ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న లారీ
కాంచీపురం (తమిళనాడు): పాత దుస్తుల మాటున ఎర్రచందనం దుంగలను అక్రమంగా రవాణా చేస్తున్న లారీని తమిళనాడు పోలీసులు శనివారం రాత్రి పట్టుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న దుంగల విలువ సుమారు రూ.30 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. కాంచీపురం జిల్లా శ్రీపెరంబుదూరు సమీపంలోని బన్‌రుట్టి అనే గ్రామంలో కలైసెల్వం అనే వ్యక్తికి చెందిన స్థలంలో రెండు గోదాములున్నాయి. వీటిని లీజుకు తీసుకుని పలువురు పాత దుస్తుల వ్యాపారం చేస్తున్నారు.
అయితే అక్కడి నుంచి ఎర్రచందనం రవాణా చేస్తున్నట్లు అందిన సమాచారంతో పోలీసులు శనివారం రాత్రి ఆ సమీపంలో మాటు వేసి ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్న లారీని పట్టుకున్నారు. లారీలోని పాత దుస్తుల మూటల్లో దాచిన 15 టన్నుల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. గోదాములో అక్రమంగా ఉంచిన 10 టన్నుల దుంగలను స్వాధీనం చేసుకుని, గోదామును సీజ్ చేశారు. లారీ డ్రైవర్‌ను, గోదాములో పనిచేస్తున్న మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment