
రీతూ అగర్వాల్ (ఫైల్)
కర్నూలు: తనపై నాగరాజు అనే వ్యక్తి దాడి చేశాడని ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో నిందితురాలిగా ఉన్న సినీ నటి రీతూ అగర్వాల్ ఆరోపించింది. కర్నూలు జిల్లా రుద్రవరం పోలీసుస్టేషన్ లో సంతకం చేసి హైదరాబాద్ కు తిరిగి వెళుతుండగా సిరివెల్ల వద్ద తనపై దాడి చేశారని పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. కాగా, తనకు రావాల్సిన డబ్బుల కోసం ఏ1 ట్రావెల్ అధినేత నాగరాజు... రీతూ అగర్వాల్ కారు తాళాలు లాక్కున్నట్టు తెలుస్తోంది.
ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో బెయిల్ పై బయటికి వచ్చిన రీతూ అగర్వాల్ ప్రతి ఆదివారం రుద్రవరం పోలీసుస్టేషన్ కు వచ్చి సంతకం చేయాల్సివుంది. ఈ క్రమంలోనే దాడి జరిగినట్టు సమాచారం. ఎర్రచందనం స్మగ్లింగ్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని రీతూ అగర్వాల్ అంతకుముందు స్పష్టం చేసింది. అనవసరంగా తనను ఈ కేసులో ఇరికించారని ఆమె వాపోయింది.