neethu agarwal
-
మా బంధువులను అరెస్ట్ చేశారు: సినీ నటి
హైదరాబాద్ : ఎర్రచందనం స్మగ్లింగ్‌లో సంబంధం లేకున్నా తమ ముగ్గురు బంధువులను అరెస్ట్ చేశారని సినీ నటి నీతూ అగర్వాల్ ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్‌లో నీతూ అగర్వాల్ విలేకర్లతో మాట్లాడుతూ.. కడప, ప్రొద్దుటూరు పోలీసులు తనపట్ల అనుసరిస్తున్న వ్యవహారశైలిపై ఆమె మండిపడ్డారు. సదురు పోలీసులుపై ఆమె ఆరోపణలు గుప్పించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో నిందితురాలు అయిన సినీ నటి నీతూ అగర్వాల్.. బెయిల్‌పై బయట ఉన్నారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్ బీరంగూడలోని బంధువుల ఇంట్లో నీతూ అగర్వాల్ ఉంటున్నారు. -
మస్తాన్ వలీతో ప్రాణహాని
రుద్రవరం: ఎర్రచందనం స్మగ్లర్ మస్తాన్ వలీతో తనకు ప్రాణహాని ఉందని సినీనటి నీతూ అగర్వాల్ తెలిపారు. ఆదివారం కర్నూలు జిల్లా రుద్రవరం పోలీస్‌స్టేషన్‌లో సంతకం చేసేందుకు ఆమె వచ్చారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ కొందరు వ్యక్తులు తనను చంపుతామంటూ ఫోన్లో బెదిరింపులకు పాలుపడుతున్నారన్నారు. ఆ వ్యక్తుల పేర్లు త్వరలో బయట పెడతానని చెప్పారు.తనకు ఏదైనా ప్రమాదం జరిగితే మస్తాన్, అతని కుటుంబ సభ్యులు బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. ఎర్రచందనం కేసులో తాను నిర్దోషినని అన్నారు. -
'నాకు ప్రాణహాని ఉంది'
కర్నూలు: తనకు ప్రాణహాని ఉందని టాలీవుడ్ సినీ నటి నీతూ అగర్వాల్ ఆరోపించారు. అందుకు కుట్ర జరుగుతుందన్నారు. తాను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు. తనకు ఏం జరిగిన మస్తాన్ వలీదే బాధ్యత అంటూ ఆమె కన్నీటి పర్యంతమైయ్యారు. ఆదివారం కర్నూలు జిల్లా రుద్రవరం పోలీసు స్టేషన్లో సంతకం పెట్టేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మీడియా ఎదుట మాట్లాడతూ కన్నీరు పెట్టుకున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణ కేసులో అరెస్ట్ అయిన సినీ నటి నీతూ అగర్వాల్‌కు కర్నూలు జిల్లా కోవెలకుంట్ల జూనియర్ సివిల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రతి ఆదివారం కర్నూలు జిల్లా రుద్రవరం పోలీస్ స్టేషన్లో సంతకం చేయాలనే షరతుతో జడ్జి బెయిల్ మంజూరు చేసిన విషయం విదితమే.