సాక్షి, వర్గల్ (గజ్వేల్): ప్రేమికుడి మాటలు నమ్మింది..పెళ్లి చేసుకుందాం అనగానే ఒంటరిగా గడప దాటింది.. గుడి వద్ద ప్రియుడి కోసం ఉదయం నుంచి రాత్రి వరకు ఎదురుచూసినా అతను రాలేదు. దీంతో ఆందోళనకు గురైన ఆ యువతి వెంటనే పోలీసులకు ఫోన్ చేసింది. పోలీసుల సాయంతో సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేరడంతో కథ సుఖాంతమైంది. మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలం దేవరయాంజాల్‌కు చెందిన యువతి (18) అదే జిల్లాలోని మేడ్చల్ సమీప గ్రామానికి చెందిన బాలకృష్ణ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ నెల 14న ఉదయం 10 గంటలకు సిద్దిపేట జిల్లా నాచారం గుట్ట దేవాలయంలో పెళ్లి చేసుకుందాం రమ్మని ప్రేమికుడు చెప్పిన మాటలను నమ్మింది. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా నాచారం గుట్టకు చేరుకుంది. చదవండి: భార్య అశ్లీల చిత్రాలు ఫేస్‌బుక్‌లో పోస్ట్
రాత్రి 9 గంటలు దాటుతున్నా ప్రేమికుడు రాలేదు. అతడు మొహం చాటేశాడని అర్థమైంది. దీంతో తీవ్ర ఆందోళనకు గురై డయల్ 100కు ఫోన్ చేసి పరిస్థితిని వివరించింది. దీంతో వర్గల్ మండలంలో పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న గౌరారం ఏఎస్సై మధుసూదన్‌రావు, బ్లూ కోల్ట్ సిబ్బంది కానిస్టేబుల్ శ్రీనివాస్, హోంగార్డు దయాకర్, యాదగిరి వెంటనే గుడి వద్దకు చేరుకున్నారు. యువతితో మాట్లాడి వివరాలు తెలుసుకొని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. సకాలంలో స్పందించి తమ కూతురును అప్పగించినందుకు యువతి తల్లిదండ్రులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. చదవండి : క్లాసులంటూ పిలిచి.. పసిమొగ్గలపై అఘాయిత్యం
Comments
Please login to add a commentAdd a comment