్నట్లు తెలిసింది. కర్నూలు డివిజన్ పరిధిలో కూడా కొంత మేరకు ఉంది. అధికారుల తనిఖీల్లో పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేశాం. అటవీ భూముల్లో కేవలం నాలుగు లీజ్‌లు మాత్రమే ఉన్నాయి. ప్రశ్న : స్మగ్లర్లతో అధికారులు, సిబ్బంది కుమ్మక్కయ్యారనే ఆరోపణలపై మీ స్పందన ఏంటి? జవాబు : స్మగ్లర్లతో కుమ్మక్కైనట్లు తెలిస్తే విచారించి సదరు ఉద్యోగులపై వెంటనే చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటివరకు ప్రొద్దుటూరు రేంజ్లో 8 మందితోపాటు కడప డిప్యూటీ రేంజ్ ఆఫీసర్‌ను కూడా సస్పెండ్ చేశాం. పోలీసుల పాత్ర ఉంటే సంబంధిత డీఎస్పీకి ఫిర్యాదు చేస్తున్నాం. ప్రొద్దుటూరు, కడప రేంజ్లో జరిగే స్మగ్లింగ్‌లో పోలీసుల పాత్ర ఉన్నట్లు ఫిర్యాదులున్నాయి.