ఎన్‌కౌంటర్ మృతుల్లో ఇద్దరు జిల్లా వాసులు
మడగూడెంలో సారక్క అంత్యక్రియలు
నేడు పైడిపల్లికి చేరనున్న సృజన మృతదేహం
వరంగల్/ కొత్తగూడ : తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో మంగళవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో జిల్లాకు చెందిన ఇద్దరు మహిళా మావోరుుస్టులు మృతిచెందారు. వీరిని కొత్తగూడ మండలం మడగూడేనికి చెందిన దనసరి సారక్క అలియూస్ అనిత, హన్మకొండ మండలం పైడిపల్లికి చెందిన కొత్తకొండ సృజనగా గుర్తించారు. మావోరుుస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి యాప నారాయణ అలియూస్ హరిభూషణ్ స్వగ్రామం మడగూడెంకు చెందిన సారక్క యేడాది క్రితమే దళంలో చేరింది. కొద్దిరోజులు కొత్తగూడ ఏరియా దళ కమాండర్ భద్రు దళంలో పనిచేసి, ఆ తర్వాత ఛత్తీస్‌గఢ్ ప్రాంతానికి బదిలీ అయింది. ఉద్యమంలో ఓనమాలు నేర్చుకునే క్రమంలోనే రాష్ట్ర సరిహద్దులో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందింది.
మృతదేహాన్ని భద్రాచలం ఆస్పత్రి మార్చురీ నుంచి మడగూడెం గ్రామానికి తరలించి బుధవారం అంత్యక్రియలు పూర్తి చేశారు. బంధుమిత్రుల సంఘం నాయకులు అంజమ్మ, పద్మకుమారి, శాంతమ్మ, సత్యజ్యోతి, భారతి, విమల, డప్పు రమేష్, న్యూడెమోక్రసీ నాయకులు ప్రభాకరన్న, బూర్క చిన్నవెంకటయ్య, ములుగు మాజీ ఎమ్మెల్యే దనసరి సీతక్క తదితరులు సారక్క మృతదేహం వద్ద నివాళులర్పించారు.
ఇంటర్ చదువుతూనే ఉద్యమంలోకి..
హన్మకొండ మండలం పైడిపల్లికి చెందిన కొత్తకొండ సృజన(26) 2006 లో సీకేఎం కాలేజీలో ఇంటర్ చదువుతున్నప్పుడే మావోయిస్టు పార్టీ పట్ల ఆకర్షితురాలై ఏపీసీఎల్సీలో చేరింది. అదే సంవత్సరం డిసెంబర్‌లో ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో అరెస్టు అయి కొన్ని నెలలు జైలు జీవితం గడిపింది. ఆ తర్వాత 2007లో అజ్ఞాతంలోకి వెళ్లిన సృజన అప్పటి నుంచి ఇంటికి రాలేదని తల్లిదండ్రులు కొత్తకొండ భీమయ్య, శాంత తెలిపారు. సృజన తల్లి శాంత మావోయిస్టు బంధుమిత్రుల కమిటీలో సభ్యురాలు. మావోయిస్టు పార్టీ ఉత్తర తెలంగాణ జిల్లా కమిటీలో సభ్యురాలైన సృజన అలియాస్ కుమెన్ అలియాస్ రాగో అలియాస్ నవత పేర్లతో పని చేసినట్లు తెలిసింది. ఆమెపై ప్రభుత్వం రూ.4 లక్షల రివార్డు కూడా ప్రకటించింది. గురువారం తెల్లవారుజామున సృజన మృతదేహం పైడిపల్లికి వస్తుందని భావిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
మేనమామ బాటలోనే..
జిల్లాలో నక్సల్స్ ఉద్యమానికి పురిటిగడ్డ అరుున పైడిపల్లికి చెందిన పీపుల్స్‌వార్ నేత, దివంగత జున్ను చిన్నాలుకు కొత్తకొండ సృజన స్వయూనా మేనకోడలు. పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పీపుల్స్‌వార్‌లో చేరిన చిన్నాలు 1979లో మృతిచెందారు. ఆయన చెల్లెలు శాంత రెండవ కూతరు సృజన విప్లవ భావాలు పుణికి పుచ్చుకుంది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరిపి నిషేధం ఎత్తివేయడంతో పౌరహక్కుల సంఘం నేతలతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఆమె ఏపీసీఎల్సీ నేతలతో 2006 డిసెంబర్‌లో కొత్తగూడెంలో అరెస్టు అరుు కొన్ని నెలలు జైలు జీవితం గడిపింది. విడుదలయ్యూక సుమారు ఆరు నెలల పాటు ఇంటి వద్దనే ఉంది. 2007లో అజ్ఞాతంలోకి వెళ్లి ఇక తిరిగి రాలేదు. పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన సృజన మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందింది.
రాలిన తారలు
Published Thu, Mar 3 2016 2:17 AM | Last Updated on Sun, Sep 3 2017 6:51 PM
Advertisement
Advertisement