సెన్సార్ బోర్డ్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత, ఫర్నీచర్ ధ్వంసం
రిజర్వేషన్ ప్రక్రియను ప్రశ్నిస్తూ ప్రేమ్ రాజ్ దర్శకత్వంలో బొమ్మకు మురళి నిర్మించిన సినిమా శరణం గచ్చామి. ఈ సినిమా రాజ్యంగానికి వ్యతిరేకంగా ఉందంటూ సెన్సార్ బోర్డ్ సభ్యులు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే.. దీంతో చిత్రయూనిట్ సెన్సార్ బోర్డ్పై పోరాటం చేస్తోంది. తాజాగా ఈ పోరాటంలో విద్యార్థులు కూడా చేరారు. ఓయూ కు చెందిన దళిత, గిరిజన విద్యార్థులు శరణం గచ్ఛామి సినిమాకు అనుమతివ్వాలంటూ సెన్సార్ బోర్డ్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఆఫీస్ లో ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు.