Task Force staff
-
ముగ్గురూ ముగ్గురే!
కడప అర్బన్ : ఢిల్లీ, కాన్పూర్, జైపూర్‌లో దాడు లు నిర్వహించి జిల్లా పోలీసులు అరెస్ట్ చేసిన ముగ్గురు అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ల చరిత్ర విస్తుగొలుపుతోంది. ఏళ్ల తరబడి వందలాది టన్ను ల దుంగలను జిల్లా నుంచి కొల్లగొట్టుకుని సొమ్ము చేసుకున్నారు. ఇటీవల అరెస్టు అయిన స్మగ్లర్లను పోలీసులు విచారించినపుడు వీరి గురించి తెలి సింది. ప్రత్యేకృబందాలను ఏర్పా టు చేసి వీరిని అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్ గులాటీ శుక్రవారం మీడియాకు ఈ స్మగర్ల గురించి వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కనౌజ్ పట్టణానికి చెందిన బద్రుల్ హసన్ అలియాస్ ఇమ్రాన్ భాయ్ 30 సంవత్సరాల కిందట ఢిల్లీలో స్థిరపడ్డాడు. రెడీమేడ్ దుస్తుల తయారీ కేంద్రం నడుపుతున్నాడు. 20 ఏళ్ల కిందట తన గార్మెంట్స్ ఫ్యాక్టరీలో పని చేస్తున్న వైఎస్ఆర్ జిల్లా రైల్వేకోడూరుకు చెందిన మహిళను వివాహం చేసుకున్నాడు. అప్పుడప్పుడు రైల్వేకోడూరుకు వచ్చి వెళుతుండేవాడు. ఈ క్రమంలో ఇతనికి జిల్లాలోని స్మగ్లర్లు జంగాల శివశంకర్, విశ్వనాథ్ రెడ్డి, రాయచోటికి చెందిన దర్బార్ బాషా, తిరుపతికి చెందిన వెంకట్ రెడ్డి, చెన్నైకి చెందిన మహ్మద్ అలీ అలియాస్ అలీభాయ్, కందస్వామి వెంకటేష్, వెంకటరామరాజు, రహిమాన్ సేట్, హవాలా శంకర్‌లతో సంబంధాలు ఏర్పడ్డాయి. వారి వద్ద నుంచి ఎర్రచందనం దుంగలను ఢిల్లీకి తెప్పించుకుని చైనా, నేపాల్, దుబాయ్ దేశాలకు చెందిన అంతర్జాతీయ స్మగ్లర్లకు విక్రయించేవాడు. ఇప్పటి వరకు 500 టన్నుల ఎర్రచందనం విక్రయించాడు. ఢిల్లీలోని ఇతని గోడౌన్లపై 2008, 2013లో ఫారెస్ట్, డీఆర్ఐ (డెరైక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్) వారు దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశారు. ఇతను తన బంధువైన కాన్పూర్‌కు చెందిన నఫీజ్ హుసేన్ (మీనా ట్రాన్స్పోర్ట్) వాహనాల్లో దుంగలను ఢిల్లీ, జైపూర్ నగరాలకు తెప్పించుకుని గోడౌన్లలో నిల్వ చేసేవాడు. ఆ దుంగలను జైపూర్‌లో హస్తకళా వస్తువుల వ్యాపారం సేసే అశోక్ కుమార్ అగర్వాల్‌కు అమ్మేవాడు. వాటిని అతను బొమ్మలు, పూసల దండలుగా తయారు చేసి చైనా, నేపాల్, దుబాయ్ దేశాలకు ఎగుమతి చేసేవాడు. నఫీజ్ హుసేన్.. బ్రూమ్ స్టిక్స్(ఇళ్లు శుభ్రం చేసే కర్రలు) మాటున ఎర్రచందనం దుంగలను హసన్ భాయ్, అశోక్‌కుమార్ అగర్వాల్ గోడౌన్లకు చేరవేసేవాడు. ఇతనికి వారు ఒక్కో లోడ్‌కు అదనంగా రూ.లక్ష ఇచ్చేవారు. భారతి ట్రేడర్స్ పేరుతో చందనం వ్యాపారం చేసే జైపూర్‌కు చెందిన అశోక్‌కుమార్ 2008లో తిరుపతికి చెందిన చిన్నయ్య అనే వ్యక్తితో పరిచయం ఏర్పరచుకున్నాడు. అతని ద్వారా తిరుపతి పట్టణానికి చెందిన ఓ మహిళ ద్వారా ప్రభుత్వ అనుమతితో ఎర్రచందనం దుంగలను కొనుగోలు చేసేవాడు. తర్వాత హసన్ భాయ్, నఫీజ్ హుసేన్‌లతో పరిచయం ఏర్పడటంతో వారి నుంచి దుంగలు కొనుగోలు చేసేవాడు. ఇతనికి దుబాయ్‌కి చెందిన పేరుమోసిన స్మగ్లర్ అలీభాయ్తో సన్నిహిత సంబంధాలున్నాయి. పట్టుబడిన వైనం.. ఇటీవల అరెస్ట్ చేసిన స్మగ్లర్లను విచారించినప్పుడు వచ్చిన సమాచారం ఆధారంగా ఓఎస్డీ రాహుల్ దేవ్ శర్మ ఆధ్వర్యంలో మూడు ప్రత్యేకృబందాలు ఈ నెల 19న కాన్పూర్‌లో నఫీజ్ హుసేన్‌ను, 20న ఢిల్లీలో ఇమ్రాన్ భాయ్‌ని, 21న జైపూర్‌లో అశోక్‌కుమార్ అగర్వాల్‌ను అరెస్ట్ చేశాయి. వారి గోడౌన్లలో ఉన్న రూ.10 కోట్ల విలువైన 11.3 టన్నుల దుంగలు, మినీ లారీని స్వాధీనం చేసుకున్నారు. వారిని ఆయా నగరాల్లోని కోర్టుల్లో హాజరు పరిచి ట్రాన్సిట్ వారెంట్‌పై జిల్లాకు తీసుకువచ్చారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఇమ్రాన్ భాయ్‌పై ఆరు కేసులు, నఫీజ్పై ఎనిమిది, అగర్వాల్‌పై నాలుగు కేసులు నమోదయ్యాయి. టాస్క్‌ఫోర్స్ సిబ్బందిని అభినందించిన ఎస్పీ స్మగ్లర్లను అరెస్ట్ చేయడంలో కీలక పాత్ర వహించిన ఓఎస్డీ రాహుల్‌దేవ్ శర్మ సారథ్యంలోని టాస్క్‌ఫోర్స్ అధికారులు రాజంపేట డీఎస్పీ అరవింద బాబు, ఫాక్షన్ జోన్ డీఎస్పీ బి. శ్రీనివాసులు, సీఐలు జి. రాజేంద్రప్రసాద్, పి. శ్యాంరావు, రసూల్ సాహెబ్, సదాశివయ్య, ఎస్ఐలు హేమకుమార్, ఎన్. రాజరాజేశ్వర్ రెడ్డి, ఎస్ఎం. బాషా, షేక్ అన్సర్ బాషా, ఖాజామియా, హెడ్ కానిస్టేబుల్ వలీ, కానిస్టేబుళ్లు రమేష్, రవి, సుధాకర్, పెంచలయ్య, కొండయ్య, ప్రసాద్ నాయుడు, గోపీనాయక్లను ఎస్పీ అభినందించారు. -
‘ఎర్ర’ స్మగ్లర్ల ఏరివేత!
సాక్షి, కడప : ‘ఎర్ర’ స్మగ్లర్ల వరుస అరెస్టులు జిల్లాలో కలకలం రేపుతున్నాయి. రెండు నెలల వ్యవధిలో అంతర్జాతీయ స్మగ్లర్లు బొడ్డె వెంకట రమణ, మణి అణ్ణన్, బదాని, ప్రేమ్తార్, కిన్వున్ఫ్యాన్లతోపాటు తాజాగా శనివారం జంగాల శివశంకర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పెండ్లిమర్రి మండలం తిప్పిరెడ్డిపల్లె క్రాస్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా శనివారం ఉదయం వాహనంతో పోలీసులను ఢీకొట్టేలా వచ్చి పారిపోయేందుకు ప్రయత్నిం చిన అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ జంగాల శివశంకర్‌తోపాటు మరో ఏడుగురు అంతర్ రాష్ట్ర స్మగ్లర్లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్‌గులాఠీ వెల్లడించారు. శుక్రవారం తన అనుచరులతో కలిసి వాహనాలలో కడపకు వచ్చిన శివశంకర్.. శేషాచలం అడవుల్లో సేకరించిన ఎర్రచందనం దుంగలను పొలతల అటవీ ప్రాం తంలో ఓపెల్ అస్ట్రా, టాటా ఇండికా కార్లలో లోడ్ చేసుకున్నారని తెలి పారు. బెంగళూరు వరకు దారిలో ముందు పెలైట్‌గా కొందరు వెళుతుండగా మిగిలిన వారు వెనుక వాహనాల్లో వచ్చేటట్లు ప్రణాళిక రూపొం దించినట్లు ఎస్పీ వివరించారు. జం గాల శివశంకర్, మరో ఇద్దరు కార్లలో బయలుదేరి పొలతల అటవీ ప్రాంతం నుంచి బెంగళూరు వెళ్లేందుకు వస్తుం డగా తిప్పిరెడ్డిపల్లె క్రాస్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా పట్టుబడినట్లు తెలిపారు. వారి సమాచారం మేరకు పొలతల రిజర్వు ఫారెస్టులోని నీరుకోన శివాలయం వద్ద దుంగలను లోడు చేసుకుని కార్లలో, లారీల్లో బయలు దేరేందుకు సిద్ధంగా ఉన్న మిగిలిన నిందితులను పట్టుకున్నామని ఆయన పేర్కొన్నారు. జంగాల శివశంకర్ ఒంటిమిట్ట మండలం గాండ్లపల్లె గ్రామానికి చెందిన వాడని, తిరుపతిలో ఉంటూ వ్యవహారాలు చక్కబెట్టేవాడన్నారు. అతని అనుచరులు కర్ణాటక రాష్ర్టం హోస్పేట తాలూకాలోని శంకనిపురానికి చెందిన సయ్యద్ ఆసిఫ్ అలీ, చిత్తూరు జిల్లా బాసినకొండ గ్రామానికి చెందిన బి.సురేంద్రనాయక్, అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన సుధాకర్‌రెడ్డి, కర్ణాటకకు చెందిన సయ్యద్ ఆరీఫ్, వైఎస్సార్ జిల్లా మిట్టపల్లెకు చెందిన డి.రవిశంకర్, నందలూరు మండలం చింతకుంటకు చెందిన పులి కృష్ణయ్య, వల్లూరు మండలం పుష్పగిరికి చెందిన డి.శ్రీను తదితరులను కూడా అరెస్టు చేశామన్నారు. వారి వద్ద నుంచి రూ.8 కోట్ల విలువైన 42 టన్నుల (190) దుంగలు స్వాధీనం చేసుకున్నామన్నారు. శివశంకర్ పీడీ యాక్టు కింద రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉండి 2014లో విడుదలయ్యాడని వివరించారు. బొడ్డె వెంకటరమణ ద్వారా సమాచారం మే నెల మొదటి వారంలో అంతర్రాష్ట్ర స్మగ్లర్ బొడ్డె వెంకట రమణను అరెస్టు చేసిన తర్వాత విచారణలో జంగాల శివశంకర్ గురించి తెలిసిందని ఎస్పీ వివరించారు. శివశంకర్ ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌తోపాటు మరికొన్ని ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన అంతర్జాతీయ స్మగ్లర్లతో సంబంధాలు పెట్టుకుని యథేచ్ఛగా ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా సాగించాడన్నారు. ఇతనికి సయ్యద్ ఆసిఫ్ అలీ, సురేంద్రనాయక్, సయ్యద్ ఆరీఫ్‌లు ప్రధాన అనుచరులు కాగా.. ఆసిఫ్ అలీ కర్ణాటక రాష్ట్రం శంకనిపురం గ్రామ సర్పంచ్‌గా 2002లో పనిచేశాడని, 2014లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మరోమారు సర్పంచ్‌గా పోటీ చేసి ఓడిపోయాడన్నారు. ఇతనికి కర్ణాటక రాష్ట్రంలోని కటిగనహళ్లి, బెంగళూరులో ఉన్న కొందరు అంతర్జాతీయ స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నట్లు తెలిసిందన్నారు. డి.రవిశంకర్ అనుచరులైన పులి కృష్ణయ్య, శ్రీనివాసులు ద్వారా జిల్లాలోని అడవుల్లో కూలీలతో ఎర్రచందనం చెట్లను నరికించి దుంగలుగా చేసి రవిశంకర్ స్నేహితుడైన తాడిపత్రికి చెందిన సుధాకర్‌రెడ్డి ద్వారా జంగాల శివశంకర్ కర్ణాటకకు చెందిన ఆసిఫ్ అలీ, సయ్యద్ ఆరీఫ్‌లకు అమ్మేవాడన్నారు. కూరగాయల వాహనాల్లో దుంగలను తరలించేవారన్నారు. టాస్క్‌ఫోర్స్ సిబ్బందికి అభినందనలు ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టేందుకు ఏర్పడిన టాస్క్‌ఫోర్స్ ప్రత్యేక బృందాన్ని ఎస్పీ డాక్టర్ నవీన్ గులాఠీ అభినందించారు. ప్రత్యేకంగా రివార్డులను కూడా ఇవ్వనున్నట్లు తెలియజేశారు. స్మగ్లర్లను అరెస్టు చేయడంలో కీలకపాత్ర పోషించిన ఓఎస్డీ రాహుల్‌దేవ్‌శర్మ ఆధ్వర్యంలోని బృందం సభ్యులు ఎస్బీ డీఎస్పీ ఎం రాజగోపాల్‌రెడ్డి, ఫ్యాక్షన్ జోన్ డీఎస్పీ బి.శ్రీనివాపులు, ఇన్స్పెక్టర్లు రాజేంద్రప్రసాద్, బి.వెంకట శివారెడ్డి, మైదుకూరు అర్బన్ సీఐ వెంకటేశ్వర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు హేమకుమార్, రోషన్, శివశంకర్, ఎస్.మహబూబ్‌బాష, రాజేశ్వరరెడ్డి, పెద్ద ఓబన్న, ఆర్వీ కొండారెడ్డి, నాగరాజు, సురేష్‌రెడ్డి, రామచంద్ర, ఇతర సిబ్బందిని ఎస్పీ అభినందించారు. విలేకరుల సమావేశంలో ఎస్పీతోపాటు ఓఎస్డీ రాహుల్‌దేవ్‌శర్మ, పులివెందుల ఏఎస్పీ అన్బురాజన్ పాల్గొన్నారు. -
ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపాం
♦ గార్డ్‌పై కత్తితో దాడిచేసి మాపై ఎదురు దాడికి దిగారు ♦ రుయాలో చికిత్స పొందుతున్న టాస్క్‌ఫోర్స్ సిబ్బంది వెల్లడి తిరుపతి కార్పొరేషన్ : ‘గార్డ్‌గా వెళుతున్న ఇద్దరు కానిస్టేబుళ్లపై ఎర్రకూలీలు మారణాయుధాలతో దాడి చేశారు. షాక్‌కు గురైన మేము తమ వారిని రక్షించుకుంటూ, మా ప్రాణాలను కాపాడుకునేందుకు కాల్పులు జరిపాం.. లేకుంటే స్మగ్లర్ల చేతుల్లో మేము బలియ్యే వాళ్లం’ అని ఎర్రచందనం స్మగ్లర్ల దాడిలో గాయపడి రుయాలో చికిత్స పొందుతున్న టాస్క్ఫోర్సు సిబ్బంది తెలిపారు. చంద్రగిరి సమీపంలోని శ్రీవారిమెట్టు అటవీ ప్రాంతం చీకటీగల కోన, సచ్చినోడి బండ వద్ద మంగళవారం వేకువజామున ఎర్రచందనం కూలీలకు, టాస్క్ఫోర్సు సిబ్బందికి మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఎర్రచందనం స్మగ్లర్లుగా భావిస్తున్న 20 మంది హతమయ్యారు. ఈ ఘటనలో గాయపడ్డ 8 మంది టాస్క్ఫోర్సు సిబ్బందిని వైద్య సేవల నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. అప్రమత్తమైన వైద్య సిబ్బంది.. ఎర్రచందనం స్మగ్లర్ల దాడిలో గాయపడ్డ టాస్క్ఫోర్సు సిబ్బంది వైద్యం కోసం వస్తున్నట్టు సమాచారం అందడంతో రుయా ఆర్ఎంవో డాక్టర్ యు.శ్రీహరి అప్రమత్తమయ్యారు. రుయా అత్యవసర చికిత్స విభాగంలో బెడ్లు సిద్ధం చేశారు. 12 గంటల ప్రాంతంలో రుయాకు వచ్చిన టాస్క్ఫోర్సు ఎస్ఐ కిషోర్‌కుమార్ (స్వల్పగాయాలు), మునస్వామి (తలపై గాయం), సంతోష్ (ఎడమ మోచేతికి గాయం), వెంకటేశ్వర్లు (స్వల్ప గాయాలు), ఆర్ఎస్ఐ విజయ్ (తలపై గాయం), సత్య (స్వల్పగాయం), షేక్‌జాని (స్వల్పగాయం), హరికృష్ణ (స్వల్పగాయం)కు ఆర్ఎంవో శ్రీహరి ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ విభాగం సీఎంవో డాక్టర్ చలపతిరెడ్డి వైద్య సేవలు అందించారు. ముందు కత్తితో దాడి చేశారు.. ముందుగా అందిన సమాచారం మేరకు ఆదివారం ఉదయం నుంచి కూంబింగ్ చేస్తున్న తమకు మంగళవారం వేకువ జామున 4 గంటల ప్రాంతంలో చీకటీగల కోన వద్ద 40 మందికిపైగా ఉన్న ఎర్రచందనం స్మగ్లర్ల గుంపు ఎదురుపడింది. మా పార్టీకి ముందు గార్డ్‌గా వెళుతున్న మునస్వామి, సంతోష్‌ను స్మగ్లర్లు అడ్డుకున్నారు. ఇద్దరే అనుకున్న స్మగ్లర్లు చేతిలో ఆయుధం లేని మునస్వామి తలపై కత్తితో దాడి చేశారు. మునస్వామి అరుపులతో వెనుకనే వస్తున్న తాము అప్రమత్తమై ముందుగా గాల్లోకి కాల్పులు జరిపాము. వారు మూకుమ్మడిగా రాళ్లు, కత్తులు, గొడ్డళ్లను తమపైకి విసిరారు. అందుకే వారిపై కాల్పులు జరపాల్సి వచ్చింది. సార్ ఆకలేస్తోంది.. ‘సార్ ఆదివారం ఉదయం కాస్త పెరుగన్నం తిన్నాం. ఇంతవరకు ఏమి లేదు. ఆకలేస్తోంది. ముందు అన్నం ఉంటే తెప్పించండి’ అని టాస్క్‌ఫోర్స్ సిబ్బంది దీనంగా వేడుకోవడం కనిపించింది. స్పందించిన సీఎంవో డాక్టర్ చలపతిరెడ్డి టాస్క్ఫోర్సు సిబ్బందికి ఫ్లూయిడ్స్ అందించారు. అనంతరం టీటీడీ పంపిణీ చేస్తున్న శ్రీవారి అన్నప్రసాదం తెప్పించి ఇచ్చారు.