
మా బంధువులను అరెస్ట్ చేశారు: సినీ నటి
హైదరాబాద్ : ఎర్రచందనం స్మగ్లింగ్లో సంబంధం లేకున్నా తమ ముగ్గురు బంధువులను అరెస్ట్ చేశారని సినీ నటి నీతూ అగర్వాల్ ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్లో నీతూ అగర్వాల్ విలేకర్లతో మాట్లాడుతూ.. కడప, ప్రొద్దుటూరు పోలీసులు తనపట్ల అనుసరిస్తున్న వ్యవహారశైలిపై ఆమె మండిపడ్డారు. సదురు పోలీసులుపై ఆమె ఆరోపణలు గుప్పించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో నిందితురాలు అయిన సినీ నటి నీతూ అగర్వాల్.. బెయిల్పై బయట ఉన్నారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్ బీరంగూడలోని బంధువుల ఇంట్లో నీతూ అగర్వాల్ ఉంటున్నారు.