తిరుమల : తిరుమల శేషాచలం అడవులు మరోసారి కాల్పుల మోతతో హోరెత్తింది. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం అక్రమ రవాణాను ఆరికట్టేందుకు పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఎర్రచందనం స్మగ్లర్లు పోలీసులపై దాడి చేశారు. పరిస్థితి అదుపు తప్పటంతో పోలీసులు ప్రతిగా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎదురు కాల్పుల్లో ముగ్గురు స్మగ్లర్లు మృతి చెందగా, అయిదుగురు పోలీసులు గాయపడ్డారు.
కాగా ఎర్రచందనం స్మగ్లర్ల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. అటవీ శాఖ అధికారులతో కలిసి అన్ని వైపుల నుంచి పట్టుబిగిస్తున్నా రు. ఎర్రచందనం స్మగ్లింగ్‌పై కఠినంగా వ్యవహరించాలని పోలీసు బాస్ నుంచి ఉత్తర్వులు రా వడంతో రాయలసీమ జోన్ ఐజీ నవీన్‌చంద్, అనంతపురం రేంజ్ డీఐజీ బాలకృష్ణ పర్యవేక్షణలో టాస్క్‌ఫోర్స్‌తోపాటు పోలీసు సర్కిల్స్ పరిధిలోని సీఐలతో ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశారు.
శేషాచలంలో కూంబింగ్, ముగ్గురు స్మగ్లర్లు మృతి
Published Thu, May 29 2014 10:11 AM | Last Updated on Thu, Oct 4 2018 6:03 PM
Advertisement