Prem Raj
-
సెన్సార్ బోర్డ్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత, ఫర్నీచర్ ధ్వంసం
రిజర్వేషన్ ప్రక్రియను ప్రశ్నిస్తూ ప్రేమ్ రాజ్ దర్శకత్వంలో బొమ్మకు మురళి నిర్మించిన సినిమా శరణం గచ్చామి. ఈ సినిమా రాజ్యంగానికి వ్యతిరేకంగా ఉందంటూ సెన్సార్ బోర్డ్ సభ్యులు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే.. దీంతో చిత్రయూనిట్ సెన్సార్ బోర్డ్‌పై పోరాటం చేస్తోంది. తాజాగా ఈ పోరాటంలో విద్యార్థులు కూడా చేరారు. ఓయూ కు చెందిన దళిత, గిరిజన విద్యార్థులు శరణం గచ్ఛామి సినిమాకు అనుమతివ్వాలంటూ సెన్సార్ బోర్డ్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఆఫీస్ లో ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. -
సెన్సార్ తిరస్కరణపై సమరం : శరణం గచ్ఛామి టీం
ఇటీవల కాలం సెన్సార్ బోర్డ్ తీరు వివాదాస్పదమవుతోంది. సున్నితమైన అంశాలతో తెరకెక్కిన పలు చిత్రాల విషయంలో సెన్సార్ బోర్డ్ తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. ఇటీవల బాలీవుడ్ లోనూ సెన్సార్ బోర్డ్ తీరు వివాదాస్పదం కాగా.. తాజాగా చిన్న సినిమాగా తెరకెక్కిన ఓ తెలుగు సినిమా యూనిట్ ఏకంగా సెన్సార్ బోర్డ్‌పై యుద్ధం ప్రకటించింది. రిజర్వేషన్ ప్రక్రియను ప్రశ్నిస్తూ ప్రేమ్ రాజ్ దర్శకత్వంలో బొమ్మకు మురళి నిర్మించిన సినిమా శరణం గచ్చామి. ఈ సినిమా రాజ్యంగానికి వ్యతిరేకంగా ఉందంటూ సెన్సార్ బోర్డ్ సభ్యులు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో చిత్రయూనిట్ సెన్సార్ బోర్డ్‌పై పోరాటానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే జాతీయ సెన్సార్ బోర్డ్‌ను ఆశ్రయించిన చిత్రయూనిట్ తమ సినిమాలో ఎలాంటి వివాదాస్పద అంశాలు లేవని కేవలం యువతను ఆలోచింప చేసేదిగా చిత్రాన్ని తెరకెక్కించామని తెలిపారు. 'అసభ్యత, అశ్లీలతలకు పెద్ద పీట వేస్తూ.. హింసను ప్రేరేపిస్తూ, యువతను పెడ దారి పట్టించే సినిమాలకు క్లీన్ సర్టిఫికెట్స్ జారీ చేసే సెన్సార్ బోర్డ్.. యువతరాన్ని మేల్కొలుపుతూ.. మేధావులను సైతం ఆలోచింపజేస్తూ.. క్లీన్ ఎంటర్టైనర్గా.. రూపొందించిన తమ శరణం గచ్ఛామి సినిమాను అడ్డుకోవడం తమకు ఆశ్చర్యాన్ని, ఆవేదనను కలిగిస్తోంద'ని అంటున్నారు చిత్ర నిర్మాత బొమ్మకు మురళి, దర్శకుడు ప్రేమ్ రాజ్. సహేతుకమైన కారణాలు చూపకుండా.. రివైజింగ్ కమిటీకి వెళ్లమనడాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. తమ సినిమాకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని తెలియజేశారు. -
'సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వనంటున్నారు'
దర్శకుడు ప్రేమ్ రాజ్ తెరకెక్కించిన శరణం గచ్ఛామి సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు సెన్సార్‌బోర్డ్ నిరాకరించటంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయటంపై తెరకెక్కించిన ఈ సినిమా రాజ్యంగంలోని పలు నింబధనలను ఉల్లంఘించిందన్న కారణంతో సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే తన సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలను, డైలాగ్‌లను తొలగించేందుకు తాను సిద్ధమని అలాంటివేవీ చెప్పకుండా సర్టిఫికేట్ ఇవ్వకపోవటం అన్యాయం అంటున్నారు దర్శకుడు ప్రేమ్ రాజ్. ప్రాంతీయ సెన్సార్‌బోర్డ్ సెన్సార్‌కు నిరాకరించటంతో ప్రస్తుతం కేంద్ర సెన్సార్‌బోర్డ్‌ను ఆశ్రయించినట్టుగా తెలిపారు. ఇటీవల సెన్సార్‌బోర్డ్ నిర్ణయాలు వివాదాస్పద మవుతున్న నేపథ్యంలో శరణం గచ్ఛామి విషయంలో కేంద్ర సెన్సార్ బోర్డ్, ఏ నిర్ణయం తీసుకోనుందన్న విషయం ఆసక్తికరంగా మారింది. -
సత్యవాణి మృతదేహం కుటుంబీకులకు అప్పగింత
శామీర్‌పేట్: సత్యవాణి మృతదేహాన్ని గురువారం అధికారులు కుటుంబీకులకు అప్పగించారు. సత్యవాణి(25) బుధవారం రాత్రి కుటుంబీకులతో కలిసి సికింద్రాబాద్ రేతిఫైల్ సమీపంలోని ఉప్పల్ బస్టాప్ వద్ద ఉండగా భారీ వర్షానికి నాలాలో పడి గల్లంతై మృతిచెందిన విషయం తెలిసిందే. గుంటూరు జిల్లా ఈపూర్ మండల కేంద్రానికి చెందిన ప్రేంరాజ్ ఏడేళ్ల క్రితం అలియాబాద్‌కు చెందిన సత్యవాణిని వివాహం చేసుకున్నాడు. ప్రేంరాజ్ స్థానిక బిన్నీ మిల్లులో పనిచేస్తున్నాడు. దంపతులు కంపెనీ క్వార్టర్స్‌లో ఉంటున్నారు. బుధవారం దంపతులు బంధువులతో కలిసి నగరంలోని ఓ శుభకార్యానికి వెళ్లారు. రాత్రి తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ రేతిఫైల్ సమీపంలోని ఉప్పల్ బస్టాప్ వద్ద భారీ వర్షానికి సత్యవాణి నాలాలో గల్లంతై మృతిచెందింది. విషయం తెలుసుకున్న అలియాబాద్ గ్రామస్తులు గురువారం ఉదయం పెద్ద ఎత్తున నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలివెళ్లారు. జీహెచ్ఎంసీ నిర్లక్షంతోనే వివాహిత మృత్యువాత పడిందని మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. జీహెచ్ఎంసీ అధికారులు రూ. 2 లక్షలు పరిహారం ప్రకటించారు. పోస్టుమార్టం అనంతరం అధికారులు సత్యవాణి మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించడంతో గుంటూరు జిల్లా ఈపూర్‌కు తీసుకెళ్లారు.