శామీర్‌పేట్: భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న ఓ భర్త ఆమెను కడతేర్చాడు. రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట్ మండలంలో సోమవారం రాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. బాలాజీనగర్‌లోని చుక్కమ్మ బస్తీకి చెందిన రాజేష్, గౌతమి(25) దంపతులకు ఐదేళ్ల కూతురు ఉంది.
దంపతుల మధ్య సోమవారం రాత్రి గొడవ జరిగింది. తీవ్ర ఆగ్రహంతో ఉన్న రాజేష్ బెల్టుతో భార్యను మెడ నులిమి చంపేశాడు. ఆమెపై అనుమానంతోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని చుట్టుపక్కల వారు అంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
అనుమానంతో భార్యను చంపేశాడు
Published Tue, Apr 26 2016 11:15 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM
Advertisement
Advertisement