'సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వనంటున్నారు' | Saranam Gacchami Movie Was Rejected By The Censor Board | Sakshi
Sakshi News home page

'సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వనంటున్నారు'

Published Sat, Jan 28 2017 11:32 AM | Last Updated on Tue, Sep 5 2017 2:21 AM

'సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వనంటున్నారు'

'సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వనంటున్నారు'

దర్శకుడు ప్రేమ్ రాజ్ తెరకెక్కించిన శరణం గచ్ఛామి సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు సెన్సార్బోర్డ్ నిరాకరించటంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయటంపై తెరకెక్కించిన ఈ సినిమా రాజ్యంగంలోని పలు నింబధనలను ఉల్లంఘించిందన్న కారణంతో సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిరాకరించింది.

అయితే తన సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలను, డైలాగ్లను తొలగించేందుకు తాను సిద్ధమని అలాంటివేవీ చెప్పకుండా సర్టిఫికేట్ ఇవ్వకపోవటం అన్యాయం అంటున్నారు దర్శకుడు ప్రేమ్ రాజ్. ప్రాంతీయ సెన్సార్బోర్డ్ సెన్సార్కు నిరాకరించటంతో ప్రస్తుతం కేంద్ర సెన్సార్బోర్డ్ను ఆశ్రయించినట్టుగా తెలిపారు. ఇటీవల సెన్సార్బోర్డ్ నిర్ణయాలు వివాదాస్పద మవుతున్న నేపథ్యంలో శరణం గచ్ఛామి విషయంలో కేంద్ర సెన్సార్ బోర్డ్, ఏ నిర్ణయం తీసుకోనుందన్న విషయం ఆసక్తికరంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement