గిరిసీమలు గజగజ | Another four bodies is available | Sakshi
Sakshi News home page

గిరిసీమలు గజగజ

Published Wed, Oct 26 2016 2:11 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM

గిరిసీమలు  గజగజ - Sakshi

గిరిసీమలు గజగజ

మరో నాలుగు మృతదేహాలు లభ్యం
ఎన్‌కౌంటర్ మృతుల  సంఖ్య 28
ఎన్‌కౌంటర్‌కు ముందు.. ఆ తర్వాత తీవ్ర నిర్బంధం
వారం రోజుల నుంచి విద్యుత్ బంద్
సెల్ సిగ్నళ్లను జామ్ చేసిన అధికారులు
క్షతగాత్రుల కోసం గ్రామాల్లో జల్లెడ
ఆర్‌ఎంపీలు, ఇతర అనుమానితుల  అరెస్టులు
బిక్కుబిక్కుమంటున్న  గిరిజనులు

 

కూంబింగ్ దళాల కరకు బూట్ల చప్పుళ్లు.. గత కొద్దిరోజులుగా విద్యుత్ సరఫరా నిలిపివేత.. సోమవారంనాటి ఎన్‌కౌంటర్ అనంతరం మరింత పెరిగిన నిర్బంధం మధ్య గిరిసీమలు బిక్కుబిక్కుమంటున్నాయి.. దీనికి తోడు మంగళవారం మరో ఎన్‌కౌంటర్ జరిగిందని.. నలుగురు మావోలు మృతి చెందారని విస్తృతంగా జరిగిన ప్రచారం ఏజెన్సీని తీవ్ర భయాందోళనకు

 
గురి చేసింది..

అయితే మరో ఎన్‌కౌంటర్ జరగలేదని.. సోమవారంనాటి ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మరో నలుగురి మృతదేహాలు లభ్యమయ్యాయని తర్వాత తేలింది. దీంతో భారీ ఎన్‌కౌంటర్‌లో మృతుల సంఖ్య 28కి పెరిగింది. మృతులు, క్షతగాత్రులు ఇంకా ఉంటారన్న  అనుమానంతో గ్రేహౌండ్స్ బలగాలు కటాఫ్ ఏరియాతోపాటు ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి.  క్షతగాత్రులు చికిత్స కోసం గ్రామాలకు వెళతారన్న ఉద్దేశంతో గ్రామాల్లోని ఆర్‌ఎంపీ డాక్టర్లను, ఇతర అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.  ఎన్‌కౌంటర్‌కు ప్రణాళిక వేసిన నాటి నుంచి గత వారం రోజులుగా గిరిపల్లెల్లో నిర్బంధం పెరిగింది. విద్యుత్ సరఫరా నిలిపివేశారు. సెల్ ఫోన్ సిగ్నళ్లను జామ్ చేశారు. ఫలితంగా గత కొన్ని రోజులుగా స్థానికులు భయాందోళనతోనే కాలం వెళ్లదీస్తున్నారు. మరోవైపు ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు మరింత బలపడుతున్నాయి. మావోల శిబిరంపై దాడి చేసి ఏకపక్షంగా కాల్చి చంపారన్న ఆరోపణలను పోలీసుల చర్యలే బలపరుస్తుండటం విశేషం.


ఏవోబీ నుంచి సాక్షి బృందం : ఆంధ్ర- ఒడిశా సరిహద్దు(ఏవోబీ) బలిమెల రిజర్వాయర్ అటవీ ప్రాంతంలో సోమవారం  తెల్లవారుజామున మావోరుుస్టులు, పోలీసులకు మధ్య జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌తో అంతటా భీతావహ  వాతావరణం చోటు చేసుకుంది. ఎప్పుడేమి జరుగుతుందోనని మారుమూల గూడేల్లోని వారు హడలిపోతున్నారు.  ఆదివాసీలు ఇళ్లను వదిలి బయటకు రావడం లేదు. పొలం పనులకు వెళ్లడానికి జంకుతున్నారు. గ్రామాల్లో నిశ్శబ్ద  వాతావరణం చోటుచేసుకుంది. ప్రధాన రహదారులు జనసంచారంలేక వెలవెలబోతున్నారుు. యువకులు,  యువతులు, పిల్లలు రోడ్లపైకి వచ్చేందుకు భయపడుతున్నారు.

 
తప్పించుకున్న వారి కోసం ముమ్మర గాలింపు..
ఎన్‌కౌంటర్ నుంచి తప్పించుకున్న ఆర్కేతో సహా ఇతర  మావోరుుస్టు అగ్రనేతల ఆచూకీ కోసం అడవులను జల్లెడ పడుతున్నారు.   వేలాదిమంది గ్రే హౌండ్‌‌స దళాలు,  స్పెషల్ పార్టీ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ జవాన్లు  కూంబింగ్ ముమ్మరం చేశారు. కటాఫ్ ఏరియాలోతాజా ఎన్‌కౌంటర్  నేపథ్యంలో ఏవోబీలోని ప్రధాన సరిహద్దులతో పాటు గ్రామాలను పోలీసు బలగాలు చుట్టు ముట్టారుు. గ్రామాల్లోకి  ఇంటింటికి వెళ్లి ఆరా తీస్తున్నాయి. మల్కన్‌గిరి పరిసర గ్రామాలన్నీ పోలీసుల గుప్పెట్లో  ఉన్నారుు. పోలీసుల బూట్ల చప్పుళ్లతో దద్ధరిల్లిపోతున్నారుు.

 
అదుపులో ఆర్‌ఎంపీలు..
ఎన్‌కౌంటర్‌లో చిన్నపాటి గాయాలతో బయటపడి ఎక్కడైనా చికిత్స పొందుతున్నారేమోననే అనుమానంతో  గిరిజన గ్రామాల్లోని ఆర్‌ఎంపీ, పీఎంపీ డాక్టర్లను అదుపులోకి తీసుకొని పోలీసులు ఆరా తీస్తున్నారు.  సానుభూతిపరుల ఇళ్లల్లో సోదాలు చేస్తున్నారు. సరిహద్దు ప్రాంతంలో వాహనాల తనిఖీ ముమ్మరమైంది.  కొత్తవారిని ఆరా తీసి విడిచిపెడుతున్నారు. చెక్‌పోస్టుల్లో భధ్రత కట్టుదిట్టం చేశారు. పోలీసుల ఆంక్షలతో గిరిజనులు  బిక్కుబిక్కమంటున్నారు.

 
సంఘటన స్థలానికి మృతుల కుటుంబాలు....
పోలీస్ కాల్పుల్లో మృతి చెందిన మున్నా తల్లి శిరీష(ఆర్కే భార్య), లత  తనయుడు మహేందర్, గాజర్ల రవి కుటుంబ సభ్యులు విశాఖకు చేరుకుని అక్కడ నుంచి సంఘటన స్థలానికి  బయలుదేరి వెళ్లారు. అదే విధంగా విరసం నాయకులు వరవరరావు, కళ్యాణరావు, ఏపీసీఎల్‌సీ రాష్ట్రాధ్యక్షుడు  వి.చిట్టిబాబు, రాజకీయ ఖైదీల విడుదల కమిటీ  కార్యదర్శి రామకష్ణ తదితరులు విశాఖకు చేరుకుని ఎన్‌కౌంటర్‌ను  తీవ్రంగా ఖండించారు.  ముమ్మాటికి బూటకపు ఎన్‌కౌంటర్లేనని..అర్ధరాత్రి నిద్రిస్తున్న వారిని మట్టుపెట్టి ఎన్‌కౌంటర్  అనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ  జరిపించాలని డిమాండ్ చేశారు. అనంతరం  సంఘటనా స్థలానికి బయల్దేరి వెళ్లారు.

 
పరిస్థితి అదుపులోనే ఉందిః డీజీపీ
సంఘటన ప్రాంతంలో ఇప్పటికీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని విశాఖలో డీజీపీ సాంబశివరావు ప్రకటించారు.  పరిస్థితి అదుపులో ఉన్నప్పటికీ ఏ క్షణాన్నా ఏం జరుగుతుందో చెప్పలేమని చెప్పుకొచ్చారు. మంగళవారం నాటి  కాల్పుల ఘటన అనంతరం తాను స్వయంగా వెళ్లి పరిస్థితులను పరిశీలించి నట్టు డీజీపీ వెల్లడించారు. మరో పక్క  నిన్నటి ఘటనలో అసువులు బాసిన కడప 11వ బెటాలియన్ సీనియర్ కమాండో అబుబారక్ కుటుం బానికి  రూ.40లక్షల చెక్కును డీజీపీ సాంబశివరావు అందజేశారు. సోమవారం విశాఖ చేరుకున్న డీజీపీ మంగళవారం  ఉదయం మల్కన్‌గిరి వెళ్లి సంఘటన స్థలాన్ని, పోస్టుమార్టం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి తిరిగి మధ్యాహ్నానికి  ప్రత్యేక హెలికాప్టర్‌లో విశాఖకు చేరుకున్నారు. అధికారులతో సమీక్షించి సాయంత్రానికి తిరిగి విజయవాడ  పయనమయ్యారు.

 
కొలుకోలేని స్థితిలో ఉద్యమం...
ఏవోబీలో ఏడాదిగా  అగ్రనేతలను కోల్పోరుు ఉద్యమం బలహీన పడుతున్న తరుణంలో తాజా ఎన్‌కౌంటర్‌తో  కోలుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఐతే ఈ ప్రాంతానికి కీలకనేతలైన ఆర్‌కే, రవి, చలపతులను కూడా ఎలాగైనా  మట్టుబెట్టాలని పోలీసు బలగాలు అడవుల్లోకి దూసుకువెళుతుంటే.. పోలీసుల దాడులను అడ్డుకునేందుకు  మిగిలివున్న దళసభ్యులు ఏ క్షణమైనా దాడి చేస్తారన్న అనుమానాలు కూడా పోలీసులకు ఉంది. తాజా  ఎన్‌కౌంటర్‌తో ఈ ప్రాంత పోలీసు స్టేషన్లను అప్రమత్తం చేస్తూ అధికార పార్టీ, మావోరుుస్టుల హిట్‌లిస్ట్‌లో ఉన్న  నేతలకు కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆంధ్ర- ఒడిశా సరిహద్దులో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.  కూంబింగ్‌కు వెళ్లిన బలగాలు ఇంకా తిరిగిరాకపోవడం, తప్పించుకున్న మావోరుుస్టుల కోసం వేటసాగిస్తుండటం  తదితర పరిణామాలు ఈ ప్రాంత గిరిజనులను మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారుు. నిన్నటి వరకు ప్రశాంతంగా  ఉన్న గిరిజనులు ఈ ఎన్‌కౌంటర్‌తో ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement