ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ‘పుష్ప’ సినిమా ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చెప్పిన తగ్గేదేలే డైలాగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించింది. సినిమా వచ్చినప్పటి నుంచి ప్రతి చోట, అందరి నోటా ఈ డైలాగే వినిపిస్తోంది. తాజాగా అచ్చం పుష్ప సినిమాను ఆదర్శంగా తీసుకొని ఓ వ్యక్తి ఎర్రచందనం స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే పక్కా ప్లాన్‌తో వెళ్లిన ఆ స్మగ్లర్‌కు పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు.
వివరాల్లోకి వెళితే… కర్ణాటకలోని బెంగుళూరు సమీపంలోని అనేకల్‌కు చెందిన సయ్యద్ యాసిన్ అనే స్మగ్లర్ పోలీసులకు చిక్కకుండా ఎర్ర చందనాన్ని అనుకున్న గమ్యానికి చేరవేయడంలో దిట్ట. అచ్చం పుష్ప సినిమా మాదిరే పోలీసులకు అనుమానం రాకుండా చాకచక్యంగా వ్యవహరిస్తూ ప్రతి చెక్ పోస్ట్ దాటిస్తూ సరుకును రవాణా చేస్తుంటాడు. ఎప్పటిలాగే తన ట్రక్కులో కర్ణాటక-ఆంధ్ర సరిహద్దు నుంచి మహారాష్ట్రకు మార్గమధ్యంలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేందుకు బయలు దేరాడు.
చదవండి: వివాహేతర సంబంధం: 16 ఏళ్ల క్రితం పెళ్లి, భర్త అడ్డొస్తున్నాడనే ప్రియుడితో కలిసి..
లారీ ముందు భాగంలో కోవిడ్ బాధితులకు పండ్లు సరఫరా చేసేవాహనం అని రాయించి.. లారీలో ఎర్ర చందనం దుంగలతో పాటు కొన్ని పండ్లు కూడా లోడ్ చేయించుకుని బయలు దేరాడు. ఆంధ్ర, కర్ణాటక చెక్ పోస్టుల్లో అధికారుల కళ్లు కప్పి జనవరి 31న మహారాష్ట్రకు చేరుకున్నాడు. మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా మీరజ్ నగర్ వద్ద సరిహద్దు దాటుతుండగా పోలీసులు అతన్ని పట్టుకున్నారు. పోలీసులు తనిఖీ చేసి అతని నుంచి రూ.2.45 కోట్ల విలువైన చందనంతో పాటు రూ.10 లక్షల విలువైన లారీని స్వాధీనం చేసుకున్నారు.
చదవండి: స్కూల్ భవనం వెనక్కి తీసుకెళ్లి.. విద్యార్థినిపై ఆరుగురు టీనేజర్ల లైంగిక దాడి
Comments
Please login to add a commentAdd a comment