‘ఎర్ర’ స్మగ్లర్ల ఏరివేత! | 'Red' smugglers culling ! | Sakshi
Sakshi News home page

‘ఎర్ర’ స్మగ్లర్ల ఏరివేత!

Published Sun, Jun 21 2015 1:59 AM | Last Updated on Sun, Sep 3 2017 4:04 AM

‘ఎర్ర’ స్మగ్లర్ల ఏరివేత!

‘ఎర్ర’ స్మగ్లర్ల ఏరివేత!

సాక్షి, కడప : ‘ఎర్ర’ స్మగ్లర్ల వరుస అరెస్టులు జిల్లాలో కలకలం రేపుతున్నాయి. రెండు నెలల వ్యవధిలో అంతర్జాతీయ స్మగ్లర్లు బొడ్డె వెంకట రమణ, మణి అణ్ణన్, బదాని, ప్రేమ్‌తార్, కిన్‌వున్‌ఫ్యాన్‌లతోపాటు తాజాగా శనివారం జంగాల శివశంకర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పెండ్లిమర్రి మండలం తిప్పిరెడ్డిపల్లె క్రాస్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా శనివారం ఉదయం వాహనంతో పోలీసులను ఢీకొట్టేలా వచ్చి పారిపోయేందుకు ప్రయత్నిం చిన అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ జంగాల శివశంకర్‌తోపాటు మరో ఏడుగురు అంతర్ రాష్ట్ర స్మగ్లర్లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్‌గులాఠీ వెల్లడించారు.

శుక్రవారం తన అనుచరులతో కలిసి వాహనాలలో కడపకు వచ్చిన శివశంకర్.. శేషాచలం అడవుల్లో సేకరించిన ఎర్రచందనం దుంగలను పొలతల అటవీ ప్రాం తంలో ఓపెల్ అస్ట్రా, టాటా ఇండికా కార్లలో లోడ్ చేసుకున్నారని తెలి పారు. బెంగళూరు వరకు దారిలో ముందు పెలైట్‌గా కొందరు వెళుతుండగా మిగిలిన వారు వెనుక వాహనాల్లో వచ్చేటట్లు ప్రణాళిక రూపొం దించినట్లు ఎస్పీ వివరించారు. జం గాల శివశంకర్, మరో ఇద్దరు కార్లలో బయలుదేరి పొలతల అటవీ ప్రాంతం నుంచి బెంగళూరు వెళ్లేందుకు వస్తుం డగా తిప్పిరెడ్డిపల్లె క్రాస్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా పట్టుబడినట్లు తెలిపారు.

వారి సమాచారం మేరకు పొలతల రిజర్వు ఫారెస్టులోని నీరుకోన శివాలయం వద్ద దుంగలను లోడు చేసుకుని కార్లలో, లారీల్లో బయలు దేరేందుకు సిద్ధంగా ఉన్న మిగిలిన నిందితులను పట్టుకున్నామని ఆయన పేర్కొన్నారు. జంగాల శివశంకర్ ఒంటిమిట్ట మండలం గాండ్లపల్లె గ్రామానికి చెందిన వాడని, తిరుపతిలో ఉంటూ వ్యవహారాలు చక్కబెట్టేవాడన్నారు. అతని అనుచరులు కర్ణాటక రాష్ర్టం హోస్పేట తాలూకాలోని శంకనిపురానికి చెందిన సయ్యద్ ఆసిఫ్ అలీ, చిత్తూరు జిల్లా బాసినకొండ గ్రామానికి చెందిన బి.సురేంద్రనాయక్, అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన సుధాకర్‌రెడ్డి, కర్ణాటకకు చెందిన సయ్యద్ ఆరీఫ్, వైఎస్సార్ జిల్లా మిట్టపల్లెకు చెందిన డి.రవిశంకర్, నందలూరు మండలం చింతకుంటకు చెందిన పులి కృష్ణయ్య, వల్లూరు మండలం పుష్పగిరికి చెందిన డి.శ్రీను తదితరులను కూడా అరెస్టు చేశామన్నారు. వారి వద్ద నుంచి రూ.8 కోట్ల విలువైన 42 టన్నుల (190) దుంగలు స్వాధీనం చేసుకున్నామన్నారు. శివశంకర్ పీడీ యాక్టు కింద రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉండి 2014లో విడుదలయ్యాడని వివరించారు.

 బొడ్డె వెంకటరమణ ద్వారా సమాచారం
 మే నెల మొదటి వారంలో అంతర్‌రాష్ట్ర స్మగ్లర్ బొడ్డె వెంకట రమణను అరెస్టు చేసిన తర్వాత విచారణలో జంగాల శివశంకర్ గురించి తెలిసిందని ఎస్పీ వివరించారు. శివశంకర్ ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌తోపాటు మరికొన్ని ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన అంతర్జాతీయ స్మగ్లర్లతో సంబంధాలు పెట్టుకుని యథేచ్ఛగా ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా సాగించాడన్నారు. ఇతనికి సయ్యద్ ఆసిఫ్ అలీ, సురేంద్రనాయక్, సయ్యద్ ఆరీఫ్‌లు ప్రధాన అనుచరులు కాగా.. ఆసిఫ్ అలీ కర్ణాటక రాష్ట్రం శంకనిపురం గ్రామ సర్పంచ్‌గా 2002లో పనిచేశాడని, 2014లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మరోమారు సర్పంచ్‌గా పోటీ చేసి ఓడిపోయాడన్నారు.

ఇతనికి కర్ణాటక రాష్ట్రంలోని కటిగనహళ్లి, బెంగళూరులో ఉన్న కొందరు అంతర్జాతీయ స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నట్లు తెలిసిందన్నారు. డి.రవిశంకర్ అనుచరులైన పులి కృష్ణయ్య, శ్రీనివాసులు ద్వారా జిల్లాలోని అడవుల్లో కూలీలతో ఎర్రచందనం చెట్లను నరికించి దుంగలుగా చేసి రవిశంకర్ స్నేహితుడైన తాడిపత్రికి చెందిన సుధాకర్‌రెడ్డి ద్వారా జంగాల శివశంకర్ కర్ణాటకకు చెందిన ఆసిఫ్ అలీ, సయ్యద్ ఆరీఫ్‌లకు అమ్మేవాడన్నారు. కూరగాయల వాహనాల్లో దుంగలను తరలించేవారన్నారు.  

 టాస్క్‌ఫోర్స్ సిబ్బందికి అభినందనలు
  ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టేందుకు ఏర్పడిన టాస్క్‌ఫోర్స్ ప్రత్యేక బృందాన్ని ఎస్పీ డాక్టర్ నవీన్ గులాఠీ అభినందించారు. ప్రత్యేకంగా రివార్డులను కూడా ఇవ్వనున్నట్లు తెలియజేశారు. స్మగ్లర్లను అరెస్టు చేయడంలో కీలకపాత్ర పోషించిన ఓఎస్‌డీ రాహుల్‌దేవ్‌శర్మ ఆధ్వర్యంలోని బృందం సభ్యులు ఎస్‌బీ డీఎస్పీ ఎం రాజగోపాల్‌రెడ్డి, ఫ్యాక్షన్ జోన్ డీఎస్పీ బి.శ్రీనివాపులు, ఇన్‌స్పెక్టర్లు రాజేంద్రప్రసాద్, బి.వెంకట శివారెడ్డి, మైదుకూరు అర్బన్ సీఐ వెంకటేశ్వర్లు, సబ్ ఇన్‌స్పెక్టర్లు హేమకుమార్, రోషన్, శివశంకర్, ఎస్.మహబూబ్‌బాష, రాజేశ్వరరెడ్డి, పెద్ద ఓబన్న, ఆర్వీ కొండారెడ్డి, నాగరాజు, సురేష్‌రెడ్డి, రామచంద్ర, ఇతర సిబ్బందిని ఎస్పీ అభినందించారు. విలేకరుల సమావేశంలో ఎస్పీతోపాటు ఓఎస్‌డీ రాహుల్‌దేవ్‌శర్మ, పులివెందుల ఏఎస్పీ అన్బురాజన్  పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement