లాలాపేట(కొందుర్గు): నెల రోజుల క్రితం పూడ్చిపెట్టిన శవాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించిన సంఘటన మండలంలోని ఉమ్మెంత్యాల గ్రామపంచాయతీ లాలాపేట గ్రామంలో జరిగింది. ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మక్తల చెన్నమ్మ(39) జూన్ 15న ఇంట్లో వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు నిప్పంటుకుని గాయపడింది. దీంతో కుటుంబ సభ్యులు చికిత్స కోసం హైద్రాబాద్ ఉస్మానియాస్పత్రికి తరలించగా, చికిత్స పొంది ఇంటికి వచ్చింది. కాగా పరిస్థితి విషమించి సెప్టెంబర్ రెండవ వారంలో ఆమె మృతి చెందడంతో కుటుంబ సభ్యులు మృతదేహన్ని ఖననం చేశారు. అయితే పోలీసులు శుక్రవారం తహసీల్దార్ పాండు, షాద్‌నగర్ రూరల్ సీఐ మదుసూధన్ సమక్షంలో మృతదేహన్ని వెలికితీసి, డాక్టర్ తకియోద్దీన్ ఆధ్వర్యంలో పోస్టుమార్టం చేయించారు.