పోలీసుల నిర్లక్ష్యమే బలిగొంది
చెట్టంత కొడుకు.. అందివస్తాడను కున్నంతలోనే గర్భశోకం.. ఆ తల్లిదండ్రుల కన్నీటికి అంతు లేదు.. మనసున్న మిత్రుడు..జీవితాంతం తోడుంటాడని నమ్మిన స్నేహితులకు తీరని దుఃఖం..ప్రేమిస్తే చంపేస్తారా.. ఇష్టం లేకుంటే మందలిస్తే సరిపోతుందిగా..ఎందుకంత రాక్షసత్వం.. ఇది బంధుమిత్రుల ఆవేదన..పోలీసుల నిర్లక్ష్యమే బలిగొంది.. సకాలంలో స్పందిస్తే ప్రాణాలతో మిగిలేవాడు.. రాజకీయ జోక్యంతో నిందితులుతప్పించుకుంటున్నారు.. న్యాయాన్ని ఖూనీ చేస్తున్నారు.. ఇది సర్వత్రా వినిపిస్తున్న విమర్శ బుధవారం కేజీహెచ్‌లో ఇంజినీరింగ్ విద్యార్థి ప్రదీప్ మృతదేహానికి పోస్టుమార్టం జరిగింది. అనంతరం అశ్రునయనాల మధ్య అగనంపూడిలో అంత్యక్రియలు జరిగారుు.
అగనంపూడి : పోలీసుల నిర్లక్ష్యమే మా కుమారుడిని బలిగొంది.. వారు సకాలంలో స్పందించి ఉంటే మా కొడుకు బతికి ఉండేవాడు.. హంతకులకు పోలీసులు అండగా నిలవడం వల్లే ఇంత దారుణం జరిగిపోరుుంది.. అని ప్రదీప్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అవంతి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఆఖరి సంవత్సరం చదువుతున్న దానబాల ప్రదీప్ కంశికోటలో హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్య విశాఖ నగరంతోపాటు జిల్లాలోనూ తీవ్ర సంచలనం రేపింది. నిర్వాసిత కాలనీల నుంచి పెద్ద సంఖ్యలో స్థానికులు మృతుని నివాసానికి తరలివచ్చారు. అంతిమ వీడ్కోలుకు భారీ ఎత్తున మృతుని బంధువులు, స్థానికులు, విద్యార్థులు తరలివచ్చారు. ప్రదీప్‌ను చివరిసారిగా చూసి కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో అగనంపూడి శోకసంద్రలో మునిగిపోరుుంది.
పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు
పోలీసుల నిర్లక్ష్యం వల్లే ప్రదీప్ హత్యకు గురయ్యాడని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నారుు. బుదిరెడ్డి చిన్న, అతని అనుచరులు ప్రదీప్‌ని హింసించి అపహరించుకుపోయారని గత నెల 28న కశింకోట పోలీసులకు హతుని బంధువులు, స్నేహితులు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం వల్లే దారుణం జరిగిపోరుుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదుదారులను స్టేషన్‌లోనే హంతకులు బెదిరిస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని మృతిని బంధువులు ఆరోపిస్తున్నారు. దీపావళి నాడు చిన్న, మరికొంత మంది ప్రదీప్‌మెడలోని బంగారు గొలుసు, సెల్‌ఫోన్ తెచ్చి ఎస్‌ఐకి ఇస్తే... అసలు వ్యక్తి లేకుండా గొలుసు, సెల్‌ఫోన్ ఎక్కడివని కనీసం అడగకుండా వారిని వదిలేయడం వెనుక ఎస్‌ఐ, పోలీసుల పాత్ర ఉందని బంధువులు, సహచర విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.